iDreamPost

ఊహించిన దాని కన్నా ముందే OTTలోకి గుంటూరు కారం..! ఎప్పుడంటే..?

Guntur Kaaram OTT.. జనవరి 12న విడుదలై రికార్డులు బద్దలు కొట్టడమే కాకుండా కలెక్షను కొల్లగొట్టిన మూవీ గుంటూరు కారం. మహేష్ బాబు, గురూజీ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడవ చిత్రం. ఇప్పుడు ఓటీటీలోకి సందడి చేసేందుకు సిద్ధమైందట..

Guntur Kaaram OTT.. జనవరి 12న విడుదలై రికార్డులు బద్దలు కొట్టడమే కాకుండా కలెక్షను కొల్లగొట్టిన మూవీ గుంటూరు కారం. మహేష్ బాబు, గురూజీ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడవ చిత్రం. ఇప్పుడు ఓటీటీలోకి సందడి చేసేందుకు సిద్ధమైందట..

ఊహించిన దాని కన్నా ముందే OTTలోకి గుంటూరు కారం..! ఎప్పుడంటే..?

ఈ సంక్రాంతికి సందడి చేసిన మాస్ మసాలా చిత్రం గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన మూడవ చిత్రం. మహేష్ మాస్ లుక్స్, డ్యాన్సులు చూసి అభిమానులకు పూనకాలు వచ్చేశాయి. భారీగా కలెక్షన్లను వసూలు చేసింది. జనవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా కొల్లగొట్టింది. మిక్స్ టాక్ వచ్చినా.. బాక్సాఫీసు వద్ద నిలబడి కనక వర్షం కురిపించింది. మదర్ అండ్ సన్ సెంటిమెంట్‌తో మూవీ ఆకట్టుకుంది. ఈ మూవీలో యంగ్ అండ్ టాలెంటెడ్, డాన్స్ క్వీన్ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.

ప్రకాష్ రాజ్, జయరాం, రమ్యకృష్ణ, జగపతి బాబు ముఖ్య పాత్రలు పోషించగా.. ఈశ్వరిరావు, మురళీ శర్మ, అజయ్, రావు రమేశ్, సునీల్ ఇతర తారాగణం. ఈ సినిమా రాధా కృష్ణ, నాగవంశీ నిర్మాతలు. తమన్ మ్యూజిక్ అందించాడు. ఇక ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగానే.. ఓటీటీలోకి వచ్చేస్తుంది. అయితే గతంలో నెల రోజుల తర్వాత ఫ్లాట్ ఫాంలోకి వస్తుందని టాక్ వినిపించింది. అయితే ఊహించిన దాని కంటే ముందే.. ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లెక్స్ భారీ రేటు పెట్టి కొనుగోలు చేసిందట. ఈ మూవీ కూడా నెల తిరగకుండానే స్ట్రీమింగ్ కాబోతుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

గుంటూరు కారం ఫిబ్రవరి 9 లేదా 10వ తేదీన నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం కానుందని తెలుస్తోంది. ఈ లెక్కన ఈ చిత్రం కూడా సలార్ మూవీ బాటలోనే నడుస్తున్నట్లే లెక్క. సలార్ కూడా నెల రోజుల తిరగకుండానే నెట్ ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన సంగతి విదితమే. ఇప్పుడు అనుకున్న తేదీల్లో కనుక గుంటూరు కారం కూడా స్ట్రీమింగ్ అయితే.. వన్ మంత్ కాకుండానే వచ్చేస్తున్నట్లే.  తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుందట. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ పిక్చర్.. ఓటీటీని కూడా షేక్ చేసేసేందుకు రాబోతుంది. ఇటీవల పెద్ద సినిమాలు రిలీజైన వెంటనే ఓటీటీలోకి వచ్చేస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి