iDreamPost
android-app
ios-app

Shobhan Babu: హీరో కావాల్సిన శోభన్ బాబు కొడుకు.. ఎందుకు ఇండస్ట్రీకి దూరమయ్యాడంటే?

  • Published Apr 03, 2024 | 3:52 PM Updated Updated Jun 25, 2024 | 12:49 PM

టాలీవుడ్ అందగాడు శోభన్ బాబు వారసుడు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే టాప్ హీరోగా నిలవాల్సిన వాడు. కానీ ఆయన్ని ఇండస్ట్రీలోకి రానివ్వకుండా ఒకరు అడ్డుకున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

టాలీవుడ్ అందగాడు శోభన్ బాబు వారసుడు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే టాప్ హీరోగా నిలవాల్సిన వాడు. కానీ ఆయన్ని ఇండస్ట్రీలోకి రానివ్వకుండా ఒకరు అడ్డుకున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 03, 2024 | 3:52 PMUpdated Jun 25, 2024 | 12:49 PM
Shobhan Babu: హీరో కావాల్సిన శోభన్ బాబు కొడుకు.. ఎందుకు ఇండస్ట్రీకి దూరమయ్యాడంటే?

సినీ, రాజకీయ రంగాల్లో వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణం. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇస్తున్నారు. ఓ మోస్తారు నటులు పిల్లలు కూడా వెండితెరకు పరిచయం అవుతున్నారు. డెరైక్టర్, హీరోలు, హిరోయిన్లు, నిర్మాతలు… ఇలా అన్ని విభాగాలకు చెందిన వారి పిల్లలు సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తున్నారు. అలాంటి.. ఇక ఇండస్ట్రీలో టాప్ హీరోల కుమారులు ఎంట్రీ ఇవ్వడం అనే విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. కానీ టాలీవుడ్ అందగాడు శోభన్ బాబు కుమారుడు మాత్రం ఇండస్ట్రీలోనే కనిపించలేదు. హీరో అవ్వాల్సిన శోభన్ బాబు కుమారుడు అలా చిత్ర పరిశ్రమకు ఎందుకు దూరమయ్యాడు. అందుకు కారణం ఏమిటి.. ఆ వివరాలు ఇప్పుడు  తెలుసుకుందాం..

శోభన్ బాబు.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. టాలీవుడ్ అందగాడు శోభన్ బాబుకు అప్పట్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 80వ శతకంలో వారికి ఈయన అంటే విపరితమైన క్రేజ్. ముఖ్యంగా లేడీస్ లో శోభన్ బాబుకు ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది.  చిత్ర పరిశ్రమలో శోభన్ బాబు తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. అప్పటి స్టార్ హీరోలతో పోటీపడి సినిమాలు తీశారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యే సినిమాలు ఎక్కువగా చేశారు.

అలా తనదైన నటనతో లక్షలాది మంది అభిమానులు సొంతం  చేసుకున్నారు. అంతేకాక చిత్ర పరిశ్రమలో సక్సెస్ అందుకున్న అతి తక్కువ మంది హీరోల్లో శోభన్ బాబు ఒకరు. అనేక విభిన్నమైన సినిమాలో నటించి ప్రేక్షుకులను అలరించే వారు. ఆయన ఎంతో మందికి సినీ లైఫ్ ను అందించారు.  ఇక ఆయన ఫ్యామిలీ విషయానికి వస్తే… శోభన్ బాబుకు కరుణ శేషు అనే కుమారుడు ఉన్నాడు. శోభన్ బాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉండటంతో కరుణ శేషు కూడా సినిమాల్లోకి వస్తారని ఆయన ఫ్యాన్స్ భావించారు.

Shobhan Babu Son

కానీ వారి ఆలోచనలకు భిన్నంగా కరుణ శేషుకు కెరీర్ వేరే దారిలోకి వెళ్లింది. ఆయన సినిమాల్లోకి రాకుండా పలు రక బిజినెస్ లు చేస్తూ వ్యాపారం రంగంలో స్థిరపడ్డారు. అలా సినిమాల్లోకి రాకుండా వ్యాపార రంగంలోకి వెళ్లడానికి  కారణం ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయం అందరూ భావిస్తున్నారు. ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయం వల్లే కరుణ శేషు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కనీసం ఇండస్ట్రీ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. కరుణ శేషు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోవడానికి కారణం మరెవరో కాదంట.. ఆయన తండ్రి శోభన్ బాబునే అంట. ఇదే విషయాన్ని పలువురు సినీ ప్రముఖులు అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటారు. కరుణ శేషు సినిమాల్లో కాకుండా వ్యాపారం రంగంలో రాణించాలని శోభన్ బాబు భావించాడంట.

అందుకే కొడుకుకు సినిమాల్లోకి రావాలని ఆసక్తి ఉన్న దాన్ని పక్కన పెట్టేసి..వ్యాపారంలో మెలకువలు నేర్పించారట. అలానే వారికి ఉన్న వ్యాపారాలను చూసుకోమని  చెప్పారంట. ఇలా శోభన్ బాబు ఆలోచన కారణంగానే కరుణ శేషు సినిమా ఇండస్ట్రీ లోకి రాలేకపోయారనే ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అలా కాకుండా వెండితెరకు ఎంట్రీ ఇచ్చి ఉంటే ప్రస్తుతం స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకునేవారని  శోభన్ బాబు ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. శోభన్ బాబు కుమారుడు ఇండస్ట్రీకి దూరం కావడంపై వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss