iDreamPost
android-app
ios-app

ఈమెను గుర్తు పట్టారా? ఒక్క మూవీ కూడా రిలీజ్ కాకుండానే చేతినిండా సినిమాలు!

Guess This Heroine She Is More Famous Now In tollywood: ఈ ఫొటోలో ఉన్న అమ్మడు ఇప్పుడు టాలీవుడ్ లో చాలా బిజీగా మారిన హీరోయిన్. ఇక్కడ ఇంకో ఆశ్చర్యం ఏంటంటే.. ఈమెది ఇంకా ఒక్క మూవీ కూడా తెలుగులో విడుదల కాలేదు.

Guess This Heroine She Is More Famous Now In tollywood: ఈ ఫొటోలో ఉన్న అమ్మడు ఇప్పుడు టాలీవుడ్ లో చాలా బిజీగా మారిన హీరోయిన్. ఇక్కడ ఇంకో ఆశ్చర్యం ఏంటంటే.. ఈమెది ఇంకా ఒక్క మూవీ కూడా తెలుగులో విడుదల కాలేదు.

ఈమెను గుర్తు పట్టారా? ఒక్క మూవీ కూడా రిలీజ్ కాకుండానే చేతినిండా సినిమాలు!

సాధారణంగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలి అన్నా.. హీరో, హీరోయిన్ గా, టెక్నీషియన్ గా, డైరెక్టర్ గా సెట్ కావాలి అంటే చాలానే సమయం పడుతుంది అంటారు. అలాగే టాలెంట్ మాత్రమే కాదు.. కాస్త లక్ కూడా ఉండాలి అంటారు. అయితే ఈ అమ్మడుకి ఆ లక్కు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తెలుగులో ఒక్క సినిమా కూడా ఇంకా రిలీజ్ కాలేదు. అప్పుడే చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు గురించే తెగ చర్చలు జరుగుతున్నాయి. అసలు ఎవరు ఈ భామ? ఎందుకు అంత చర్చ జరుగుతోందో మీకు తెలుసా?

సాధారణంగా టాలీవుడ్ లో హీరోయిన్స్ కి డిమాండ్ ఎక్కువ. అలాగే ఒక్కసారి క్లిక్ అయితే వద్దన్నా సినిమా ఆఫర్స్ వచ్చి పడుతూ ఉంటాయి. అయితే ఈ అమ్మడుకి ఆ లక్ కాస్త ఎర్లీగానే స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఇంకా ఒక మూవీని కూడా తెలుగులో విడుదల చేయలేదు. కేవలం ఒక చిన్న టీజర్ లో మాత్రమే తళుక్కుమంది. ఆ క్యామియో పర్ఫార్మెన్స్ కే తెలుగు ప్రేక్షకులు విలవిల్లాడిపోతున్నారు. అసలు ఎవరు ఈ అమ్మడు అంటా తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరో మీకు అర్థమైందా? ఆమెను మీరు గుర్తు పట్టారా? చిన్న క్లూ ఏంటంటే.. ఆమె రవితేజ సరసన హీరోయిన్ గా చేస్తోంది. తాజాగా చిన్న షో రీల్ కూడా రిలీజ్ చేశారు.

ఇప్పుడు గుర్తు పట్టే ఉంటారులే. ఏంటి ఇంకా గుర్తు పట్టలేదా? ఆమె మరెవరో కాదు.. హరీశ్ శంకర్- రవితేజ కాంబోలో వస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ మూవీలో హీరోయిన్ గా చేస్తున్న ‘భాగ్యశ్రీ బోర్సే’. తాజాగా మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి టీమ్ ఒక చిన్న షో రీల్ రిలీజ్ చేసింది. ఆ షో రీల్ లో ఎలాంటి డైలాగ్ లేదు. కేవలం క్యారెక్టర్స్ ఎక్స్ ప్రెషన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ తోనే లాగించేశారు. కానీ, ఆ ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు. అసలు ఆమె ఎవరు అంటూ అంతా వెతుకులాట మొదలు పెట్టారు. ఆమెను ముద్దుగా క్యాడ్బరీ బ్యూటీ అంటారు. ఎందుకంటే ఆమెకు క్యాడ్బరీ యాడ్ తోనే ఎక్కువ ఫేమ్ వచ్చింది.

ఈ భాగ్యశ్రీ బోర్సే బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో యారియాన్ 2 అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. జూన్ 14న బీ టౌన్ లో విడుదలైన చందు ఛాంపియన్ అనే సినిమాలో కూడా ఈ అమ్మడునే హీరోయిన్ గా చేసింది. ఈమె ప్రస్తుతం తెలుగు సినిమాలతో బాగా బిజీగా ఉంది. తెలుగులో ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే.. ఈమె భలే క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమెకు ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయి అని టాక్ స్టార్ట్ అయ్యింది. మిస్టర్ బచ్చన్ లోనే కాకుండా.. గౌతమ్ తిన్ననూరి- విజయ్ దేవరకొండ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది.

అంతేకాకుండా సుజీత్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని చేయబోయే మూవీలో కూడా భాగ్యశ్రీనే హీరోయిన్ అని టాక్ స్టార్ట్ అయ్యింది. అతి త్వరలోనే ఈ మూవీకి సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ అమ్మడుకి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగే ఉంది. ప్రస్తుతానికి ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 2.3 లక్షల వరకు ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఈ సంఖ్య మిలియన్స్ కి చేరడానికి పెద్ద సమయం పట్టదు. ఒక్కసారి తెలుగు ప్రేక్షకులను వెండితెర మీద పలకరించాక.. ఆ సంఖ్య అలా పెరుగుతూనే పోతుంది. మరి.. ఈ భాగ్యశ్రీ బోర్సే లక్ మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి