ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరిని ఎలా పైకి తీసుకొస్తుందో చెప్పలేం. కానీ.. ఒక హీరోని ఒక్క ప్లాప్ పడితే ఏ స్థాయిలో నెగిటివిటీని స్ప్రెడ్ చేయగలదో అప్పుడప్పుడు చూస్తుంటాం. అదే నెగిటివిటీని ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ మూవీపై చూస్తున్నాం. సరే సినిమా వరకే అనుకుంటే.. ఏకంగా మెగాస్టార్ నే పర్సనల్ గా టార్గెట్ చేస్తున్న ట్రోలింగ్ కనిపిస్తోంది. భోళా శంకర్ ప్లాప్ తో సోషల్ మీడియాలో చిరంజీవిని ఊహించని విధంగా ట్రోల్స్ చేస్తున్నారు. సినిమా ఫలితం పక్కన పెడితే.. ఇన్నేళ్ల చిరు ఇమేజ్ ని డామేజ్ చేసే కామెంట్స్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదివరకు ఎప్పుడు ఏ సినిమా విషయంలోను ఇంతటి నెగిటివిటీని చిరంజీవి ఫేస్ చేయలేదు.
సినిమాలు అన్నాక హిట్ అవుతాయి.. ప్లాప్ కూడా అవుతుంటాయి. హీరోలు చేసే ప్రతీ సినిమా ఓ ప్రయత్నమే. ఒక్కోసారి హిట్ అవ్వచ్చు.. ఇంకోసారి కాకపోవచ్చు. దానికి ఇంతటి ట్రోలింగ్ అవసరం లేదు. మీ సినిమా మాకు నచ్చలేదు అని సింపుల్ గా, మర్యాదగా కూడా చెప్పవచ్చు. కానీ.. సోషల్ మీడియాలో సినిమా గురించి కాకుండా పర్సనల్ గా ట్రోల్ చేసే హక్కు ఎవరికి లేదు. చిరంజీవికి గతేడాది ఆచార్య కూడా ప్లాప్ అయ్యింది. కానీ.. ఆ సినిమాకి లేని ట్రోలింగ్ దీనికి ఎందుకు..? భోళా శంకర్ సినిమా విషయంలో.. మెగా అభిమానులు ఆల్రెడీ నిరుత్సాహంలో ఉన్నారు. దీంతో ట్రోలర్స్ కి మరింత సందు దొరికినట్లు భావిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ ని ట్రోల్ చేయడంపై యంగ్ హీరో, మెగా ఫ్యాన్ కార్తికేయ స్పందించాడు. “సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పడంలో తప్పు లేదు. కానీ.. పర్సనల్ గా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. చిరంజీవి అనే కాదు. ఎవరిని అంతలా విమర్శించకూడదు. ఒక సినిమా అంచనాలను చేరుకోకపోతే నేరం అవుతుందా? చిరంజీవి ఆయన కెరీర్ లో ఎన్నో కష్టాలు చూసి వచ్చారు. ఆయనకు చూసిన దానిముందు ఈ భోళా శంకర్ చాలా చిన్నది. అయినా ఇలాంటి విషయాలు ఆయన పెద్దగా పట్టించుకోరు. త్వరలోనే నెక్స్ట్ మూవీ పై ఫోకస్ పెడతారని అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. ఇలాంటి పరిస్థితిలో మెగాస్టార్ కి అండగా కుర్రహీరో ధైర్యంగా మాట్లాడాడని ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి భోళా శంకర్ విషయంలో కార్తికేయ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.