iDreamPost

కల్కి టికెట్స్ రేట్లు వరం కాబోతున్నాయా? శాపం కాబోతున్నాయా?

kalki 2898 AD Ticket Price: బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ మూవీస్ తర్వాత టాలీవుడ్ నుంచి రాబోతోంది ఈ కల్కి 2898 ఏడీ సినిమా. మామూలుగా రాజమౌళి సినిమాలకు మాత్రమే ఉండే హైప్‌ను ఈ సినిమా కూడా బాగా రాబట్టుకోగలిగింది.

kalki 2898 AD Ticket Price: బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ మూవీస్ తర్వాత టాలీవుడ్ నుంచి రాబోతోంది ఈ కల్కి 2898 ఏడీ సినిమా. మామూలుగా రాజమౌళి సినిమాలకు మాత్రమే ఉండే హైప్‌ను ఈ సినిమా కూడా బాగా రాబట్టుకోగలిగింది.

కల్కి టికెట్స్ రేట్లు వరం కాబోతున్నాయా? శాపం కాబోతున్నాయా?

పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం కల్కి 2898ఏడీ. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ మూవీస్ తర్వాత టాలీవుడ్ నుంచి రాబోతోంది ఈ కల్కి 2898 ఏడీ సినిమా. మామూలుగా రాజమౌళి సినిమాలకు మాత్రమే ఉండే హైప్‌ను ఈ సినిమా కూడా బాగా రాబట్టుకోగలిగింది. జూన్ 27వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు  రెడీ అవుతోంది. ఇప్పటికే చిత్రం బృందం ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో కల్కి సినిమాకు సంబంధించి టికెట్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం టికెట్ల ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి.. ఇలా పెరిగిన టికెట్స్ రేట్లు కల్కికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

వైజయంతీ మూవీస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ మూవీ తెరకెక్కింది. డార్లింగ్‌ అభిమానులు అయితే జూన్ 27 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కల్కి నుంచి ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్లు, టీజర్‌ లు ప్రేక్షకుల్లో భారీగా అంచనాలను పెంచేశాయి. ఈ హైప్‌ను క్యాష్‌ చేసుకునేందుకు కల్కి టీమ్‌ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే టికెట్‌ ధరల పెంపుపై రెండు తెలుగు ప్రభుత్వాలను విజ్ఞప్తి చేసింది. తెలంగాణ సర్కార్‌ ఇందుకు ఆమోదం తెలిపింది. దీంతో కల్కి మూవీ టికెట్ల ధరలు పెరిగాయి.

Kalki Tickets price

రాష్ట్రంలో జూన్‌ 27 నుంచి జూలై 4 వరకు అంటే 8 రోజుల పాటు.. కల్కి టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ అనుమతిచ్చింది.  అదే విధంగా జూన్‌ 27న ఉదయం 5:30 గంటలకు బెన్‌ఫిట్ షో వేసుకోవడానికి కూడా అంగీకారం తెలిపింది. అలానే ఒక్కో టికెట్‌పై గరిష్టంగా రూ.200 పెంచుకోవచ్చని పేర్కొన్నారు. ఇక ఈ సినిమా టికెట్‌ రేటు విషయానికి వస్తే.. సాధారణ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.70, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  అంటే పెరిగిన ధరలు బట్టి చూస్తే బెన్‌ఫిట్ షో కోసం సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ఒక్క టికెట్‌ కోసం రూ.377 కాగా మల్టీఫ్లెక్స్‌ల్లో దాదాపు రూ.500 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

మిగతా రోజుల్లో మూములు థియేటర్లలో రూ.265, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.413 రూపాయలుగా కల్కి టికెట్‌ ధర ఉండనుంది. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో పెరిగిన ధరలు సినిమాకు అనుకూలంగా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయా పడుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకలు సినిమాకు క్యూ కడితే.. పెరిగిన ధరల ప్రకారం.. కల్కి సినిమా మంచి వసూళ్లు రాబడుతుంది. అంతేకాక తక్కువ సమయంలోనే ఎక్కువగా కలెక్షన్లు రాబట్టవచ్చు.  పెరిగిన ధర విషయంలో మరో కోణ  చూసినట్లు అయితే ఇద్దరు జంట సినిమాకు మల్టీప్లెక్స్ లో వెళ్లాలంటే..దాదాపు వెయ్యి రూపాయలు అవుతుంది.

 

దీని బట్టి ప్రేక్షకులు పెరిగిన ధరలను చూసి..కాస్తా వెనుకడుగు వేస్తే.. అది సినిమాపు మైనస్ అయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయా పడుతున్నారు. అంతేకాక కుటుంబ సమేతంగా వెళ్లే చూసేందుకు కూడా కాస్తా వెనుకడు వేస్తే.. అది కలెక్షన్ పై ప్రభావం చూపుతుందని టాక్. కానీ  ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కి.. భారీగా ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తే మాత్రం పెరిగిన టికెట్ల ధరలు కల్కీ మూవీకి వరంగా మారుతాయి. అయితే పెరిగిన టికెట్లు ధరలు, కల్కీకి వరమా?శాపమా? అనేది తెలియాలంటే.. సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి