iDreamPost
android-app
ios-app

వీడియో: యోగాసనాలు వేస్తున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ని గుర్తు పట్టారా?

  • Published Jun 21, 2024 | 6:54 PM Updated Updated Jun 21, 2024 | 6:54 PM

Guess This Young Tollywood Heroine Doing Yoga: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఒక రీల్ షేర్ చేసింది. ఆమె ఎవరో గుర్తు పట్టారా?

Guess This Young Tollywood Heroine Doing Yoga: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఒక రీల్ షేర్ చేసింది. ఆమె ఎవరో గుర్తు పట్టారా?

  • Published Jun 21, 2024 | 6:54 PMUpdated Jun 21, 2024 | 6:54 PM
వీడియో: యోగాసనాలు వేస్తున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ని గుర్తు పట్టారా?

తెలుగు అమ్మాయిలకు తెలుగు సినిమాల్లో అవకాశాలు రావు అన్నారు. తెలుగు నటి అయితే ఇంక సినిమాల్లోకి తీసుకోరు అంటూ చాలానే విమర్శలు ఉన్నాయి. కానీ, అలాంటి వాటిని పక్కకు తోసేస్తూ.. ఈ అమ్మడు మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఒక మంచి సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటూ ఇప్పుడు చేతినిండా ప్రాజెక్టులతో టాలీవుడ్ లో మంచి హీరోయిన్ పొజిషన్ సొంతం చేసుకుంది. మరోవైపు అటు సోషల్ మీడియాలో కూడా ఈమెకు మంచి ఫాలోయింగే ఉంది. రీల్స్, వీడయోలు, ఫొటోలు షూట్స్ అంటూ సందడి చేస్తూఉంటుంది. తాజాగా ఈమె పెట్టిన ఒక వీడియో ఇప్పుడు నెట్టిట తెగ వైరల్ అవుతోంది.

జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం అని అందరికీ తెలిసిందే. యోగా దినోత్సం సందర్భంగా సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లు ఎన్సర్స్ అంతా ఆసనాలు వేసిన ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఈ హీరోయిన్ కూడా తాను వేసిన కష్టమైన యోగాసనం వీడియో పోస్ట్ చేసింది. అది చూడటానికి చాలా సింపుల్ గా కనిపిస్తుంది. కానీ, ట్రై చేస్తేనే అసలు కష్టం తెలుస్తుంది. ఆమె చేతుల మీద తలకిందులుగా నిల్చోవడం, శీర్షాసనం రెండూ ట్రై చేసింది. ఆ రెండు వీడియోలను కలిపి ఒక రీల్ గా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ రీల్ కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?

ఈ టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మరెవరో కాదు.. అనన్యా నాగళ్ల. ఈ అమ్మడు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా.. ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటూ ఉంటుంది. ఎప్పుడూ రీల్స్, ఫొటో షూట్స్ అంటూ కాస్త హడావుడిగానే ఉంటుంది. తాజాగా యోగా దినోత్సవం సందర్భంగా ఈ రీల్ షేర్ చేసింది. ఈ రీల్ చూసిన ఫ్యాన్స్ అనన్యను మెచ్చేసుకుంటున్నారు. చాలా మంది సెలబ్రిటీలు ఇలాంటివి లైట్ తీసుకుంటారని.. కానీ, అనన్య మాత్రం తన ఫ్యాన్స్, ఫాలోవర్స్ ని హెల్తీగా ఉండేలా జిమ్, యోగా చేసేలా మోటివేట్ చేస్తుంటుంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవలే తంత్ర సినిమాతో ఒక మంచి సాలిడ్ హిట్టును తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పొట్టేలు అనే మూవీ హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. అనన్య నాగళ్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి.. యోగా దినోత్సవం సదర్భంగా అనన్య నాగళ్ల షేర్ చేసిన రీల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ananya nagalla (@ananya.nagalla)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet