iDreamPost
android-app
ios-app

‘హిట్ 2’లో కనిపించిన డాగ్ కన్నుమూత! డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

  • Author ajaykrishna Published - 01:48 PM, Fri - 14 July 23
  • Author ajaykrishna Published - 01:48 PM, Fri - 14 July 23
‘హిట్ 2’లో కనిపించిన డాగ్ కన్నుమూత! డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

టాలీవుడ్ లో హిట్ సిరీస్ తో మంచి విజయాలు అందుకున్న దర్శకుడు శైలేష్ కొలను. విశ్వక్ సేన్ తో మొదటి హిట్ మూవీ తీసిన ఈ డైరెక్టర్.. గతేడాది అడివి శేష్ తో హిట్ 2 తీసి మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు పార్ట్స్ సూపర్ హిట్స్ అయ్యేసరికి.. దీనికి మూడో భాగం కూడా ఉంటుందని.. అందులో నేచురల్ స్టార్ నాని హీరోగా చేస్తాడని ముందే హింట్ ఇచ్చేశాడు. సరే.. నెక్స్ట్ నానితో హిట్ 3 చేస్తాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ.. ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని విధంగా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో ‘సైందవ్’ అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన హీరో వెంకటేష్ మాసీవ్ లుక్ ఫ్యాన్స్ విశేషంగా ఆకట్టుకుంది.

ప్రస్తుతం సైందవ్ షూటింగ్ చకచకా పూర్తి చేస్తున్నారు. కానీ.. తాజాగా డైరెక్టర్ శైలేష్.. ఓ విషాదకరమైన వార్తను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. హిట్ 2 మూవీలో మ్యాక్స్ గా మనల్ని అలరించిన డాగ్ మీకు గుర్తుండే ఉంటుంది. ఆ కుక్క చనిపోయిందని చెప్పాడు. సినిమాలో హీరోని కాపాడే ఇంపార్టెంట్ రోల్ లో మ్యాక్స్ మెరిసింది. ఆ సీన్ సినిమా చూసిన ఆడియన్స్ అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. హిట్ 2 ప్రమోషన్స్ లోను మ్యాక్స్ తో ప్రత్యక్షమయ్యారు చిత్రయూనిట్. అలాంటి డాగ్.. కొద్దిరోజులుగా టిక్ ఫీవర్ బారినపడి మరణించింది అని శైలేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శైలేష్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకీ.. ట్వీట్ లో శైలేష్ ఏమని చెప్పుకొచ్చాడంటే.. ‘ఓ బాధాకరమైన వార్త మీ అందరితో చెప్పాలి. మన ఫేవరేట్ మనకు ఎంతో ఇష్టమైన మ్యాక్స్ చనిపోయింది. పది రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఎంతో నరకం చూసింది. ఇప్పుడు అది లేదు. మ్యాక్స్ స్పెషల్ బ్రీడ్ అయినా అలాంటిదాన్ని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. దాని ఆరోగ్యం కోలుకోవాలని ప్రే చేసిన మీ అందరికి ధన్యవాదాలు. నేను మ్యాక్స్‌ ను చాలా మిస్ అవుతున్నాను. అది లేకపోయి ఉంటే హిట్ 2 మూవీ.. అలా ఉండేది కాదు’ అని ఎంతో ఎమోషనల్ అవుతూ పేర్కొన్నాడు. దీంతో మ్యాక్స్ లేదని తెలిసి హిట్ సిరీస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరి మ్యాక్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetimajbetcasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetmoney girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom