Harish Shankar On Pawan Kalyan Comments Regarding Movies: పవన్ వ్యాఖ్యలపై.. మిస్టర్ బచ్చన్ ఈవెంట్ లో హరీశ్ మరోలా రిప్లయ్!

పవన్ వ్యాఖ్యలపై.. మిస్టర్ బచ్చన్ ఈవెంట్ లో హరీశ్ మరోలా రిప్లయ్!

Harish Shankar On Pawan Kalyan Comments Regarding Movies: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మిస్టర్ బచ్చన్ గురించే చర్చ జరుగుతోంది. అలాగే ఎక్కడ చూసినా హరీశ్ శంకరే కనిపిస్తున్నాడు. వరుస ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. తాజాగా పవన్ కల్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై హరీశ్ శంకర్ స్పందించాడు.

Harish Shankar On Pawan Kalyan Comments Regarding Movies: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మిస్టర్ బచ్చన్ గురించే చర్చ జరుగుతోంది. అలాగే ఎక్కడ చూసినా హరీశ్ శంకరే కనిపిస్తున్నాడు. వరుస ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. తాజాగా పవన్ కల్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై హరీశ్ శంకర్ స్పందించాడు.

మరొకొన్ని గంటల్లో మిస్టర్ బచ్చన్ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ప్రమోషనల్ కంటెంట్ కి మంచి అప్లాజ్ రావడంతో.. ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. అన్నిటా, అంతటా హరీశ్ శంకర్ ముందుండి నడిపిస్తున్నాడు. లెక్కకి మించిన ప్రెస్ మీట్స్, అంతే స్థాయిలో ఇంటర్వూస్ ఇస్తూ తెగ బిజీ అయిపోయాడు. తాజాగా ప్రింట్ అండ్ వెబ్ తో మరో ప్రెస్ మీట్ జరిగింది. ఎదురుగా మీడియా ఉంటే ఈ మాస్ డైరెక్టర్ లో ఇంకాస్త జోష్ పెరుగుతుంది. ఫిల్మ్ జర్నలిస్టుల పరిస్థితి కూడా ఇంతే. హరీశ్ కి సూటైన క్వచ్చన్స్ సంధించడం వీరికి భలే సరదా. సరే ఇది వేరే సబ్జెక్ట్. ఇక ఈ ప్రెస్ మీట్ కూడా హాట్ హాట్ గానే జరిగింది. బచ్చన్ విశేషాలు సవివరంగా చెప్పారు హరీశ్ శంకర్. సినిమా విడుదలకి చాలా తక్కవ సమయం ఉండటంతో.. ఒరిజినల్ కథలో తాను చేసిన ఛేంజస్ కూడా రివీల్ చేసేశాడు దర్శకుడు. అయితే.. ప్రెస్ మీట్ మొత్తం మీద పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ మాత్రం బాగా హైలెట్ అయ్యింది.

కొన్ని రోజుల క్రితం పవన్ ఓ మీటింగ్ లో సినిమాల తీరుపై ఓపెన్ కామెంట్స్ చేశారు. ఒకప్పుడు అడవులు కాపాడేవారు మన హీరోలు. ఇప్పుడు అడవులు నరుకుతూ, స్మగ్లింగ్ చేసే వాళ్ళు మనకి హీరోలు అయిపోయారు. సినిమాల తీరు మారిపోయింది అంటూ పవన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అక్కడ పవన్ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడిన మాటలు అవి. ఎంత జనరలైజ్ స్టేట్మెంట్ అనుకుందాంలే అనుకున్నా.. ఓ సెక్షన్ మీడియా ఈ కామెంట్స్ ని ఓ స్టార్ హీరోకి ఆపాదించేసింది. గత కొన్ని రోజులుగా ఈ విషయంలో చాలానే చర్చ నడించింది. ఇక ఆ టాపిక్ ఈ ప్రెస్ మీట్ లో హరీశ్ దాక చేరింది. మాములుగా ఎవరైనా ఇలాంటి సందర్భంలో నో కామెంట్స్ అంటారు. కానీ.., హరీశ్ మెంటాలిటీ అది కూడా. స్ట్రైట్ గా ఆన్సర్ ఇచ్చాడు. అది కూడా కర్ర విరగకుండా, పాము చావకుండ!

“పవన్ కళ్యాణ్ గారికి సామాజిక బాధ్యత ఎక్కువ. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కూడా. సినిమాలకి దూరంగా ఉంటున్నారు. సమాజం గురించి ఎక్కువ ఆలోచించాలి. ఆయన కామెంట్స్ అలాంటివే. కానీ.., సినిమాలు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి అన్నది ఆయన ఉద్దేశం కాదు. అయినా.. సినిమాలు చూసి చెడిపోయే పని అయితే.. సినిమాలు చూసి ఎంత మంది సాఫ్ట్ వేర్ కుర్రాళ్ళు గొడ్డలి పట్టుకొని అడవులకి వెళ్లిపోయారు? అలాంటి పరిస్థితి లేదు కదా? సమాజం ఎలా అయితే మంచిచెడుల సమ్మేళనమో, సినిమా కూడా అంతే. ఇదో ఊహాజనిత ప్రపంచం అంతే” అంటూ హరీశ్ శంకర్ తన వెర్షన్ వివరించారు. నిజానికి రేపు మూవీ రిలీజ్ పెట్టుకొని, ఇలాంటి సున్నితమైన అంశంపై స్పందించడం నిజంగా రిస్క్ ఫ్యాక్టరే. కానీ.., తెలియనిది ఏముంది? హరీశ్ అంటే అంతే.. కాస్త మొండోడు. ఇంకాస్త సూటిగా ఉండే మనిషి. ఫేక్ ఎమోషన్స్, ఫేక్ రియాక్షన్స్ ఉండవు. కాకుంటే మాటకారి కాబట్టి.. పెద్ద ముప్పు అవలీలగా తప్పించుకున్నాడు. ఇక మిస్టర్ బచ్చన్ ఆగస్టు 14న సాయంత్రం 7 గంటల నుండే పెయిడ్ ప్రీమియర్స్ మొదలవుతున్నాయి. మరి.. బచ్చన్ రీ సౌండ్ ఎలా ఉంటుందో చూడాలి.

Show comments