iDreamPost
android-app
ios-app

లావణ్య ఫిర్యాదుపై స్పందించిన రాజ్ తరుణ్.. ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు!

  • Published Jul 05, 2024 | 3:10 PM Updated Updated Jul 05, 2024 | 3:46 PM

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది. తనను ప్రేమించి మోసం చేశాడంటూ ఆమె తరుణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా తనపై ఆ యువతి చేసిన ఆరోపణలపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు.

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది. తనను ప్రేమించి మోసం చేశాడంటూ ఆమె తరుణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా తనపై ఆ యువతి చేసిన ఆరోపణలపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు.

  • Published Jul 05, 2024 | 3:10 PMUpdated Jul 05, 2024 | 3:46 PM
లావణ్య ఫిర్యాదుపై స్పందించిన రాజ్ తరుణ్.. ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు!

తనను ప్రేమించి మోసం చేశాడంటూ టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది. అయితే ఈ యువతి చేసిన ఆరోపణలపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు. ప్రేమించి మోసం చేశాడంటూ తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తరుణ్ తెలిపారు. లావణ్యతో రిలేషన్ లో ఉన్నమాట వాస్తవమేనని, కానీ కొంతకాలంగా ఆమె డ్రగ్స్ వాడుతోందని తెలిపాడు. అలానే వేరే వ్యక్తితో అఫైర్ పెట్టుకుందని, అందుకే దూరం పెట్టాని తెలిపాడు. ఆమెకు డబ్బులు కావాలని, అందుకే ఈ డ్రామా ఆడుతుందంటూ రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. లావణ్య తనను చాలా టార్చర్ పెట్టిందని, కన్నతండ్రిని కూడా మోసం చేసిందని రాజ్ తరుణ్ మీడియాతో చెప్పారు.

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. షార్ట్ ఫిలిమ్ మూవీ మేకర్ గా తన సినీ కెరీర్ ను రాజ్ తరుణ్ ప్రారంభించాడు. ఉయ్యాల జంపాల సినిమా మంచి హిట్ కొట్టడంతో ఆ తరువాత కూడ వరుసగా ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం తిరగబడరా స్వామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. త్వరలో ఈ సినిమా థియేటర్లకో విడుదల  కానుంది ఈ నేపథ్యంలోనే  తాజాగా రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి సంచలన ఆరోపణలు చేసింది. హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీసులకు రాజ్ తరుణ్, మరో యంగ్ హీరోయిన్ పై ఫిర్యాదు చేసింది.

ఇక లావణ్య తన   ఫిర్యాదులో … తను ప్రేమించి.. శారీరకంగా వాడుకొని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని పేర్కొంది. దాదాపు 11 ఏళ్లుగా రాజ్‌తరుణ్‌తో సహజీవనంలో ఉన్నానని ఆమె తెలిపింది. తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పింది. అయితే రాజ్ తరుణ్ తన మూవీలో యాక్ట్ చేస్తున్న హీరోయిన్ తో అఫైర్‌ పెట్టుకొని తనను వదిలేశాడని ఆ యువతి ఆరోపిస్తోంది. 3 నెలల క్రితం రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడని, అతడిని వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని ఆమె పేర్కొంది.

ఇక లావణ్య చేసిన ఆరోపణలపై తాజాగా హీరో రాజ్ తరుణ్ స్పందించాడు. ప్రేమించి మోసం చేశాడంటూ తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తరుణ్ తెలిపారు. గతంలో లావణ్యతో రిలేషన్ లో ఉన్నమాట వాస్తవమేనని, కానీ కొంతకాలంగా ఆమె డ్రగ్స్ వాడుతోందని తెలిపాడు. అలానే వేరే వ్యక్తితో అఫైర్ పెట్టుకుందని, అందుకే దూరం పెట్టాని తెలిపాడు. ఆమెకు డబ్బులు కావాలని, అందుకే ఈ డ్రామా ఆడుతుందంటూ రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. లావణ్య తనను చాలా టార్చర్ పెట్టిందని తెలిపాడు.

ఇంకా రాజ్ తరుణ్ మాట్లాడుతూ..”ఆమె నన్ను ఇబ్బంది పెడుతుండటంతో నేను లీగల్ కల్సల్టింగ్ చేస్తున్నాను.  ఒకసారి పెళ్లి చేసుకున్నాడు అని చెబుతుంది. మరోసారి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశానని చెబుతోంది. లావణ్యతో నాకు శారీరక సంబందం లేదు. పోలీసులకు చెబితే నా రిపుటేషన్ ఎక్కడ దెబ్బతింటుందోననే భయపడి  చెప్పలేదు. ఆమెను నేను డ్రగ్స్ కేసులో ఇరికించే ఉద్దేశం ఉంటే..నాకీ పరిస్థితి ఉండేది కాదు కదా?. మస్తాన్ అనే వ్యక్తితో లావణ్యకు సంబంధం ఉంది. ఆమె డబ్బుల కోసం ఇలా టార్చర్ చేస్తుంది. ఆమె తల్లిదండ్రులతో కూడా నాకు ఎటువంటి ఇబ్బందులు రాలేదు” అని మీడియాతో రాజ్ తరుణ్ పలు విషయాలను చెప్పుకొచ్చాడు.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio