iDreamPost
android-app
ios-app

దిల్‌ రాజు చేతుల్లో లవ్‌టుడే హీరోయిన్‌ కెరీర్‌!

  • Published Dec 02, 2023 | 12:45 PM Updated Updated Dec 02, 2023 | 12:45 PM

లవ్‌టుడే సినిమాలో ఇవానా నటనకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇవానా ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు.

లవ్‌టుడే సినిమాలో ఇవానా నటనకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇవానా ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు.

  • Published Dec 02, 2023 | 12:45 PMUpdated Dec 02, 2023 | 12:45 PM
దిల్‌ రాజు చేతుల్లో లవ్‌టుడే హీరోయిన్‌ కెరీర్‌!

లవ్‌టుడే సినిమాతో తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్‌ ఇవానా. 2022లో వచ్చిన ఈ సినిమా తక్కువ బడ్జెట్‌లో నిర్మాణమై.. భారీ కలెక్షన్లను రాబట్టింది. తమిళంలో దాదాపు 100 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. తెలుగులో అదే పేరుతో డబ్‌ అయింది. ఇక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. లవ్‌టుడే చిత్రంలో ఇవానా నటనకు మంచి మార్కులు పడ్డాయి. తమిళంలో వరుస అవకాశాలు వచ్చాయి. లవ్‌టుడే తర్వాత ఆమె ప్రముఖ భారత క్రికెటర్‌ నిర్మించిన ఎల్‌జీఎమ్‌ సినిమాలో హీరోయిన్‌గా చేశారు.

ఈ సినిమా ఇదే పేరుతో తెలుగులో డబ్‌ అయింది. జులై 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇవానా ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నారు. కల్వన్‌, కాంప్లెక్స్‌ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఈ రెండు తమిళ ప్రాజెక్టులతో పాటు ఆమె తెలుగులో కూడా ఓ సినిమా చేస్తున్నారు. సెల్ఫిష్‌ అనే మూవీలో హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ చిత్రంతోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

సెల్ఫిష్‌ సినిమాను ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. చిత్రంలో ఆయన అన్న కుమారుడు ఆశిష్‌ హీరోగా నటిస్తున్నారు. సెల్ఫిష్‌ సినిమాతోటే ఆశిష్‌ హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం అయి దాదాపు ఏడాది కావస్తోందట. అయినా సినిమా షూటింగ్‌ ఇంకా నడుస్తోందట. ఇదే హీరోయిన్‌ ఇవానాకు ఇబ్బందిగా మారినట్లు సమాచారం. ఇవానా ‘సెల్ఫిష్‌’ సినిమాకు సైన్‌ చేసే ముందు ఆమెతో ఓ ఒప్పందం చేసుకున్నారట. చిత్ర షూటింగ్‌ పూర్తయ్యే వరకు ఏ సినిమా షూటింగ్‌లో పాల్గొనకూడదని చెప్పారట. దాదాపు సంవత్సరం అవుతున్నా.. సినిమా షూటింగ్‌ పూర్తి అవ్వలేదట.

ఈ నేపథ్యంలోనే సెల్ఫిష్‌ రీ షూట్‌ జరిగే అవకాశం ఉందని టాక్‌ నడుస్తోంది. దీంతో ఇవానా కెరీర్‌ చిక్కుల్లో పడిందన్న చర్చ సినిమా సర్కిల్‌లో జోరుగా సాగుతోంది. సినిమా షూటింగ్‌ పూర్తి అవ్వక.. కొత్త సినిమాకు పని చేసే అవకాశం లేక ఇవానా అల్లాడిపోతున్నారని టాక్‌. మీడియాలో కూడా ఈ విషయంపై ఓ ప్రచారం జరుగుతోంది. ఓ తెలుగు దర్శకుడు ఓ సినిమా కథను ఇవానాకు వినిపించారట. అప్పుడే ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దిల్‌ రాజును ఒప్పించి, ఆ దర్శకుడు తన సినిమాలో ఇవాను పెట్టుకుందామని చూస్తున్నాడట. మరి, దిల్‌ రాజు కారణంగా ఇవానా కెరీర్‌  చిక్కుల్లో పడిందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss