iDreamPost
android-app
ios-app

Nikhil: క్షమాపణలు చెబుతూ నిఖిల్ లేఖ.. ఏం జరిగిందంటే?

Nikhil: క్షమాపణలు చెబుతూ నిఖిల్ లేఖ.. ఏం జరిగిందంటే?

సపోర్టింగ్ రోల్స్ తో టాలీవుడ్ ప్రేక్షకులకు నిఖిల్ దగ్గరయ్యాడు. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ సినిమాతో నిఖిల్ కు నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ పాలోయింగ్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా నిఖిల్ ఫ్యాన్ డమ్ పెరిగింది. అలాంటి పాన్ ఇండియా స్టార్ నిఖిల్ అభిమానులకు క్షమాపణలు చెబుతూ బహిరంగ లేఖ విడుదల చేశాడు.

హీరో నిఖిల్ కు యాక్టర్ గానే కాకుండా.. రియల్ లైఫ్ లో కూడా ఎంతో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి నిఖిల్ అందరికీ క్షమాపణ చెప్పండతో అంతా షాకవుతున్నారు. అసలు ఏం జరిగింది అంటూ వెతుకులాట మొదలు పెట్టారు. నిఖిల్ నుంచి ఇటీవల స్పై సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. కలెక్షన్స్ బాగానే వచ్చినా.. నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. పైగా ఈ సినిమాని పలు భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

కానీ, చివరకు చాలా భాషల్లో దీనిని విడుదల చేయలేదు. ఈ విషయంలో ఫ్యాన్స్ ఎంతో నిరాశ చెందారు. విడుదల విషయంలో హీరో నిఖిల్ కూడా అంసతృప్తి వ్యక్తం చేశాడంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయంపై నిఖిల్ ఏ అన్నాడంటే.. “స్పై సినిమాని ఎంతో సక్సెస్ చేశారు. నా కెరీర్ లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్ అందించారు. కార్తికేయ తర్వాత మీరు నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో నాకు అర్థమైంది. ఈ సినిమాని తెలుగులో మాత్రమే విడుదల చేశాం.

కంటెంట్/కాంట్రాక్ట్ ఇబ్బందుల వల్ల వివిధ భాషల్లో విడుదల చేయలేదు. ఓవర్సీస్ లో 350 ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యాయి. నేను హిందీ, కన్నడ, తమిళ్, మళయాలం ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతున్నాను. నా నుంచి రాబోతున్న అన్ని చిత్రాలు అన్ని భాషల్లో, చెప్పిన సమయానికి విడుదలయ్యేలా చూస్తామని హామీ ఇస్తున్నాను. తెలుగు ప్రేక్షకులకు కూడా నేను క్షమాపణలు చెబుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఇకపై కంటెటం, క్వాలిటీతోనే మీ ముందుకు వస్తాం. చెక్ చేసి అద్భుతమైన సినిమాని మాత్రమే మీకు అందిస్తాం” అంటూ నిఖిల్ సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetStarzbetStarzbetJojobetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom