SNP
Hari Hara Veera Mallu Teaser: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీర మల్లు సినిమా టీజర్‌ను చిత్ర బృందం సైలెంట్‌గా రిలీజ్ చేసేసింది. అయితే.. మరి ఆ టీజర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Hari Hara Veera Mallu Teaser: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీర మల్లు సినిమా టీజర్‌ను చిత్ర బృందం సైలెంట్‌గా రిలీజ్ చేసేసింది. అయితే.. మరి ఆ టీజర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
SNP
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ హరి హర వీరమల్లు సినిమా టీజర్‌ను ఎలాంటి హడావిడి లేకుండా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ రోజు టీజర్ వస్తుందనే విషయం ఎవరి తెలియదు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తి అయిపోయినా.. పవన్ రాజకీయ బిజీ వల్ల సినిమాను కొన్ని నెలలు పక్కనపెట్టారు. కానీ, ఇప్పుడు ఉన్నపళంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీచర్‌లో పవన్ లుక్, 17 శతాబ్దపు పరిస్థితులు తెలిపేలా ఆర్ట్ వర్క్ అభిమానులను ఆకట్టుకుంటాయి. ఢిల్లీ సుల్తానులు, మొఘల్స్ కాలంలో ప్రజలను ఎలా దోచుకున్నారు. ఇక్కడి నిజాం నవాబులు, అలాగే దొరలు ప్రజలను ఎలా పీడించుకుతిన్నారు. వారిని వీరమల్లు అనే దొంగ ఎలా రక్షిస్తాడు అనే విషయాలను చూపించనున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. అయితే.. టీజర్‌లో చూపించిన యాక్షన్ సీన్స్‌లో పవన్ కళ్యాణ్ అదరగొట్టారు.
అయితే.. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇదే తొలి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. న్యాయం కోసం యుద్ధం చేసే ఒంటరి యోధుడుగా పవన్ కళ్యాణ్ పోషిస్తున్న ‘హరి హర వీర మల్లు’ పాత్రను టీజర్ లో చూపించారు. అణిచివేతకు గురవుతున్న వారికి అండగా నిలబడే వీరుడిలా పవన్ కళ్యాణ్ కనిపిస్తుంటే, మొఘల్ చక్రవర్తిగా ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ కనిపిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో నటి నిధి అగర్వాల్, సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా, టీజర్ విడుదల సందర్భంగా, నిర్మాతలు ఒక కీలక ప్రకటన చేశారు. “ఎనక్కు 20 ఉనక్కు 18”, “నీ మనసు నాకు తెలుసు”, “ఆక్సిజన్” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మరియు “నట్పుక్కాగ”, “పడయప్ప” వంటి కల్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా పనిచేసిన రచయిత-దర్శకుడు జ్యోతి కృష్ణ, ‘హరి హర వీర మల్లు’ సినిమా మిగిలిన షూట్‌ను, పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్రిష్ పర్యవేక్షణలో పూర్తి చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి హరి హర వీర మల్లు సినిమా టీజర్ మీకెలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి.