iDreamPost
android-app
ios-app

హనుమాన్ ట్రైలర్ అప్పుడే.. పండగ రేసులో స్పీడ్!

చిన్నప్పుడే నటనలో పరిపక్వత కనబర్చాడు తేజా సజ్జ. ఏ హీరోలకు అయితే కొడుకుగా నటించాడో.. ఇప్పుడు అదే నటులతో (వెంకటేశ్, మహేష్ బాబు) పోటీ అవుతున్నాడు. ఈ సంక్రాంతి బరిలో తన మూవీతో హనుమాన్ తో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లను షురూ చేసింది చిత్ర యూనిట్.

చిన్నప్పుడే నటనలో పరిపక్వత కనబర్చాడు తేజా సజ్జ. ఏ హీరోలకు అయితే కొడుకుగా నటించాడో.. ఇప్పుడు అదే నటులతో (వెంకటేశ్, మహేష్ బాబు) పోటీ అవుతున్నాడు. ఈ సంక్రాంతి బరిలో తన మూవీతో హనుమాన్ తో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లను షురూ చేసింది చిత్ర యూనిట్.

హనుమాన్ ట్రైలర్ అప్పుడే.. పండగ రేసులో స్పీడ్!

తేజా సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబోలో వస్తున్న మూడో చిత్రం హనుమాన్. చిన్న చిత్రంగా మొదలై.. సుమారు రెండేళ్ల పాటు షూటింగ్ జరుపుకుని.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి విడుదల కాబోతుంది. సూపర్ హీరో మూవీగా రాబోతున్న హనుమాన్.. పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ విజువల్ వండర్స్ క్రియేట్ చేసిన సంగతి విదితమే. తేజకు జోడీగా అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుంది. వాన మూవీ హీరో వినయ్ రాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో విడుదల కాబోతున్న ఈ చిత్రం పెద్ద హీరోలతోనే తలపడుతోంది.

ఇక మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో స్పీడు పెంచింది చిత్ర యూనిట్. హనుమాన్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 19న హనుమాన్ ట్రైలర్ వీడియో రాబోతున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను పంచుకున్నాడు ప్రశాంత్. అలాగే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కాబోతున్నట్లు వెల్లడించాడు. ఎప్పుడో సినిమా షూటింగ్ స్టార్ కాగా, పలు కారణాలతో సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. తొలుత చిన్న సినిమాగా మారి.. ఆ తర్వాత పాన్ ఇండియన్ మూవీగా అవతరించింది. 2023లోనే విడుదలౌతుందని ఆశించారంతా. అయితే వీఎఫ్ఎక్స్ పనుల్లో ఆలస్యంగా కారణంగా విడుదల తేదీ 2024 సంక్రాంతికి మారింది.

ఆ మూవీతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న ప్రశాంత్ వర్మ.. జాంబిరెడ్డితో వావ్ అనిపించాడు. ఆ తర్వాత తేజ, ప్రశాంత్ కాంబినేషన్‌లో ఓటీటీ కోసం అద్భుతం సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు హనుమాన్ అనే ప్రాజెక్టును చేపట్టారు. షూటింగ్, వీఎఫ్ఎక్స్ ఇతర పనుల జాప్యం కారణంగా ఇప్పుడు వచ్చే ఏడాది పండుగకు వస్తోంది. అయితే ఇదే సమయంలో మహేష్ గుంటూరు కారం, నాగార్జున నా సామి రంగా, వెంకటేష్ సైంధవ్ మూవీలు ఉన్నాయి. ఫ్యామిలీ స్టార్ కూడా ఉండేది ఈ బరి నుండి తప్పుకుంది. మరీ ఈ సినిమాలన్నీంటిని తట్టుకుని ఏ మేరకు హనుమాన్ నిలబడుతుందో వేచి చూడాలి. మరీ ఈ మూవీతో తేజ, ప్రశాంత్ హ్యాట్రిక్ హిట్ కొడతారని ఆశిస్తున్నారా.. అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.