Harish Shankar: త్రివిక్రమ్ తో గొడవలు.. పూర్తి క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్!

Harish Shankar: త్రివిక్రమ్ తో గొడవలు.. పూర్తి క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్!

త్రివిక్రమ్ శ్రీనివాస్ కు తనకు మధ్య గొడవలు ఉన్నాయన్న వార్తలపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ హరీష్ శంకర్.

త్రివిక్రమ్ శ్రీనివాస్ కు తనకు మధ్య గొడవలు ఉన్నాయన్న వార్తలపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ హరీష్ శంకర్.

సినిమా ఇండస్ట్రీలో పలానా హీరోతో పలానా హీరోకి గొడవలు ఉన్నాయని, ఆ హీరోయిన్ కు, ఈ హీరోయిన్ కు పడదన్న వార్తలను మనం ఎన్నో విన్నాం. ఇక ఆ ఇద్దరి డైరెక్టర్లకు గొడవలు జరుగుతున్నాయన్న న్యూస్ లు సైతం వినే ఉన్నాం. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో డైరెక్టర్ హరీష్ శంకర్ కు గొడవలు ఉన్నాయని, అందుకే మిస్టర్ బచ్చన్ మూవీలో త్రివిక్రమ్ ను టార్గెట్ చేసుకుని పంచ్ డైలాగ్స్ రాశాడని హరీష్ శంకర్ పై ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ సాబ్. దాంతో అందరి నోళ్లు మూసుకున్నాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ కు డైరెక్టర్ హరీష్ శంకర్ కు మధ్య విభేదాలు ఉన్నాయని, అందుకే మిస్టర్ బచ్చన్ మూవీలో ప్రభాస్ శ్రీను పాత్రకు యాక్టింగ్ గురు అని పేరు పెట్టి పంచ్ డైలాగ్స్ రాశాడని చాలా మంది కామెంట్స్ చేశారు. ఇక ఇద్దరికి గొడవలు ఉన్నాయన్న వార్తలు షికార్లు చేశాయి. ఈ వార్తలపై తాాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హరీష్ శంకర్ పూర్తి క్లారిటీ ఇచ్చాడు. హరీష్ శంకర్ మాట్లాడుతూ..”నేను అసిస్టెంట్ డైరెక్టర్ కాకముందే త్రివిక్రమ్ కు పెద్ద ఫ్యాన్ ను. అప్పటికే ఆయనకు మూడు నంది అవార్డ్స్ డైలాగ్స్ విభాగంలో వచ్చాయి. ఆ తర్వాత మరికొన్ని వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పని ఓ విషయం మీకు చెబుతాను. మా నాన్న త్రివిక్రమ్ కు పిచ్చి అభిమాని. ఆయనంటే ఎంత పిచ్చి అంటే.. అతడు మూవీని ఎన్నిసార్లు చూశాడో లెక్కేలేదు. నేను ఏ మూవీలో అయిన పంచ్ డైలాగ్స్, కమర్షియల్ సీన్లు ఎక్కువైతే.. త్రివిక్రమ్ ను చూసి నేర్చుకో అని చెప్పేవాడు. మా ఇంట్లో ఆయన పెద్ద కొడుకు, నేను చిన్నకొడుకు లెక్క” అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.

“మా నాన్న మాటలు విన్నాక.. నేను కూడా నా  సినిమా అన్ని త్రివిక్రమ్ వాళ్ల నాన్నకు చూపించి.. సర్ మీరు కూడా నా ఫ్యాన్ అని చెప్పండి సర్, మీ ఇంట్లో చిన్న కొడుకులా ఉంటాను అని ఆయనతో చెప్పాలనుకున్నాను. అలాంటి బాండింగ్ మా ఇద్దరి మధ్య ఉంది. ఇక సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలను చూసి నవ్వుకోవాల్సిందే తప్ప.. ఈ ట్రోల్స్, విమర్శలను నేను పెద్దగా పట్టించుకోను. తెలుగు సినిమా చరిత్రలో డైలాగ్స్ విషయంలో ఆయన ఓ ప్రత్యేక ముద్ర వేశారు. త్రివిక్రమ్ అంటే ఎప్పటికీ నాకు గౌరవమే ఉంటుంది” అని ఈ స్టార్ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. దాంతో ఇన్ని రోజుల నుంచి వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయ్యింది.

Show comments