iDreamPost
android-app
ios-app

Prasanth Varma: ప్రశాంత్ వర్మ బంపర్ ఆఫర్ సామాన్యులకు జై హనుమాన్ లో నటించే అవకాశం..

  • Published May 03, 2024 | 4:29 PM Updated Updated May 03, 2024 | 4:29 PM

ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ మూవీ.. అందరిలో మనసులలో బలంగా నాటుకుపోయింది. టీజర్ దగ్గర నుంచి టెలివిజన్ టెలికాస్ట్ వరకు ప్రతిదీ రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ దర్శకుడు మరొక అందరికి మరొక బంపర్ ఆఫర్ ను ప్రకటించాడు.

ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ మూవీ.. అందరిలో మనసులలో బలంగా నాటుకుపోయింది. టీజర్ దగ్గర నుంచి టెలివిజన్ టెలికాస్ట్ వరకు ప్రతిదీ రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ దర్శకుడు మరొక అందరికి మరొక బంపర్ ఆఫర్ ను ప్రకటించాడు.

  • Published May 03, 2024 | 4:29 PMUpdated May 03, 2024 | 4:29 PM
Prasanth Varma: ప్రశాంత్ వర్మ బంపర్ ఆఫర్ సామాన్యులకు జై హనుమాన్ లో నటించే అవకాశం..

ఏదైనా ఓ సినిమా గురించి నెల లేదా రెండు నెలలు మాట్లాడుకుంటారు. కానీ, ఈ సినిమా గురించి మాత్రం టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి టెలివిజన్ టెలికాస్ట్ వరకు .. అదే రేంజ్ లో హిట్ టాక్ నడిచింది. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా మరేదో కాదు ప్రశాంత్ వర్మ రూపుదిద్దిన “హనుమాన్” మూవీ. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ పేరు మోత మోగిపోయింది. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు అందరు హనుమాన్ సిక్వెల్.. “జై హనుమాన్” గురించి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ .. “ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ” అంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో ముందుకు వచ్చాడు.. అదేంటో చూసేద్దాం.

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఏ ఏ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారో తెలియనిది కాదు. అయితే ఇప్పటివరకు ఎవరు కూడా.. మునుపెన్నడూ చూడని విధంగా సినిమాలపై ఆసక్తి కలిగిన ప్రతిభావంతులందరు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU ) లో భాగస్వాములు కావొచ్చని.. ఓ ఆఫర్ ను ప్రకటించారు. ఇది చాలా పెద్ద అవకాశం అని చెప్పి తీరాలి. స్వయంగా ప్రశాంత్ వర్మ ఈ విషయాన్నీ తెలియజేస్తూ.. ఓ నోట్ రాసుకొచ్చారు.. “కాలింగ్ ఆల్ ఆర్టిస్ట్. సూపర్ పవర్స్ గురించి మాట్లాడుకుందాం! మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే మీ ప్రత్యేకమైన నైపుణ్యం ఏమిటి? అది కథలు రూపొందించే నేర్పా, ఎడిటింగ్, గ్రాఫిక్స్‌తో మంత్రముగ్ధులను చేసే నైపుణ్యం ఉందా. గొప్పగా మార్కెటింగ్ చేయగలరా. మీ కళాత్మక నైపుణ్యాలతో కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాలని ఉందా?.. మీకున్న అతిగొప్ప కళాత్మక నైపుణ్యాలు ఏంటో చెప్పండి. మనం కలిసి కొత్త వరల్డ్ క్రియేట్ చేద్దాం. మీ పోర్ట్‌ఫోలియోలను “talent@thepvcu.com” ద్వారా తెలియజేయండి. మిమ్మల్ని PVCU కలుస్తాను” అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎవరికైనా సరే.. యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ ఇలా ఏ రంగంలోనైనా ఇంట్రెస్ట్ కానీ టాలెంట్ కానీ ఉన్నట్లయితే.. వారికి ఇదొక మంచి అవకాశం అని చెప్పి తీరాలి. జై హనుమాన్ చిత్రానికి సంబంధించిన ఏ వర్క్ లోనైనా వారి వారి టాలెంట్ ను బట్టి ఇందులో భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా వర్క్ ఫోర్స్ ను నిర్మించాలని ప్రశాంత్ వర్మ బలంగా సంకల్పించారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ ఇలా అందరిని తన సినిమాటిక్ యూనివర్స్ లోకి ఆహ్వానిస్తూ.. సరికొత్త సినీ ప్రపంచాన్ని.. మూవీ లవర్స్ కు పరిచయం చేయనున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.