iDreamPost
android-app
ios-app

TGS RTC ఎండీ సజ్జనార్ తో హీరో నాని స్పెషల్ మీటింగ్! కారణం ఏంటంటే..

  • Published Aug 27, 2024 | 6:05 PM Updated Updated Aug 27, 2024 | 6:05 PM

Nani Meet With Sajjanar: టాలీవుడ్ హీరో నాని..సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆగష్టు 29న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో నాని బిజీ బిజీగా ఉన్నారు.

Nani Meet With Sajjanar: టాలీవుడ్ హీరో నాని..సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆగష్టు 29న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో నాని బిజీ బిజీగా ఉన్నారు.

  • Published Aug 27, 2024 | 6:05 PMUpdated Aug 27, 2024 | 6:05 PM
TGS RTC ఎండీ సజ్జనార్ తో హీరో నాని స్పెషల్ మీటింగ్! కారణం ఏంటంటే..

ప్రముఖలకు సంబంధించిన వార్తలను తెలుసుకునేందుకు చాలా మంది ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అలానే తరచూ పలువురు ప్రముఖులు  ప్రత్యేకంగా సమావేశం అవుతుంటారు. కొందరి కలయిక అనేది చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. కొన్ని సందర్భాల్లో స్టార్ హీరోలు, ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు మీట్ అవుతుంటారు. అలానే తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో హీరో నాని ప్రత్యేకంగా మీట్ అయ్యారు. వారిద్దరు కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నేచురల్ స్టార్ నాని త్వరలో ‘సరిపోదా శనివారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆగష్టు 29న ఈ సినిమా విడుదల కానుంది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్  కానున్న నేపథ్యంలో పాన్ ఇండియా ప్రమోషన్ లు చేస్తూ నాని బిజీగా ఉన్నాడు. మంగళవారం సాయంత్రం బెంగుళూరులో ప్రమోషన్స్ చేయనున్నాడు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమానంలో బెంగళూరుకు బయలుదేరుతున్నాడు. ఈ క్రమలోనే అనుకోకుండా టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎదురయ్యారు. దీంతో ఎయిర్ పోర్టులో సజ్జనార్ తో నాని ప్రత్యేకంగా మీట్ అయ్యారు.

ఎండీ సజ్జనార్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో నానికి ఎదురుపడ్డారు. ఈ క్రమంలోనే కాసేపు ఇద్దరూ ముచ్చటించుకున్నారు. నాని, సజ్జనార్ ఇద్దరూ మాట్లాడుకున్న వీడియోలు, వారిద్దరు కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల నాని ముంబై వెళ్తూ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో సమంతని కూడా ఇలాగే కలిసిన సంగతి తెలిసింది. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా సజ్జనార్ సార్ తో నాని కలిసిన ఫోటోలో నెట్టింట్లో రచ్చ చేస్తున్నాయి.

ఇక సరిపోదా శనివారం  సినిమా విషయానికి వస్తే.. నాని వర్సటైల్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో కలిసి సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న రెండో మూవీ ఇది. అంటే సుందరానికి ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే.. ఇప్పుడు మాస్ ఆడియన్స్ కోసం సరిపోదా శనివారాన్ని తీసుకువస్తున్నాడు. ఇది వింటేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కబోతుంది. డీవీవీ ఎంటర్ టైన్‌మెంట్ పతాకంపై డీవివి దానయ్య నిర్మిస్తున్నాడు. ప్రియాకం మోహన్..  గ్యాంగ్ లీడర్ సినిమా తరువాత నానితో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. మరి.. ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో తెలియాలంటే..మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş