iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు, కెరీర్ సాఫీగా లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది కొంతమంది బలవన్మరణాలకు పాల్పపడుతున్న విషయం తెలిసిందే. తాము అభిమానించే నటీనటులు చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.

హాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎనిమిది హ్యారీ పోటర్ మూవీస్ సీరీస్ లో ప్రొఫెసర్ ఆల్బస్ డంబుల్ డోర్ పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన ప్రముఖ నటుడు మైఖేల్ గాంబన్(82) కన్నుమూశారు. గత కొంత కాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో కన్నుమూసినట్లు ఆయన సతీమణి లేడీ గాబోస్, కుమారుడు ఫెర్గస్ మీడియాకు వెల్లడించారు. ఈ విషయం తెలియడంతో హాలీవుడ్ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.

డబ్లిన్ లో జన్మించిన మైఖేల్ గాంబస్ నటుడిగా ఆరు దశాబ్దాల పాటు కొనసాగారు. ఒథెల్లో, హామ్లెట్, మక్ బెత్, కొరియోలాసన్ పాత్రలు బాగా పేరు తెచ్చాయి. టీవీ, ఫిల్మ్, థియేటర్, రేడియోలో పనిచేశాడు. ఆయన కెరీర్ లో ఎన్నో అవార్డులు.. రివార్డులు గెల్చుకున్నారు. పదమూడు ఆలివర్ అవార్డులకు నామినేట్ చేయబడ్డాయి. హ్యారీ పోటర్ మూవీస్ లో గడ్డం, టాసెల్ టోపీతో ఆయన ప్రొఫెసర్ ఆల్బస్ డంబుల్ డోర్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఫెంటాస్టిక్ మిస్టర్ ఫాక్స్, ది సింగింగ్ డిటెక్టీవ్ వంటి మూవీస్ లో నటించారు. ఆయన మృతిపై సీనీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి