iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి త్వరలో.. ఇండస్ట్రీలోని ఓ పెద్ద ఫ్యామిలీకి కోడలు కాబోతుంది!

  • Published Aug 08, 2024 | 1:36 PM Updated Updated Aug 08, 2024 | 1:36 PM

Pic Talk: పై ఫోటోలో చీరకట్టులో కనిపిస్తున్న ఈ క్యూట్ చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఈమె ఇండస్ట్రీలో నార్త్ నుంచి సౌత్ వరకు వరుస సినిమాలతో అలరిస్తున్న క్రేజీ హీరోయిన్. ముఖ్యంగా ఈ బ్యూటీ ఇప్పుడు ఓ యంగ్ స్టార్ హీరోకి భార్యగా, పెద్ద ఫ్యామిలీకి కోడలు కాబోతుంది. ఎవరో గుర్తుపట్టారా..

Pic Talk: పై ఫోటోలో చీరకట్టులో కనిపిస్తున్న ఈ క్యూట్ చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఈమె ఇండస్ట్రీలో నార్త్ నుంచి సౌత్ వరకు వరుస సినిమాలతో అలరిస్తున్న క్రేజీ హీరోయిన్. ముఖ్యంగా ఈ బ్యూటీ ఇప్పుడు ఓ యంగ్ స్టార్ హీరోకి భార్యగా, పెద్ద ఫ్యామిలీకి కోడలు కాబోతుంది. ఎవరో గుర్తుపట్టారా..

  • Published Aug 08, 2024 | 1:36 PMUpdated Aug 08, 2024 | 1:36 PM
ఈ చిన్నారి త్వరలో.. ఇండస్ట్రీలోని ఓ పెద్ద ఫ్యామిలీకి కోడలు కాబోతుంది!

మోడలింగ్ రంగం నుంచి కెరీర్ మొదలుపెట్టి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఇలా ఎంట్రీ ఇచ్చిన వారిలో తెలుగు ముద్దుగుమ్మలు కూడా ఉండటం గమన్హారం. కానీ, తెలుగమ్మాయిలంటే.. మొదటి నుంచి ఇండస్ట్రీకి చిన్నచూపని, ఆఫర్స్ పెద్దగా రావాని వాదన ఎప్పటి నుంచే వినిపిస్తునే ఉంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబేయే ఓ హీరోయిన్ మాత్రం పేరుకు తెలుగమ్మాయి కానీ..ఒక మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి, హీరోయిన్ గా ఎదిగి మొదట బాలీవుడ్ లోనే మెరిసింది. ఈ క్రమంలోనే.. తన నటనతో, గ్లామర్ తో నార్త్ నుంచి సౌత్ ఇండస్ట్రీ వరకు మంచి క్రేజ్ ను దక్కించుకుంది. అయితే ప్రస్తుతం ఆ బ్యూటీ చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ ఫోటోలో చిన్నారిగా కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్ గా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలివుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషాల్లోనూ సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ పెద్ద ఫ్యామిలీకి కోడలిగా, యంగ్ హీరోకు భార్యగా కాబోతుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈమె ఎవరో కనిపెట్టే ఉంటారు. మరీ ఆమె ఎవరో కాదండీ.. బ్యూటీఫుల్ హీరోయిన్ ‘శోభిత ధూళిపాళ‘. ఈ పేరు ప్రస్తుతానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. సోషల్ మీడియాలో ఈ అమ్మడు పేరు ఇప్పుడు మారు మోగుతుంది. అందుకు కారణం శోభిత యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యతో నిశ్చితార్ధం చేసుకోబోతుందని నెట్టింట తెగ టాక్ వినిపిస్తోంది.

shobita dhulipala pic talk

కానీ, నిజంగానే ఈరోజు నాగచైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థ వేడుకలు ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. కాగా, వీరి నిశ్చితార్ధ వేడుక ఫోటోస్ ను   స్వయంగా అక్కినేని నాగర్జునే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమన్హారం.  ఇకపోతే కొన్నేళ్ల నుంచి వీరిద్దరూ రిలేషన్ ఉన్నారని టాక్ వినిపించగా.. దీనిపై అటూ చైతూ కానీ, శోభిత కానీ స్పందించలేదు. పైగా ఇద్దరూ చాలాసార్లు ఫారిన్ ట్రిఫ్ లో ఒకే లోకేషన్ లో దిగిన ఫోటోస్ చాలానే వైరల్ అయ్యాయి. అయితే అవన్నీ రూమర్స్ తప్పా అందులో నిజం లేదని చాలామంది కొట్టి పారేశారు. కానీ, ఇప్పుడు ఈ లవ్ బర్డ్ ఏకంగా నిశ్చితార్ధమే చేసుకొని అందరికీ షాక్ ఇస్తూ.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. శోభిత ధూళిపాళ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ తెనాలి కావడం గమన్హారం. అయితే ఆరేళ్ల వయసులో ముంబైకి వెళ్లిన ఆమె అక్కడే ఉన్నత చదువులు కొనసాగించింది. అంతేకాకుండా.. భరతనాట్యం,కూచిపూడి వంటి వాటిలో కూడా శోభిత శిక్షణ పొందిన నృత్యకారిణి కావడం గమన్హారం.

అలాగే శోభిత ధూళిపాళకు వార్షిక నేవీ బాల్ పిన్ 2010లో నేవీ క్వీన్‌గా పట్టాభిషేకం చేయబడింది. దీని తర్వాత ఈ బ్యూటీ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ గెలుచుకుంది.  అంతేకాకుండా.. మిస్ ఎర్త్ గా 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అయితే ఇలా మంచి ఫాపులారిటీ తెచ్చుకున్న శోభితకు.. అనుహ్యంగా బాలీవుడ్ లో సినిమాలో ఆఫర్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో 2016లో తెరకెక్కిన రామన్ రాఘవ్ 2.0 సినిమాలో విక్కి కౌశల్ సరసన తొలిసారిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.  ఇక ఆ తర్వాత.. అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019–2023) లో ప్రధాన పాత్ర పోషించింది. ఇలా బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తునే మరోవైపు హాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. దీంతో ఈ బ్యూటీ క్రేజ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో శోభితకు ఆఫర్లు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే తెలుగులో శోభిత గూడాచారి, ఇటీవలే రిలీజైన కల్కి 2898డీ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే మరోవైపు డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెజ్ మూవీ పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్స్ లో కూడా నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించింది. ఇక ప్రస్తుతానికి తెలుగులో శోభిత ఏ ప్రాజెక్ట్ లో నటిచండం లేదు. కానీ, హిందీలో మాత్రం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ అమ్మడు పేరు సోషల్ మీడియాలో మారు మోగడంతో.. ఈమె కోసం నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శోభిత చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యేక్షమైంది. మరీ, శోభిత చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet Girişcasibom girişHoliganbet GirişOnwin GirişPadişahbet girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel