Krishna Kowshik
2023కు గుడ్ బై చెప్పి.. 2024లోకి ఇలా ఎంటర్ అయ్యామో లేదో.. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మరణించారన్న వార్తలు వినిపించాయి. తాజాగా మరో ప్రముఖ దర్శకుడు కన్నుమూశారు.
2023కు గుడ్ బై చెప్పి.. 2024లోకి ఇలా ఎంటర్ అయ్యామో లేదో.. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మరణించారన్న వార్తలు వినిపించాయి. తాజాగా మరో ప్రముఖ దర్శకుడు కన్నుమూశారు.
Krishna Kowshik
2024 సంవత్సరం మొదలై పట్టుమని పది రోజులు కూడా పూర్తి కాలేదు కానీ..సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు మృత్యువాత పడ్డారు. గత ఏడాది చివరిలో తమిళ ఇండస్ట్రీ స్టార్ నటుడు విజయ్ కాంత్ మరణించారన్న వార్తను జీర్ణించుకునే లోపు మరో బ్యాడ్ న్యూస్ వచ్చింది. టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి విదితమే. ఆయన తండ్రి గాదె సూర్య ప్రకాశరావు మరణించారు. అంతలో ప్రముఖ జర్నలిస్ట్, సినీ దర్శకుడు కె జయదేవ్ గుండె పోటుతో కన్నుమూశారు. టాలీవుడ్ ప్రముఖ కమెడియన్, బుల్లితెర నటుడు అవినాష్ ఇంట్లో కూడా విషాదం నెలకొంది. పురిటిలోనే బిడ్డను పోగొట్టుకుని శోక సంద్రంలో మునిగిపోయింది ముక్కు అవినాష్ జంట.
నిన్నటికి నిన్న ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్ కన్నుమూశారు. ఇప్పుడు మరో దర్శకుడు మరణించారన్న వార్త బయటకు వచ్చింది. మళయాల దర్శకుడు విను అనారోగ్య సమస్యలతో బుధవారం కన్నుమూశారు. కొన్ని రోజుల నుండి ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కోయంబత్తూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో దర్శకుడు సురేష్‌తో కలిసి మంగళం విట్టిల్ మానసేశ్వకరి గుప్తా అనే చిత్రంతో డైరెక్టర్‌గా మారారు విను. ఇందులో వాణి విశ్వనాథ్, జయరాం (ప్రస్తుతం తెలుగులో ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు) హీరో హీరోయిన్లు. కుశృతికాటుకి అనే మూవీకి దర్శకత్వం వహించారు.
దీంతో వీరిద్దరికీ దర్శక ద్వయంగా పేరొచ్చింది. ఈ ఇద్దరి కాంబోలో కణిచుకులంగరైల్ సీబీఐ అనే మూవీ చివరిగా చ్చింది. జయరాం హీరోగా నటించిన మేలేపరంబిల్ అన్వీడు సినిమా అస్సామీ వెర్షన్‌కి విను డబ్బింగ్ చెప్పాడు. వినుకు భార్య అనురాధ కృష్ణన్, పిల్లలు నిమిశ్,మోనికా ఉన్నారు.గురువారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోయంబత్తూరులోని సింగనల్లూర్ శ్మశాన వాటికలో జరగనున్నాయి. ఆయన మృతికి మాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ ఏడాది మొదలై.. రెండు వారాలు కూడా పూర్తి కానే లేదు.. ప్రముఖులు చనిపోతుండటం విషాదకరం.