iDreamPost
android-app
ios-app

బెట్టింగ్‌ మాఫియా అండతో దుబాయ్‌లో దాకున్న హర్షసాయి?

  • Published Sep 30, 2024 | 4:38 PM Updated Updated Sep 30, 2024 | 4:38 PM

Harsha Sai, Betting Mafia, Dubai: హర్షసాయి ఎక్కడున్నాడనే విషయంపై ఒక కీలక విషయం వెలుగులోకి వస్తుంది. మరి అతను ఎక్కడున్నాడు? ఎవరు ఆశ్రయం ఇస్తున్నారు లాంటి విషయాలు ఇప్పుడులు తెలుసుకుందాం..

Harsha Sai, Betting Mafia, Dubai: హర్షసాయి ఎక్కడున్నాడనే విషయంపై ఒక కీలక విషయం వెలుగులోకి వస్తుంది. మరి అతను ఎక్కడున్నాడు? ఎవరు ఆశ్రయం ఇస్తున్నారు లాంటి విషయాలు ఇప్పుడులు తెలుసుకుందాం..

  • Published Sep 30, 2024 | 4:38 PMUpdated Sep 30, 2024 | 4:38 PM
బెట్టింగ్‌ మాఫియా అండతో దుబాయ్‌లో దాకున్న హర్షసాయి?

హర్షసాయి ఎక్కడున్నాడు..? ఇదే ప్రశ్న సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. అలాగే పోలీసులకు కూడా హర్షసాయిని పట్టుకోవడం పెద్ద తలనొప్పిగానే మారింది. ఇలాంటి టైమ్‌లో హర్షసాయి దుబాయ్‌లో ఉన్నాడని, అతనికి బెట్టింగ్ మాఫియా ఆశ్రయం కల్పిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో నిజమెంతా? నిజంగానే హర్షసాయి దుబాయ్‌లో ఉన్నాడా? దుబాయ్‌లో ఎక్కడున్నాడు? అనే విషయాలను ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ప్రేమ పేరుతో మోసం చేసి.. తనపై అత్యాచరం చేయడమే కాకుండా.. తన వద్ద రూ.2 కోట్లు కూడా తీసుకున్నాడని, తీరా పెళ్లి చేసుకోమంటే.. న్యూడ్‌ వీడియోలు, ఫొటోలతో బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడని నార్సింగ్‌ పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 376, 354, 328 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే.. కేసు నమోదు అవుతుందని తెలిసి.. హర్షసాయి దేశం విడిచివెళ్లిపోయాడని, ఎక్కడ పోలీసులు అరెస్ట్‌ చేస్తారేమో అని భయపడి.. అతను దుబాయ్‌కి వెళ్లి తలదాచుకున్నాడంటూ.. కేసు పెట్టిన యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హర్షసాయికి బెట్టింగ్‌ మాఫియాతో మంచి డీలింగ్స్‌ ఉన్నాయని, బహుషా వాళ్లే.. దుబాయ్‌లో అతనికి ఆశ్రయం కల్పిస్తున్నారేమో అంటూ వాళ్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇప్పటికే పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి.. హర్షసాయి కోసం గాలిస్తున్నారు. అతన్ని వీలైంతన తర్వాత అదుపులోకి తీసుకొని.. విచారిస్తామని కూడా పోలీసులు వెల్లడించారు.

కానీ, అతను దుబాయ్‌లో ఉన్నాడనే సంచలన విషయాలు వెలుగులోకి వస్తుండటంతో.. ఇప్పట్లో హర్షసాయిని అరెస్ట్‌ చేయడం అంతే సులువు కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, హర్షసాయి బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రయోట్‌ చేసి కోట్లు వెనకేసుకున్నాడని, అతను బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రయోట్‌ చేయడం వల్ల ఎంతో మంది అమాయకులు బెట్టింగ్స్‌ పెట్టి.. అప్పులు పాలై.. ఆత్మహత్యలు చేస్తుకున్నారని హర్షసాయిపై కొంతమంది ఆరోపణలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దుబాయ్‌లో బెట్టింగ్‌ మాఫియానే అతనికి ఆశ్రయం కల్పిస్తోందన్న విషయం వింటుంటే.. అతను ఏ స్థాయికి వెళ్లాడో అర్థం చేసుకోవచ్చు. ఒక వేళ నిజంగానే అతను దుబాయ్‌లో ఉంటే.. అతన్ని ఎప్పటి వరకు అరెస్ట్‌ చేస్తారు? ఇండియాకు తీసుకొచ్చేందుకు ఏవైనా రూల్స్‌ అడ్డుపడతాయా? ఇలా అనే విషయాలపై సోషల్‌ మీడియాలో సైతం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. మరి హర్షసాయి దుబాయ్‌లో ఉన్నాడని కేసు పెట్టిన యువతి కుటుంబ సభ్యులు చెబుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.