Krishna Kowshik
ఇద్దరు యంగ్ స్టార్స్ మరోసారి తమ సత్తాను యావత్ భారత దేశానికి చూపిస్తున్నారు. వాళిద్దరే తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన మూడవ చిత్రం హనుమాన్.. థియేటర్లు దద్దరిల్లేలా చేయడమే కాదూ.. చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చలా చేస్తోంది.
ఇద్దరు యంగ్ స్టార్స్ మరోసారి తమ సత్తాను యావత్ భారత దేశానికి చూపిస్తున్నారు. వాళిద్దరే తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన మూడవ చిత్రం హనుమాన్.. థియేటర్లు దద్దరిల్లేలా చేయడమే కాదూ.. చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చలా చేస్తోంది.
Krishna Kowshik
తేజ సజ్జా హీరోగా, వర్సటైల్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్వకత్వంలో వచ్చిన మరో కళాఖండం హనుమాన్. సంక్రాంతి పర్వదినాన్నిపురస్కరించుకుని విడుదలైన ఈ బొమ్మ..బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కేవలం టాలీవుడ్‌లోనే కాదూ .. బాలీవుడ్ బాక్సాఫీసులో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రాని బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. పురాణ, ఇతి హాస గాధల్లోని ఓ సూపర్ హీరో హనుమంతుడి శక్తులు ఓ సామాన్యుడికి వస్తే ఎలా ఉంటుందో చూపించడంలో ప్రశాంత్ వర్మ.. సెంట్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. ఈ మూవీపై తొలి నుండి అంచనాలు ఉన్నా.. ఇంతటి భారీ స్పందన వస్తుందని ఊహించలేదు చిత్ర యూనిట్ సైతం. చిన్న బడ్జెట్ మూవీగా వచ్చిన ఈచిత్రం థియేటర్లను దద్దరిల్లేలా చేస్తుంది. ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి.
తొలి రోజే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 21 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా, ఈ మూవీ బడ్జెట్.. రూ. 30 కోట్లలోపే అని సమాచారం. ఈ లెక్కన..రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటేయనుంది ఈ సినిమా. వంద కోట్లను బీట్ చేసే దిశగా దూసుకెళుతుంది. ఈ మూవీ పాజిటివ్ వైబ్స్ చూస్తుంటే..ఇంకా భారీగా కలెక్షన్లు కొల్లగొట్టడం పక్కా అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమాకు వచ్చిన రివ్యూస్ కూడా సినిమాపై, కలెక్షన్లపై అంచనాలను తారుమారు చేయడమే కాదూ.. తల్లకిందులు చేసేస్తున్నాయి. మొత్తానికి హనుమాన్ చిత్రం తొలి రోజు కలెక్షన్ల విషయంలోనే.. లెక్కలు మార్చేస్తుంది. బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. ఇక్కడే కాదూ విదేశాల్లో కూడా కాసుల వర్షం కురిపిస్తుంది. ఆర్ఆర్ఆర్, సలార్ వంటి చిత్రాల కలెక్షన్లతో పోటీ పడుతుంది.
సూపర్ హీరో కథను.. అద్భుతంగా తెరకెక్కించడంతో థ్రిల్ ఫీలవుతున్నారు ప్రేక్షకులు.హనుమాన్ మూవీకి హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో థియేటర్ల సంఖ్య పెరుగుతున్నాయి. ఇదే సమయంలో స్టార్ హీరో మహేష్ గుంటూరు కారం సినిమాకు గట్టి పోటీని ఇస్తుంది. ఇక ఈ సినిమాపై సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు వస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ, రవితేజ, గోపిచంద్ వంటి సెలబ్రిటీలు ప్రశాంత్ వర్మకు అభినందనలు తెలుపుతూనే.. ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇంతింతై.. వటుడింతయై అనే సామెత చందంగా హనుమాన్ మూవీ క్రేజ్ రోజు రోజుకూ పెరిగిపోతుంది. ఈ మూవీ కోసం చాలా మంది టికెట్స్ బుక్ చేసుకుంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఏదేమైనా ఊహించిన దాని కంటే..ఎక్కువ రెస్పాన్స్ సినిమాకు వస్తుంది. హనుమంతుని శక్తి, దీవెనలు హనుమాన్ మూవీకి అందినట్లు ఉన్నాయి. మరీ ఈ మూవీ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.