iDreamPost
android-app
ios-app

యంగ్ హీరోయిన్ శ్రీలల అంటే యాక్టింగ్, డ్యాన్సే కాదు.., ఇది కూడా!

  • Published Aug 27, 2023 | 3:16 PM Updated Updated Dec 09, 2023 | 6:22 PM

నటనా కౌశల్యంతో తన సత్తా ఏంటో అందరికీ చూపించింది. ఈ మూవీతోనే శ్రీలీల అందరికీ తెలిసిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ద్వారా మాస్ మహారాజ రవితేజతో కలిసి ధమాక మూవీలో నటించే అవకాశాన్ని అందుకుంది.

నటనా కౌశల్యంతో తన సత్తా ఏంటో అందరికీ చూపించింది. ఈ మూవీతోనే శ్రీలీల అందరికీ తెలిసిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ద్వారా మాస్ మహారాజ రవితేజతో కలిసి ధమాక మూవీలో నటించే అవకాశాన్ని అందుకుంది.

  • Published Aug 27, 2023 | 3:16 PMUpdated Dec 09, 2023 | 6:22 PM
యంగ్ హీరోయిన్ శ్రీలల అంటే యాక్టింగ్, డ్యాన్సే కాదు.., ఇది కూడా!

యంగ్ హీరోయిన్ శ్రీలీల.. పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ గ్లామరెస్ బ్యూటీ.., తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకుంది. నటనా కౌశల్యంతో తన సత్తా ఏంటో అందరికీ చూపించింది. ఈ మూవీతోనే శ్రీలీల అందరికీ తెలిసిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ద్వారా మాస్ మహారాజ రవితేజతో కలిసి ధమాక మూవీలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఈ మూవీ విడుదలై సూపర్ హిట్ సాధించడంతో ఈ ముద్దుగుమ్మ రేంజ్ ఇంకాస్త పెరిగింది. అలా ఒకటి తర్వాత ఒకటి అనేక మూవీ ఆఫర్లు రావడంతో ప్రస్తుతం శ్రీలీల చేతి నిండా సినిమాలతో తెగ బిజీగా మారిపోయింది.

అయితే ఇప్పటి వరకు ఆమె నటించిన మూవీల్లో యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ లో సైతం ఇరగదీసింది ఈ యంగ్ హీరోయిన్. దీంతో అప్పటి నుంచి ఈ అందాల సుందరికి అభిమానులు కాస్త ఎక్కువయ్యారు. మరో విషయం ఏంటంటే? ఈ ముద్దుగుమ్మ తనలో ఇన్నాళ్లు దాగి ఉన్న మరో టాలెంట్ ను బయటకు తీసింది. అదేంటి అంటారా? పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో రామ్ పోతినేని, శ్రీలీల హీరోయిన్ గా నటించిన చిత్రం స్కంద. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ హీరోయిన్ శ్రీలీలతో ప్రత్యేకంగా ఓ సాంగ్ పాడించారు. ఎలాంటి అదురు బెదురు లేకుండా ఈ ముద్దుగుమ్మ తన గాత్రంతో అందరికీ షాకిచ్చింది. అద్భుతమైన గాత్రంతో వావ్ అనిపించేలా పాడి సూపర్బ్ అనిపిస్తుంది. ఇది చూసిన అందరూ.. శ్రీలీల అంటే యాక్టింగ్, డ్యాన్సే కాకుండా ఆమెలో ఓ సింగర్ కూడా దాగి ఉన్నాడు అంటూ మెచ్చుకుంటున్నారు. హీరోయిన్ శ్రీలీల పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఈ మూవీ సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం గనుక విజయం సాధిస్తే ఈ అమ్మడు రేంజ్ ఇంకాస్త పెరగడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇది కూడా చదవండి: బాలయ్యపై రామ్ పోతినేని పొగడ్తలు.. ఇది ప్రతి ఒక్కరి డ్రీమ్ అవ్వాలంటూ..!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom