iDreamPost

HanuMan: హనుమాన్ విలన్.. ఆ ట్రాజెడీ మూవీ హీరో అని తెలుసా..?

హనుమాన్ మూవీలో తేజ సజ్జా ఎంత అలరించాడో.. విలన్ కూడా అంతే ఆకట్టుకున్నాడు. తన నటనతో, డైలాగ్ డెలివరీతో ఇరగదీశాడు. సూపర్ హీరో కావాలన్న అతడి కలలను సాకారం చేసుకునేందుకు ఎంత దూరమైన వెళ్లే పాత్రలో కనిపించిన ఈ నటుడు.. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించాడని తెలుసా..?

హనుమాన్ మూవీలో తేజ సజ్జా ఎంత అలరించాడో.. విలన్ కూడా అంతే ఆకట్టుకున్నాడు. తన నటనతో, డైలాగ్ డెలివరీతో ఇరగదీశాడు. సూపర్ హీరో కావాలన్న అతడి కలలను సాకారం చేసుకునేందుకు ఎంత దూరమైన వెళ్లే పాత్రలో కనిపించిన ఈ నటుడు.. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించాడని తెలుసా..?

HanuMan: హనుమాన్ విలన్.. ఆ ట్రాజెడీ మూవీ  హీరో అని తెలుసా..?

ఒక సినిమాకు హీరోనే కాదూ.. బలమైన విలన్ కూడా ఉండాలి. అప్పుడే సినిమా హిట్ ట్రాక్ పడుతుంది. అదే జరిగింది హనుమాన్ మూవీ విషయంలో కూడా. తేజ సజ్జా హీరో అయినప్పటికీ.. ఎంత హనుమాన్ శక్తులు వచ్చినప్పటికీ.. విలన్ ఢీ కొట్టేటప్పుడు తేలిపోకూడదు. ప్రతి నాయకుడి క్యారెక్టర్ ఎంత బలంగా ఉంటుందో.. హీరో క్యారెక్టర్‌కు కూడా అంత ఎలివేషన్ ఇవ్వొచ్చు. అందుకు తగ్గట్లుగా ప్రతి నాయకుడి క్యారెక్టర్ డిజైన్ చేశాడు ప్రశాంత్ వర్మ. సూపర్ హీరో అవ్వాలని చిన్నప్పటి నుండి కలలు కనే విలన్.. అందు కోసం అతడు చేసే ప్రయత్నాలు.. రుధిర మణి కోసం హీరో, విలన్స్ పోరాటం ఈ సినిమాకే హైలెట్.  నెగిటివ్ పాత్రలో కనిపించిన నటుడు వినయ్ రాయ్.

మైఖేల్ పాత్రలో ఆకట్టుకున్నాడు వినయ్ రాయ్. ఈ మూవీలో స్టైలిష్ విలన్‌గా మెప్పించాడు. సూపర్ పవర్స్ కోసం చేసే పనులు కన్విన్స్‌గా ఉంటాయి. ఈ స్టార్ విలన్.. ఓ ట్రాజెడీ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. అయితే అతడిలో మార్పులు కారణంగా మర్చిపోయారంతే. తన సినీ కెరీర్ స్టార్ చేసిన తొలినాళ్లల్లోనే తెలుగు మూవీ చేసి.. యూత్ గుండెల్లో మంచి హీరోగా ముద్ర పడ్డాడు. కానీ తెలుగులో మళ్లీ హీరోగా చేయలేదు. ఆ ట్రాజెడీ సినిమానే వాన. 2008లో ఈ చిత్రం విడుదల అయ్యింది. మీరా చోప్రా హీరోయిన్. అండర్ రేటెడ్ మూవీగా పేరు తెచ్చుకున్న ఈ సినిమా క్లైమాక్స్ చూసి కంటతడి పెట్టని లవర్ ఉండడు. ’ఎదుట నిలిచింది చూడు, ఆకాశ గంగా.. దూకావే పెంకితనంగా’ సాంగ్స్ చాలా మందికి హాట్ ఫేవరేట్. ఇప్పటికీ లవ్ ఫెయిల్యూర్ లేదా లవ్‌లో ఉన్న అబ్బాయిలు ఈ పాటల్ని ఇష్టపడుతూ ఉంటారు.

వాన సినిమాలో తన నటనతో కన్నీళ్లు పెట్టిస్తాడు వినయ్. సాధారణంగా లవ్ ఫెయిల్యూర్ అయితే తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరించరు. ఈ మూవీ కూడా హిట్ కాలేదు కానీ.. ఇప్పటికీ టీవీల్లో వాచ్ చేసే వాళ్లు ఉన్నారు. ఈ మూవీతోనే మంచి లవర్ బాయ్ గా ముద్ర పడ్డారు వినయ్. తమిళంలో ఉన్నాలే ఉన్నాలే మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇది తెలుగులో నీవల్లే నీవల్లే డబ్బింగ్ మూవీగా వచ్చింది. వరుస పెట్టి తమిళ సినిమాలు చేశాడు ఈ యంగ్ హీరో. కానీ హీరోగా చేసిన సినిమాలన్నీ బెడిసి కొట్టడంతో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశాడు. ఆ తర్వాత విలన్ అవతారం ఎత్తి విశాల్ తుప్పరివాలన్ లో నటించాడు.

అక్కడి నుండి వరుసగా ప్రతి నాయకుడి పాత్రలు పలకరించాయి. డాక్టర్, సూర్య ఈటీ, ఓ మై గాడ్ వంటి చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు. తెలుగులో గాంఢీవధారీ అర్జునతో రీ ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా కాదూ విలన్‌గా. హనుమాన్‌తోనే రీ ఎంట్రీ ఇచ్చాడు.. కానీ ఈ సినిమా వాయిదా పడుతూ రావడంతో వరుణ్ తేజ్ మూవీ ముందు విడుదల అయ్యింది. ఇప్పుడు ఈ మూవీతో మళ్లీ తెలుగులో కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లే. అయితే చాలా మంది వాన హీరోను గుర్తు పట్టలేకపోతున్నారు. ప్రస్తుతం అతడి గెటప్ మొత్తం మారిపోయింది. వాన హీరో అని గుర్తించలేకపోతున్నారు. మీరు గెస్ చేసినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి

 

View this post on Instagram

 

A post shared by Sree Gokulam Movies (@sreegokulammoviesofficial)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి