iDreamPost
android-app
ios-app

ఇలియానా- త్రిష గురించి షాకింగ్ విషయాలు వెల్లడించిన హీరో శ్రీరామ్!

  • Published Feb 18, 2024 | 4:15 PM Updated Updated Feb 18, 2024 | 4:15 PM

Hero Sriram On Trisha: హీరో శ్రీరామ్ ప్రస్తుతం పిండం మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ఆయన ఇలియానా, త్రిషలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

Hero Sriram On Trisha: హీరో శ్రీరామ్ ప్రస్తుతం పిండం మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ఆయన ఇలియానా, త్రిషలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

  • Published Feb 18, 2024 | 4:15 PMUpdated Feb 18, 2024 | 4:15 PM
ఇలియానా- త్రిష గురించి షాకింగ్ విషయాలు వెల్లడించిన హీరో శ్రీరామ్!

హీరో శ్రీరామ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రోజా పూలు, ఒకరికొకరు మూవీలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తాజాగా పిండం సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో పిండం సినిమా సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది. ఆ హారర్ సస్పెన్స్ డ్రామాలో శ్రీరామ్ తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. తాజాగా ఒక టాక్ షోలో పాల్గొన్న శ్రీరామ్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఇలియానా, త్రిషల గురించి కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సాధారణంగానే హీరో శ్రీరామ్ మనసులో ఉన్నది ఉన్నట్లు బయటకు చెప్పేస్తుంటాడు. అలాంటి ఆయనకు ఈ టాక్ షోలో కాస్త ట్రిక్కీ ప్రశ్నలే ఎదురయ్యాయి. కానీ, ఏమాత్రం మొహమాటం లేకుండా ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేశాడు. ముఖ్యంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాడు. ఎవరిని చూసి ఓరి దీని ఏషాలో అనిపించింది? అంటూ ప్రశ్నించగా.. ఇలియానాను చూస్తే అలా అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు.

“స్నేహితుడు సినిమా సమయంలో ఇలియానాను చూస్తే అలా అనిపిచింది. అందరికీ 7 గంటలకే షూటింగ్ టైమ్ ఉంది. విజయ్ అయితే అరగంట ముందే స్పాట్ కి వచ్చేస్తాడు. కానీ, ఇలియానా మాత్రం 11.. 12 గంటలకు వస్తుంది. వచ్చిన వెంటనే కూడా షాట్ కి రెడీ చెప్పదు. మళ్లీ ఒక అరగంటసేపు తన హెయిర్ సెట్ చేయడానికి నలుగురు తిరుగుతూ ఉంటారు. హెయిర్ అడ్జస్ట్ చేయడానికి అరగంట పట్టేది. ఆమె ఎప్పుడు వస్తే అప్పుడు వెంటనే షాట్ చేసేసి భోజనం చేద్దాం అని మేము నీరసంగా చూస్తూ ఉండేవాళ్లం. ఆ సమయంలో ఇలియానాను, ఆమె ఓవర్ చూస్తే.. ఓసినీ ఏందిరా దీని వేషాలు అనిపించింది” అంటూ శ్రీరామ్ కుండ బద్దలు కొట్టేశాడు.

త్రిష గురించి కూడా శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆమె తన పెళ్లి చెడగొట్టాలని చూసింది అంటూ చెప్పుకొచ్చాడు. “త్రిష నేను చాలా మంచి ఫ్రెండ్స్.  నన్ను వివాహం చేసుకునేందుకు వందన ఒప్పుకుందని తనకి తెలుసు. కానీ, త్రిష వందనా దగ్గరకు వెళ్లి ఎలా ఒప్పుకున్నావ్ పెళ్లికి. వీడు ఒక పెద్ద వేస్ట్ గాడు, చదువు కూడా రాదు. ఇంగ్లీష్ అసలే రాదు అంటూ చెప్పింది. నా ఫ్రెండ్ అయ్యి ఉండి నా పెళ్లే చెడగొట్టాలని త్రిష చూసింది” అంటూ శ్రీరామ్ కామెంట్స్ చేశాడు. అలాగే తన భార్య తనకంటే అందంగా ఉండటంపై కూడా శ్రీరామ్ స్పందించాడు. మీకన్నా మీ భార్య అందంగా ఉండటం పట్ల.. అసూయగా ఉండేవాళ్లా అని అడగ్గా.. “నాకు అలా ఎప్పుడూ అనిపించలేదు. నిజానికి అంత అందంగా ఉన్న అమ్మాయి ప్రేమను నేను పొందగలిగాను. నిజానికి అందరూ నన్ను చూసి కుళ్లుకుంటారు” అంటూ శ్రీరామ్ చెప్పుకొచ్చాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet