iDreamPost
android-app
ios-app

యూట్యూబర్ పై రిషి ఫైర్.. అతడిని నమ్మొద్దంటూ.. అసలు ఏం జరిగిందంటే?

  • Published Apr 29, 2024 | 7:05 PM Updated Updated Apr 29, 2024 | 7:05 PM

Guppedantha Manasu Fame Mukesh Gowda: గుప్పెడంత మనసు సీరియల్ తో ముఖేష్ గౌడకు మంచి గుర్తింపు దక్కింది. అతని ఒరిజినల్ నేమ్ కంటే కూడా.. రిషి సార్ అంటేనే టక్కున గుర్తు పడతారు. ఇప్పుడు ఈ రిషి సార్ అభిమానులకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు.

Guppedantha Manasu Fame Mukesh Gowda: గుప్పెడంత మనసు సీరియల్ తో ముఖేష్ గౌడకు మంచి గుర్తింపు దక్కింది. అతని ఒరిజినల్ నేమ్ కంటే కూడా.. రిషి సార్ అంటేనే టక్కున గుర్తు పడతారు. ఇప్పుడు ఈ రిషి సార్ అభిమానులకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు.

  • Published Apr 29, 2024 | 7:05 PMUpdated Apr 29, 2024 | 7:05 PM
యూట్యూబర్ పై రిషి ఫైర్.. అతడిని నమ్మొద్దంటూ.. అసలు ఏం జరిగిందంటే?

ముఖేష్ గౌడ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అయితే ముఖేశ్ గౌడ అనే కంటే.. రిషి సార్ అంటే బుల్లితెర ఆడియన్స్ అంతా టక్కున గుర్తు పట్టేస్తారు. గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి సార్ గా నటించిన ముఖేష్ గౌడ తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ సీరియల్ యాక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి పాత్ర అయిపోయింది. ఆయన సీరియల్ లో చేయడం మానేసి కూడా చాలా రోజులు అయ్యింది. అయితే తాజాగా ముఖేష్ గౌడ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక రిక్వెస్ట్ చేశాడు. తన పేరిట రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు వాటిని నమ్మద్దు అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాడు.

గుప్పెడంత మనసు సీరియల్ కి ఎంతో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే రిషి, వసుధార పాత్రలకు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ సీరియల్ లో రిషిగా ముఖేష్ గౌడ యాక్ట్ చేయడం లేదు. వసుధార పాత్ర ఉన్నా కూడా అంత వెయిట్ అనిపించడం లేదు. గతంలో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ సీరియల్ కి తగ్గిపోయింది. జగతి మేడమ్ పాత్ర లేకపోవడం, ముఖేష్ గౌడ కనిపించకపోవడం, వసుధార పాత్ర ఉన్నా లేనట్టే అన్న ఫీలింగ్ కలగడంతో పెద్దగా ఆదరణ కూడా లభించడం లేదు. అయితే గుప్పెడంత మనసు సీరియల్ నుంచి ముఖేష్ గౌడను తొలగించారని, డైరెక్టర్ తో కూడా గొడవలు అంటూ కొన్ని పుకార్లు వచ్చాయి. వాటిని బేస్ చేసుకుని ముఖేష్ గౌడ ఫ్యాన్స్ ప్రొడక్షన్ హౌస్ ని తిట్టడం స్టార్ట్ చేశారు. ఆ రూమర్స్ పై హీరో క్లారిటీ ఇచ్చాడు.

Mukesh Gouda

రీసెంట్ గా నాపై కొన్ని రూమర్స్, తప్పుడు వార్తలు వచ్చాయి. అలాంటి వార్తలు, పుకార్లను దయచేసి ఎవరూ నమ్మోద్దు. యూట్యూబ్ ఛానల్స్, ఇన్ స్టాగ్రామ్ పేజెస్, గుప్పెడంత మనసు ఫ్యాన్ పేజెస్ లో వచ్చే రూమర్స్ ని నమ్మకండి. ముఖ్యంగా జావెద్ లాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ డబ్బు సంపాదించుకునే వారిని అస్సలు నమ్మకండి. గుప్పెడంత మనసు సీరియల్ ప్రొడక్షన్ హౌస్, నాతో కలిసి యాక్ట్ చేసిన ఆర్టిస్ట్స్ అంతా నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. నాకు కష్టం వచ్చినప్పుడు వాళ్లంతగా అండగా నిలబడ్డారు. దయచేసి ఎవరూ ప్రొడక్షన్ హౌస్ గురించి తప్పుగా మాట్లాడొద్దు, వారికి ఇబ్బంది కలిగించొద్దు. సీరియల్ లో నా రీ ఎంట్రీ గురించి పదే పదే అడిగి ప్రొడక్షన్ వారిని, నా తోటి నటులను ఇబ్బంది పెట్టకండి.

 

View this post on Instagram

 

A post shared by MUKESH (@_mukesh_gowda5)

కొన్నేళ్లపాటు కష్టపడి మీ అందరి హృదయాల్లో ఇంతటి స్థానం సంపాదించుకున్నాను. ఇలాంటి రూమర్స్ వల్ల నేను ఆ స్థానాన్ని కోల్పోతున్నాను. నా తదుపరి అడుగు ఏంటి అనేది నేనే అధికారికంగా వెల్లడిస్తాను. అప్పటి వరకు ఇలాంటి రూమర్స్ ని నమ్మకండి” అంటూ ముఖేష్ గౌడ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో స్టోరీ పెట్టాడు. ఇప్పటికైనా ముఖేశ్ గౌడ రీఎంట్రీకి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ వారికి ఇబ్బందులు తప్పుతాయేమో? ఇకపై రిషి క్యారెక్టర్ కి సంబంధించి రూమర్స్ కూడా ఆగుతాయేమో చూడాలి. మరి.. ముఖేష్ గౌడ అభిమానులకు చేసిన ఈ రిక్వెస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by MUKESH (@_mukesh_gowda5)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio