Krishna Kowshik
ఒకప్పుడు హీరోయిన్లకు 30 ఏళ్లు వస్తే.. అమ్మ పాత్రలు, అమ్మమ్మ పాత్రలు ఇచ్చేవారు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పడు.. 40 దాటిన హీరోయిన్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తున్న పాప ఆ కోవకే వస్తుంది. ఇంతకు ఈమె ఎవరో గుర్తుపట్టారా..?
ఒకప్పుడు హీరోయిన్లకు 30 ఏళ్లు వస్తే.. అమ్మ పాత్రలు, అమ్మమ్మ పాత్రలు ఇచ్చేవారు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పడు.. 40 దాటిన హీరోయిన్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తున్న పాప ఆ కోవకే వస్తుంది. ఇంతకు ఈమె ఎవరో గుర్తుపట్టారా..?
Krishna Kowshik
కొత్త నీరు వస్తే పాత నీరు పోతుందన్న సామెత హీరోయిన్లకు సరిగ్గా సరిపోతుంది. హీరోలతో పోలిస్తే.. హీరోయిన్ల సినీ కెరీర్ చాలా తక్కువ. ఓ యాక్ట్రెస్ క్లిక్ అయ్యి.. ఒకటి రెండు సినిమాలు హిట్ కొడితే.. వరుస ఆఫర్లు వస్తాయి. దీంతో కెరీర్ కాస్త గాడిన పడుతుంది. అదే ఓ ప్లాప్ వస్తే.. ఆమెకు మరో ఛాన్స్ ఇచ్చేందుకు..వెనకా ముందు ఆలోచిస్తుంటారు దర్శక నిర్మాతలు. కొంత మంది క్లిక్ అయినా అవకాశాలు లేక.. కనుమరుగు అవుతుంటారు. అయితే హీరోయిన్ కెరీర్ ఐదు లేదా పదేళ్లు ఉంటుంది, లేదంటే 15 ఏళ్లు. అదీ కూడా సైడ్ పాత్రలకు, గెస్ట్ రోల్స్‌తో సరిపెట్టుకోవాల్సిందే. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే నటి మాత్రం ఇంచు మించు రెండు దశాబ్దాలకు పైగా అలరిస్తుంది అదీ కూడా స్టార్ హీరోయిన్‌గానే.
ఈ ఫోటోలో నేలపై బోర్లా పడుకున్న ఈ బుడ్డిదాన్ని చూశారా.. ఎంత క్యూట్‌గా ఉందో కదూ. .గుండ్రని కళ్లు, బూరెల్లాంటి బుగ్గలతో ముద్దొస్తుంది. ఫోటోకు ఫోజులిస్తున్న ఈ బేబి.. ఇప్పుడొక స్టార్ హీరోయిన్. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆమె.. తెలుగు, తమిళ్, మలయాళ ఇండస్ట్రీలను మడతపెట్టేస్తుంది. హీరోయిన్ 30 క్రాస్ చేస్తే అదేదో భూగోళం బద్దలు అయిపోయినట్లు, నటిగానే పనికి రాదన్నట్లు భావించే కొంత మంది దర్శక నిర్మాతలకు ఆమె ఓ చెంపపెట్టుగా మారింది. 40 ఏళ్ల వయస్సులో కూడా ఏ మాత్రం తరిగిపోని అందం తనది. ఇంకా చెప్పాలంటే బ్యూటీ అందం రెట్టింపు అయ్యిందనే చెప్పాలి. ఇంతకు ఈ పాప ఎవరో గుర్తపుట్టారా..? వర్షం మూవీతో తెలుగు వారి హృదయాలను కొల్లగొట్టిన త్రిష.
శైలుగా ఆమె నటన అప్పట్లో కాస్త ఓవర్ అనిపించినా.. ఫిదా కాని తెలుగు ఆడియన్స్ లేరు. తమిళంలో అప్పటికే క్రేజీ హీరోయిన్ అయ్యింది. వర్షం మూవీ సక్సెస్‌తో వరుసగా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు ఆమె ఖాతాలో హ్యాట్రిక్ హిట్స్ పడ్డాయి. దీంతో ఆమె లక్కీ స్టార్ అన్న ముద్ర పడింది. ఆ తర్వాత వచ్చిన అల్లరి బుల్లోడు, పౌర్ణమి, సైనికుడు సోసో అనిపించాయి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మూవీలో తన నటనతో మళ్లీ తళుక్కుమనిపించింది. ఇందులో మెచ్యూర్డ్, కన్వ్యూజ్డ్ గర్ల్‌గా కనిపిస్తుంది త్రిష. ఇక కృష్ణలో సంధ్య, బుజ్జిగాడులో చిట్టి, కింగ్‌లో శ్రావణిగా ఆమె పాత్రలు గుర్తిండిపోతాయి.
శంఖం, నమో వెంకటేశాయ, తీన్ మార్, బాడీ గార్డ్, దమ్ము, లయన్, నాయకి వంటి చిత్రాల్లో నటించింది. కన్నడ, హిందీ, మలమాళ సినిమాల్లోనూ మెప్పించింది. మధ్యలో కొన్ని ఫీమేల్ లీడ్, హార్రర్ చిత్రాలు చేసినప్పటికీ అంతగా ఆదరించలేదు ప్రేక్షకులు. 2015లో బిజినెస్ మ్యాన్ వరుణ్‌తో ఎంగేజ్ మెంట్ చేసుకుని.. ఆరు నెలలు తిరగకుండానే క్యాన్సిల్ చేసుకుంది. అన్ని సమస్యలను అధిగమించి.. 96 అనే తమిళ మూవీతో మళ్లీ కంబ్యాక్ ఇచ్చింది. సెటిల్డ్ ఫెర్మామెన్స్‌తో థ్రిల్ చేసింది. పొన్నియన్ సెల్వం 1, 2ల్లో అయితే పిచ్చెక్కించింది. ఆమె ఆహార్యానికి, నటనకు మళ్లీ తమ పాత త్రిషను చూసుకున్నారు ఫ్యాన్స్. గత ఏడాది లియో విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది అమ్మడు. ప్రస్తుతం ఆమె తమిళంలో విదా ముయర్చి, థగ్ లైఫ్, మలయాళంలో రామ్, తెలుగులో విశ్వంభర, హిందీలో సల్మాన్ ఖాన్ తో నటిస్తోందని టాక్ వినిపిస్తోంది.