iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారిని గుర్తు పట్టారా? ఇప్పుడో స్టార్‌ హీరోయిన్‌!

  • Published Jan 13, 2024 | 10:48 AM Updated Updated Jan 13, 2024 | 10:48 AM

అందాల పోటీలో పాల్గొన్న ఆమెకు ఓ దర్శకుడు పిలిచి మరీ ఆఫర్‌ ఇచ్చాడు. ఇప్పుడు కన్నడలోనే కాదు.. తెలుగులోనూ ప్రస్తుతం సినిమాలు చేస్తోంది. ఆమె నటించిన తాజా తెలుగు చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతోంది.

అందాల పోటీలో పాల్గొన్న ఆమెకు ఓ దర్శకుడు పిలిచి మరీ ఆఫర్‌ ఇచ్చాడు. ఇప్పుడు కన్నడలోనే కాదు.. తెలుగులోనూ ప్రస్తుతం సినిమాలు చేస్తోంది. ఆమె నటించిన తాజా తెలుగు చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతోంది.

  • Published Jan 13, 2024 | 10:48 AMUpdated Jan 13, 2024 | 10:48 AM
ఈ చిన్నారిని గుర్తు పట్టారా? ఇప్పుడో స్టార్‌ హీరోయిన్‌!

llచిత్ర పరిశ్రమ అనే రంగుల ప్రపంచంలో .. ఆడవాళ్లు నిలదొక్కుకోవాలంటే కచ్చితంగా అందం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకే కాదు.. బయట ఉన్న జనాలకు కూడా నటీమణులు అంటే అందంగా ఉండాలి అనే ముద్ర పడిపోయింది. అందుకే అందంగా ఉన్న వారికే దర్శకులు కావచ్చు.. నిర్మాతలు కావచ్చు.. ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అందాల పోటీల్లో పాల్గొన్న వారికి సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి.

ఆ విధంగానే పై ఫొటోలో ఉన్న చిన్నారి కూడా అందాల పోటీల్లో పాల్గొనటం ద్వారా సినిమా అవకాశం దక్కించుకుంది. మొదటి సినిమాతోటే డెబ్యూటెంట్‌ నటిగా అవార్డును గెలుచుకుంది. మొదటి మూవీ సాధించిన విజయంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. కన్నడలో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తెలుగులో కూడా మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఓ స్టార్‌ హీరోతో ఆమె చేసిన సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది.

Remember this little girl Star heroine now!

ఇప్పటికే ఆ హీరోయిన్‌ ఎవరో మీకు అర్థం అయిపోయి ఉంటంది. ఆమె ఇంకెవరో కాదు.. అషిక రంగనాథ్‌. అషిక 2016లో వచ్చిన ‘ క్రేజీ బాయ్స్‌’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ సినిమాకు గాను ఆమెకు సైమా అవార్డు వచ్చింది. తర్వాత కన్నడ బిజీ హీరోయిన్‌ అయిపోయింది. దాదాపు అందరు స్టార్‌ హీరోలతో సినిమాలు చేసింది. 2023లో వచ్చిన ‘అమిగోస్‌’ అనే చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నందమూరి కల్యాణ్‌ రామ్‌కు జంటగా నటించింది.

ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆమె నటించిన ‘ నా సామిరంగ’ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో అషిక- నాగార్జునకు జంటగా నటించింది. ఈ మూవీ జనవరి 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అషిక నటిస్తున్న ఓ2, గత వైభవ చిత్రాలు ప్రస్తుతం శరా వేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. తెలుగులో నా సామిరంగ సినిమా సాధించే విజయంతోటే అషిక కెరీర్‌ ఆధారపడి ఉంటుంది. మరి, అషిక సినీ కెరీర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobet