Krishna Kowshik
నాని, మృణాల్ ఠాకూర్ నటించిన చిత్రం హాయ్ నాన్న. గత ఏడాది డిసెంబర్ 7న విడుదలైన ఈ సినిమా.. మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఓటీటీల్లోనూ సందడి చేసింది. ఇప్పుడు టీవీలో ప్రసారం కానుంది.
నాని, మృణాల్ ఠాకూర్ నటించిన చిత్రం హాయ్ నాన్న. గత ఏడాది డిసెంబర్ 7న విడుదలైన ఈ సినిమా.. మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఓటీటీల్లోనూ సందడి చేసింది. ఇప్పుడు టీవీలో ప్రసారం కానుంది.
Krishna Kowshik
న్యాచులర్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ నటించిన చిత్రం హాయ్ నాన్న. గత ఏడాది డిసెంబర్‌లో థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా నిలిచింది. డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలై, మంచి కలెక్షన్లను రాబట్టుకుంది. ఈ చిత్రంలో నాని, చైల్డ్ ఆర్టిస్ట్ కియారా ఖన్నా మధ్య బాండింగ్ సూపర్ అనిపించింది. పాప నటకు ఫిదా కానీ వారుండరు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మించారు. శౌర్యువ్ ఈ సినిమాకు దర్శకుడు. తొలి మూవీతోనే ఫీల్ గుడ్ మూవీ అందించాడు డైరెక్టర్.
ఇక ఈ సినిమా ఓటీటీలో కూడా విడుదలై మంచి వ్యూస్ రాబట్టుకుంది. 2024 జనవరి 4 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మూవీ విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. తొలి వారం తెలుగుతో పాటు హిందీ (హాయ్ పాపా) భాషల్లో విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. 50 రోజులు నుండి స్ట్రీమింగ్ అవతున్న ఈ చిత్రం.. ఇండియాలో టాప్ 10లోనే కొనసాగుతుంది. కాగా, ఇప్పుడు ఇది టెలివిజన్‌లో సందడి చేసేందుకు సిద్దమౌతుంది. ప్రముఖ టీవీ ఛానల్ జెమినీ.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఇప్పటికే మార్చిలో తమ ఛానల్లో ప్రసారం కాబోతుంది అంటూ ప్రచారం ఊదరగొట్టిన.. జెమినీ టీవీ.. ఎట్టకేలకు డేట్ ఎనౌన్స్ చేసింది.
మార్చి 17న వరల్డ్ టెవిజన్ ప్రీమియర్ ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ‘మార్చి నెలకు హాయ్ నాన్న డేట్‌తో స్వాగతం పలుకుతున్నాం. మార్చి 17న హాయ్ నాన్న మీకు ప్రేమలు, నవ్వులు, లెక్కలేనన్న ఎమోషన్స్ ఇవ్వడానికి వస్తోంది’ అనే క్యాప్షన్ తో ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేసింది. హాయ్ నాన్న చిత్రంలో జయరాం, ప్రియదర్శి, అంగద్ బేడీ, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన మ్యూజిక్ అందించగా.. చార్ట్ బస్టర్ గా నిలిచింది. థియేటర్లలో విడుదలైన మూడు నెలలకు ఈ మూవీ టీవీల్లో ప్రసారం కావస్తోంది. ఇక థియేటర్లలో, ఓటీటీల్లో మిస్ అయినవాళ్లు ఉంటే.. టీవీల్లో చూసేయోచ్చు. ఇప్పటికే ఈ పిక్చర్ వాచ్ చేసి ఉంటే.. ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.