Tirupathi Rao
Second Marriage With Actress Pavitra Allegations On Hero Darshan: దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కొత్త కొత్త ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా హీరో దర్శన్ కు- నటి పవిత్రకు వివాహం జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి.
Second Marriage With Actress Pavitra Allegations On Hero Darshan: దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కొత్త కొత్త ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా హీరో దర్శన్ కు- నటి పవిత్రకు వివాహం జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి.
Tirupathi Rao
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసు వైరల్ అవుతోంది. పవిత్ర గౌడకు అశ్లీల మెసేజ్ లు పంపాడంటూ హీరో దర్శన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే రేణుకా స్వామికి బుద్ధి చెప్పాలి అని ఫిక్స్ అయ్యాడు. అందుకు కొందరు మనుషులను పురమాయించి.. కిడ్నాప్ కూడా చేయించాడు. పట్టణగెరెలోని ఓ షెడ్డులో ఉంచి దాడికి దిగారు. తాను కూడా ఓ రెండు దెబ్బలు వేశాను అంటూ పోలీసుల దగ్గర దర్శన్ వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసు నేపథ్యంలో ఇప్పుడు కొన్ని కొత్త పుకార్లు మొదలయ్యాయి. దర్శన్ కు పవిత్ర గౌడకు పెళ్లి జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు సంబంధించి దర్శన్ లాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రేణుకా స్వామి హత్య కేసులో ఇప్పటికే చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో లొంగిపోయిన వారితో కలిపి మొత్తం 16 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతానికి వారికి రిమాండును పొడిగించారు. సోమవారం వరకు రిమాండ్ గడువు ఉండగా.. రేపు సెలవు అని ముందే కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసుకు సంబంధించి రేణుకాస్వామిని తానే కిడ్నాప్ చేయించిన విషయాన్ని దర్శన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే అతడిని చంపడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు. తాను కేవలం కోపంతో రెండు దెబ్బలు వేసి.. డబ్బులు ఇచ్చి భోజనం చేసి ఇంటికి వెళ్లమని చెప్పాను అన్నాడు.
అయితే ఈ కేసులో కొత్త వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. తాజాగా ఇప్పుడు దర్శన్ కు పవిత్రకు పెళ్లి జరిగింది అంటూ కొన్ని కొత్త పుకార్లు వచ్చాయి. అయితే ఆ పుకార్లపై దర్శన్ లాయర్ స్పందించాడు. జైలులో ఉన్న దర్శన్ తో మాట్లాడి వచ్చిన తర్వాత దర్శన్ లాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దర్శన్- పవిత్ర సహజీవనం చేస్తున్నారని.. వాళ్లకి పెళ్లి జరిగిందని వస్తున్న వార్తలు అవాస్తం అంటూ దర్శన్ లాయర్ చెప్పుకొచ్చారు. వాళ్లిద్దరు కేవలం తోటి నటులు మాత్రమే అంటూ స్పష్టం చేశాడు. అలాంటి వార్తలు అన్నీ అవాస్తవం అంటూ ఖండించారు. దర్శన్ కుటుంబ సభ్యులు కూడా ఈ వార్తలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అని దర్శన్ లాయర్ తెలిపారు.
ఇలాంటి వార్తల నేపథ్యంలో దర్శన్ భార్య విజయలక్ష్మి బయటకు రాలేకపోతున్నారు అంటూ వాపోయారు. పవిత్ర గౌడ- దర్శన్ కు వివాహం జరిగింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పుకొచ్చారు. దర్శన్ కు విజయలక్ష్మి ఒక్కరే భార్య అని స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసులో దర్శన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది అంటూ వస్తున్న వార్తలను లాయర్ అనిల్ బాబు ఖండించారు. ఇంకా కేసు విచారణలో ఉందని.. అప్పుడే తీర్పులు ఎలా ఇస్తారంటూ వ్యాఖ్యానించారు. మరి.. పవిత్ర గౌడ- దర్శన్ లకు వివాహం జరిగింది అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.