iDreamPost
android-app
ios-app

స్టార్ ప్రొడ్యూసర్ తో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్ త్రిష!

స్టార్ ప్రొడ్యూసర్ తో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్ త్రిష!

నటి త్రిష తన అందం అభినయంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా తెలుగులో ప్రభాస్ సరసన వర్షం సినిమాలో నటించిన త్రిషకు క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో త్రిషకు మంచి గుర్తింపు వచ్చి సినీ అవకాశాలు క్యూకట్టాయి. కాగా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ త్రిష త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. 40 ఏళ్ల వయసున్న నటి త్రిష పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓ స్టార్ ప్రొడ్యూసర్ ను వివాహమాడనున్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు వినిపిస్తోంది.

సీనియర్ హీరోయిన్ త్రిష త్వరలో తన బ్యాచ్‌లర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టనుంది. దాదాపు 15 ఏళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన నటి త్రిష ఆ తర్వాత సినీ అవకాశాలు తగ్గిపోయాయి. అయితే లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన 96 సినిమా త్రిష కెరీర్ కు మళ్లీ బూస్ట్ ఇచ్చింది. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ లో అవకాశం దక్కించుకుని హిట్ అందుకుంది. కాగా నటి త్రిష త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోందట. మలయాళి పరిశ్రమకు చెందిన స్టార్ ప్రొడ్యూసర్ ను పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. తన పెళ్లిపై వస్తున్న వార్తల పట్ల హీరోయిన్ త్రిష ఇప్పటి వరకు స్పందించలేదు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş