iDreamPost
android-app
ios-app

వీడు మామూలు దొంగకాదు!.. ఏకంగా దేవుడ్ని ప్రార్థించిమరీ..

అందరు దొంగలు ఒకేలా ఉండరు. వారి ఆలోచనా తీరు కూడా ఒకేలా ఉండదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ.. ఈ స్టోరీలో గుడిలో దొంగతనానికి వెళ్లిన ఓ దొంగ చాలా భక్తితో ప్రవర్తించాడు. దొంగతనానికి ముందు దైవ ప్రార్థనలు చేశాడు.

అందరు దొంగలు ఒకేలా ఉండరు. వారి ఆలోచనా తీరు కూడా ఒకేలా ఉండదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ.. ఈ స్టోరీలో గుడిలో దొంగతనానికి వెళ్లిన ఓ దొంగ చాలా భక్తితో ప్రవర్తించాడు. దొంగతనానికి ముందు దైవ ప్రార్థనలు చేశాడు.

వీడు మామూలు దొంగకాదు!.. ఏకంగా దేవుడ్ని ప్రార్థించిమరీ..

పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్లు.. ఒక్కోరి బుద్ధి ఒక్కోలాగా ఉంటుంది. ఒక్కోరి ఆలోచనలు ఒక్కోలా ఉంటాయి. ఇది దొంగలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే.. అందరు దొంగలు ఒకేలా ఉండరు. వారి ఆలోచనా తీరు కూడా ఒకేలా ఉండదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ.. ఈ స్టోరీలో గుడిలో దొంగతనానికి వెళ్లిన ఓ దొంగ చాలా భక్తితో ప్రవర్తించాడు. దొంగతనానికి ముందు దైవ ప్రార్థనలు చేశాడు. తర్వాత హుండీని దోచుకెళ్లిపోయాడు. ఈ సంఘటన హర్యానాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

హర్యానా, రేవారీ జిల్లాలోని దారుహేరా టౌన్‌కు చెందిన ఓ దొంగ అక్కడి హనుమాన్‌ గుడిలో దొంగతనానికి వెళ్లాడు. అందరు భక్తులతో కలిసిపోయి ప్రార్థనలు చేశాడు. హనుమాన్‌ చాలీసాను సైతం పఠించాడు. పూజారి పల్లెంలో ఓ పది రూపాయలు కూడా వేశాడు. ఆ తర్వాత సరైన సమయం కోసం ఎదురు చూడసాగాడు. హుండీ దగ్గర ఎవరూ లేని సమయంలో తన పంజా విసిరాడు. గుట్టు చప్పుడు కాకుండా హుండీలోని 5 వేల రూపాయలను ఎత్తుకెళ్లిపోయాడు. అయితే, ఈ విషయం తెలియని పూజారి ఆ రాత్రి గుడి తలుపులు మూసేసి ఇంటికి వెళ్లిపోయాడు.

మరుసటి రోజు ఉదయం హుండీ తలుపులు తెరిచి ఉండటం ఆయన గమనించాడు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గుడిలోని సీసీటీవీ ఫుటేజీలను చెక్‌ చేయగా అసలు విషయం బయటపడింది. ఓ దొంగ హుండీ తాళం పగులగొట్టి దొంగతనం చేయటం కనిపించింది. దీంతో దొంగ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.