Venkateswarlu
న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు శ్రద్ధా శ్రీనాథ్. ప్రస్తుతం ఆమె నటించిన సైంధవ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు శ్రద్ధా శ్రీనాథ్. ప్రస్తుతం ఆమె నటించిన సైంధవ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Venkateswarlu
క్రిష్ణుడు దేవుడే కావచ్చు.. చిటికెన వేలుతో గోవర్ధన గిరిని ఎత్తి ఉండవచ్చు.. ఎంతో మంది రాక్షసుల్ని ఒంటి చేత్తో మట్టి కరిపించి ఉండవచ్చు. కానీ, ప్రేమ విషయంలో ఆయనకు కష్టాలు తప్పలేదు. రాధ ప్రేమ కోపం పరితపించాడు. కన్నీళ్లు కార్చాడు. అందుకే రాధాక్రిష్ణుల ప్రేమ ఓ అద్భుత ప్రేమ కావ్యంగా మిగిలిపోయింది. ఒక్క క్రిష్ణుడే కాదు.. ఆడ, మగ అన్న తేడా లేదు. ప్రేమ ఎవ్వరినైనా..ఎలాంటి వారినైనా మార్చేస్తుంది. రెండు మనసుల్ని దగ్గర చేసి.. మనుషుల మధ్య గొడవ పెడుతుంది.
ఎన్ని గొడవలు వచ్చినా.. ఏం జరిగినా.. ఇద్దరూ ప్రేమను పంచుకుంటూ ఉంటే.. అది కలకాలం సాగుతుంది. లేదంటే బ్రేకప్ అవుతుంది. ఈ ప్రపంచంలో పెళ్లి వరకు చేరే ప్రేమలు చాలా తక్కువగా ఉంటాయి. వన్ సైడ్ లవ్ స్టోరీల గురించైతే చెప్పుకోవటం కూడా దండగే. అయితే, ఒకరితో ప్రేమలో సక్సెస్ కాకపోతే కొంతమంది రోజులు గడవక ముందే వేరే వ్యక్తుల్ని ప్రేమిస్తున్నారు. ఇంకా కొంతమంది ఆజ్ఞాపకాలతోనే జీవిస్తున్నారు. ఈ జాబితాలోకి ప్రముఖ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాధ్ కూడా చేరిపోయారు.
ఆమె ఓ వ్యక్తిని ఎంతో గాఢంగా ఇష్టపడ్డారు. ఎంతలా అంటే.. అతడి కోసం ఆమె తన గుండెపై పచ్చబొట్టు పొడిపించుకునేంతలా.. ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి మాట్లాడారు. ‘‘ బీటిల్స్ అనే బ్యాండ్ ఉండేది. ఆ బ్యాండ్ కవర్ ఎల్‌ఓవీఈ అని ఉంటుంది. ఆ బ్యాండ్‌లోని ఓ వ్యక్తిపై నాకు క్రష్ ఉండేది. అప్పుడు నా వయసు 18 సంత్సరాలు మాత్రమే. అతను నా ఎక్స్ లవర్ కాదు.. క్రష్. నా క్రష్ వల్లే మ్యూజిక్ పరిచయం అయింది. నా క్రష్ వల్ల కాదు. బీటిల్స్ బ్యాండ్ కోసం ట్యాటూ వేయించుకున్నాను’’ అని తెలిపారు.
కాగా, 2015లో వచ్చిన మలయాళ సినిమా ‘ కోహినూర్’తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2019లో వచ్చిన ‘జెర్సీ’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. జోడీ, క్రిష్ణ అండ్ హిజ్ లీల చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన సైంధవ్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, శ్రద్ధా శ్రీనాథ్‌కు తెలుగులో తక్కువ సినిమాలు చేశారు. ఇప్పటి వరకు కేవలం 4 చిత్రాల్లోనే నటించారు. కథల విషయంలో ఆమె చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు.
తనకు బాగా నచ్చితేనే సినిమాకు ఓకే చేస్తానని అంటున్నారు. లేకపోతే నిర్మొహమాటంగా నో చెప్తానంటున్నారు. మరి, శ్రద్ధా శ్రీనాథ్ క్రష్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
– I rejects many films. I set high standards for myself.
– Falling in love and falling out of love are very interesting genres for me.
– ‘Saindhav’ is neither the front seat nor the back seat for me.
– If I have to do many films in Telugu, I will have to sign films that I am… pic.twitter.com/sIwqvVbqJh
— Gulte (@GulteOfficial) January 1, 2024