iDreamPost

Dhanush, Raayan: కొత్త లుక్ తో ధనుష్! రాయన్ విడుదలపై క్లారిటీ.. ఎప్పుడంటే?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ తో పాటు తెలుగులోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. తాజాగా ఆయన నటిస్తున్న రాయన్ సినిమాతో కొత్త లుక్ లో ధనుష్ కనిపించనున్నాడు.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ తో పాటు తెలుగులోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. తాజాగా ఆయన నటిస్తున్న రాయన్ సినిమాతో కొత్త లుక్ లో ధనుష్ కనిపించనున్నాడు.

Dhanush, Raayan: కొత్త లుక్ తో ధనుష్! రాయన్ విడుదలపై క్లారిటీ.. ఎప్పుడంటే?

ఇటీవల కాలంలో  హీరోలు కొత్త కొత్త పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే పుష్ప  సినిమాతో  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విభిన్న గెటప్లో కనిపించిన సంగతి తెలిసిందే. అలానే మరికొందరు హీరోలు కూడా తమదైన గెటప్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా తాజాగా ఆయన నటిస్తున్న రాయన్ సినిమాతో కొత్త లుక్ లో ధనుష్ కనిపించనున్నాడు. అలానే రాయన్ సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ తో పాటు తెలుగులోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఇటీవలే మాస్టార్ సినిమాతో వచ్చి..సూపర్ హీట్ కొట్టాడు. ఈ సినిమాలో ధనుష్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇది ఇలా ఉంటే.. ఇప్పటికే హీరో ధనుష్ వరుస సినిమాలను క్యూలో పెట్టాటినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. బ్యాక్  టూ బ్యాట్ సినిమా అప్ డేట్స్ తో ఫ్యాన్స్ కి ఊపిరాడకుండా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ధనుష్‌ నుంచి వస్తోన్న మోస్ట్ క్రేజియెస్ట్‌ ప్రాజెక్ట్‌  రాయన్ . ఈ సినిమాకు ధనుష్ నే డైరెక్షన్ చేస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో ఉత్తర మద్రాస్ ప్రాంతం నేపథ్యం ఆధారంగా  ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు.

కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి పాట విడుదలైంది. ఈ సాంగ్ కి మంచి స్పందన వస్తోంది. డీ50గా తెరకెక్కుతోన్న రాయన్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాక ధనుష్ కొత్త లుక్ లో కనిపించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటి పెరిగింది. ఈ చిత్రాన్ని తెలుగులో ఏసియన్‌ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పీ విడుదల చేయనుంది. కొన్ని రోజులు గా రాయన్ విడుదల తేదీపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ డైలామాకు ధనుష్‌ చెక్‌ పెట్టాడు. ఈ సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చాడు. జులై 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు తెలిపాడు. మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కొత్త లుక్స్‌ షేర్ చేశాడు. ఈ స్టిల్స్‌ మూవీపై ఆసక్తిని అమాంతం పెంచుతున్నాయి. రాయన్‌కు సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ను ఏఆర్‌ రెహమాన్‌ అందిస్తున్నారు. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలానే ధనుష్‌ మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తోన్న కుబేర చిత్రీకరణ దశలో ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి