iDreamPost
android-app
ios-app

Samyuktha Menon: మలయాళంలో అది నేచురల్ గా ఉంటుంది.. కానీ టాలీవుడ్ లో చిరాకేస్తుంది!

  • Published May 10, 2024 | 4:34 PM Updated Updated May 10, 2024 | 4:34 PM

కేరళ కుట్టి, యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో అనేక సూపర్ హిట్ చిత్రలో నటించి.. క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించింది. అయితే అలాంటి ఈ బ్యూటీ.. టాలీవుడ్ పై హాట్ కామెంట్స్ చేసింది.

కేరళ కుట్టి, యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో అనేక సూపర్ హిట్ చిత్రలో నటించి.. క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించింది. అయితే అలాంటి ఈ బ్యూటీ.. టాలీవుడ్ పై హాట్ కామెంట్స్ చేసింది.

  • Published May 10, 2024 | 4:34 PMUpdated May 10, 2024 | 4:34 PM
Samyuktha Menon: మలయాళంలో అది నేచురల్ గా ఉంటుంది.. కానీ టాలీవుడ్ లో చిరాకేస్తుంది!

సినీ, రాజకీయ రంగానికి చెందిన వ్యక్తులకు సంబంధించిన వార్తల గురించి తెలుసుకునేందుకు అందరు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే సెలబ్రిటీలు చేసే వ్యాఖ్యలు, కామెంట్స్ ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే  కొందరు హీరో,హీరోయిన్లు తమ కెరీర్ లో జరిగిన విషయాల గురించి, అలానే తమ వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటారు. చేదు అనుభవాలు, మర్చిపోలేని జ్ఞాపకాలు.. ఇలా పలు రకాల అంశాల గురించి చెబుతుంటారు. తాజాగా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్.. టాలీవుడ్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ విషయంలో టాలీవుడ్ లో చిరాకేస్తుందని చెప్పుకొచ్చింది. మరి..ఈ అమ్మడు చెప్పిన విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కేరళ కుట్టి, యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా అందించిన సక్సెస్ తో ఈ మలయాళ బ్యూటికీ ఆఫర్లు క్యూ కట్టాయి.

బింబిసార తరువాత విరూపాక్ష, డెవిల్, వంటి సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అలానే తమిళ్ హీరో ధనుష్ నటించిన మాస్టార్ సినిమాతో ఈ అమ్మడు మరింత గుర్తింపు పొందింది. ప్రస్తుతం నిఖిల్ జోడీగా స్వయంభూ సినిమాలో నటిస్తుంది. అలానే శర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కూడా ఈ అమ్మడు కొన్ని సినిమాలు చేస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ అమ్మడు తరచూ మీడియా ముందుకు వస్తుంది. తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంది. తాజాగా ఈ కేరళ కుట్టి టాలీవుడ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. మలయాళం సినిమాతో పోలిస్తే టాలీవుడ్ లో యాక్ట్  చేయడం చాలా కష్టమని చెప్పింది.

అందుకు భాష అనేది ఓ కారణం అయితే మేకప్ అనేది మరో కారణం అని చెప్పుకొచచ్చింది. వినడానికి చాలా జోక్ గా ఉండొచ్చు కానీ, తనకు ఇబ్బంది పెట్టిందని తెలిపింది. మలయాళ ఇండస్ట్రీలో మేకప్ వేయడం చాలా త్వరగా అయిపోతుందని, అలానే యాక్టింగ్ కూడా మనకు నచ్చినట్లు చేయొచ్చని తెలిపింది. అదే తెలుగులో ప్రతీదానకి చాలా కేర్ తీసుకోవాలని, మనం ఎలా ఉన్నాం, తెరపై ఎలా కనిపిస్తున్నామనేది ప్రతిక్షణం చూసుకోవాలని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. అంతేకాక ఇక మేకప్ కూడా చాలా వేస్తారని, ముఖంపై ఎదో బరువు ఉన్నట్లు చిరాగ్గా ఉంటుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం సంయుక్త  చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş