Arjun Suravaram
Hanuman Movie: ఈమధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపించిన పేరు హనుమాన్. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో తెరకెక్కిన హనుమాన్ సినిమా.. ప్రీమియర్ల నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
Hanuman Movie: ఈమధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపించిన పేరు హనుమాన్. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో తెరకెక్కిన హనుమాన్ సినిమా.. ప్రీమియర్ల నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
Arjun Suravaram
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగర్ హీరో తేజ సజ్జ కాంబినేషన్లో వచ్చిన మూవీ హనుమాన్. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా 100 శాతం ఇచ్చి పడేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం థియేటర్లలో హనుమాన్ జోరు కొనసాగుతున్నది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. కొన్ని ప్రాంతాల్లో జక్కన్న చెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో హనుమాన్ సినిమా పోటీ పడుతుంది.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ యాక్టీవ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే శాసించింది. ఎన్నో రికార్డులను సైతం తిరగాసి.. చిత్రపరిశ్రమలో తన దండయాత్రను కొనసాగించింది. ఈ సినిమా దెబ్బకు ఎన్నో రికార్డులు గల్లంతయ్యాయి. భారతీయులు ఎన్నో ఏళ్లు ఎదురు చూసిన ఆస్కార్ అవార్డు కూడా ఈ సినిమాతో నెరవేరింది. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ కి ఆస్కార్ అవార్డు దక్కింది. ఇక ఈ సినిమా దరిదాపుల్లో కూడా ఏ సినిమాలు నిలవలేదు. ఇలాంటి పెద్ద సినిమాతో చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ ఓ విషయంలో పోటీ పడుతుంది.
జనవరి 12 విడుదలైన హనుమాన్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తొలిరోజు పాజిటీవ్ టాక్ రావడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. వివిధ దేశాల్లో అయితే ఏకంగా భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో హనుమాన్ సినిమా దూసుకెళ్తుంది. కోవిడ్ తరువాత ఆర్ఆర్ఆర్, సలార్ సినిమాలు కాకుండా చూసినట్లు అయితే తొలి రోజే అత్యధిక గ్రాసరీ సాధించిన తెలుగు సినిమాగా హనుమాన్ రికార్డు సృష్టించింది. తొలి రోజే 50 వేల డాలర్ల పై చిలుకు కలెక్షన్లను సాధించింది. ఇంకా కలెక్షన్ల వేట కొనసాగిస్తూనే ఉంది. ఇక ఈ వసూలు చూస్తే.. ఆర్ఆర్ఆర్ తో పోటీ పడుతున్నట్లు ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. మొత్తంగా అంచనాలకు మించి హనుమాన్ సినిమా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తుంది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. అన్ని అడ్డంకులు దాటుకుని హనుమాన్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజైంది. విడుదలైన అన్ని భాషల్లో సినిమాకు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ వచ్చింది. సౌత్‌లో కంటే నార్త్‌లో మూవీకి ఎక్కువ క్రేజ్ వచ్చింది. హిందీ ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. అలానే తేజకు జోడిగా అమృత అయ్యార్ ఈసినిమాలో నటించింది. మరి.. ఆర్ఆర్ఆర్ తో పోటీ పడుతున్న హనుమాన్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Hanuman Grossed around $500K+ on Day 1 in North America. Apart from RRR and Salaar, this is the highest Day 1 Grosser in Telugu Cinema Post Covid 🙏🔥
— Venky Box Office (@Venky_BO) January 13, 2024