iDreamPost
android-app
ios-app

Naveen Chandra: తెలుగు యంగ్ హీరో అరుదైన ఘనత.. నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం

  • Published May 01, 2024 | 11:09 AM Updated Updated May 01, 2024 | 11:22 AM

హీరో నవీన్ చంద్ర తెలుగులో ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి.. మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో తాజాగా అతని కష్టానికి ప్రతి ఫలంగా మంచి గుర్తింపు లభించింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హీరో నవీన్ చంద్ర తెలుగులో ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి.. మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో తాజాగా అతని కష్టానికి ప్రతి ఫలంగా మంచి గుర్తింపు లభించింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published May 01, 2024 | 11:09 AMUpdated May 01, 2024 | 11:22 AM
Naveen Chandra: తెలుగు యంగ్ హీరో అరుదైన ఘనత.. నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం

ఎంతో మంది హీరోలు తెలుగులో ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. వారు తీసేది కొన్ని సినిమాలే అయినా కూడా.. మంచి పేరు సంపాదించుకుంటారు. కానీ, కొన్ని కారణాల వలన ఎందుకో అంతా బాగా ఫేమస్ కాలేకపోతారు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో అలాంటి హీరోలు ఎంతో మంది ఉన్నారు. వారు తీసిన సినిమాలలో మంచి కంటెంట్ ఉన్నా కూడా ఆడియన్స్ మధ్యలో అవి అంతగా బజ్ తెచుకోలేకపోతాయి. అలాంటి హీరోలలో ఒకరు నవీన్ చంద్ర. నవీన్ చంద్ర ఇప్పటివరకు తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించాడు. ఈ హీరో ఆఖరిగా “మంత్ ఆఫ్ మధు” చిత్రంలో కనిపించాడు. అయితే గత ఏడాది ఈ హీరో చేసిన ఓ సినిమా గురించి.. తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు బయటకు వస్తున్నాయి. అవేంటో చూసేద్దాం.

గత ఏడాది నవంబర్ నవంబర్ లో రిలీజ్ అయినా సినిమా “పొలిమేర -2”. థియేటర్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన “దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్” అవార్డును సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమాకు మాత్రమే కాకుండా.. మరోవైపు శ్రీ సింహ హీరోగా తెరకెక్కిన “ఉస్తాద్” చిత్రానికి కూడా అదే ఫిల్మ్ ఫెస్టివల్ లో “ఆనరరీ జ్యూరీ మెన్షన్‌” విభాగంలో అవార్డును దక్కించుకుంది. ఇక మంత్ ఆఫ్ మధు చిత్రానికి గాను హీరో నవీన్ చంద్రకు ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. దీనితో ఈహీరో అభిమానులు అతనికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలలో నటించిన మంత్ ఆఫ్ మధు చిత్రం.. గత ఏడాది అక్టోబర్ లో థియేటర్ లో విడుదలైంది. ఈ సినిమా ప్రస్తుతం ఆహ ఓటిటీ లో అందుబాటులో ఉంది.

ఇక ఉస్తాద్ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా.. తమ సినిమాకు అవార్డు దక్కిన విషయాన్నీ వెల్లడిస్తూ.. “ప్రేమతో మేం తెరకెక్కించిన ఈ సినిమాకి అవార్డు వచ్చింది. దీనికి కారణమైన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు” అంటూ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారం రోజున.. భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే జయంతి సంధర్బంగా.. ఢిల్లీలో నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమంలో ఎంతో మంది సినీ సెలెబ్రెటీలు పాలు పంచుకున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.