iDreamPost
android-app
ios-app

Pushpa 2: పుష్ప 2 విడుదల మళ్లీ వాయిదా..? విదేశాల్లో డైరెక్టర్‌, హీరో.. అసలేం జరుగుతోంది

  • Published Jul 17, 2024 | 11:33 AM Updated Updated Jul 17, 2024 | 11:33 AM

Pushpa 2 Not Releasing In 2024: పుష్ప 2 సినిమాకు సంబంధించి ఓ గాసిప్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకు ఏంటా రూమర్‌ అంటే.. పుష్ప 2 విడుదల ఈ ఏడాదిలో ఉండదని తెలుస్తోంది. అందుకు అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు..

Pushpa 2 Not Releasing In 2024: పుష్ప 2 సినిమాకు సంబంధించి ఓ గాసిప్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకు ఏంటా రూమర్‌ అంటే.. పుష్ప 2 విడుదల ఈ ఏడాదిలో ఉండదని తెలుస్తోంది. అందుకు అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు..

  • Published Jul 17, 2024 | 11:33 AMUpdated Jul 17, 2024 | 11:33 AM
Pushpa 2: పుష్ప 2 విడుదల మళ్లీ వాయిదా..? విదేశాల్లో డైరెక్టర్‌, హీరో.. అసలేం జరుగుతోంది

తెలుగులో మాత్రమే కాక పాన్‌ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్న సినిమా ఏది అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు పుష్ప 2 సినిమా. ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రాధాన పాత్రలో.. సుకుమార్‌ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో తెరెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పుష్ప భారీ విజయం సాధించడంతో.. సీక్వెల్‌ని మరో లెవల్‌కి తీసుకెళ్లాలని మేకర్స్‌ డిసైడ్‌ అయ్యారు. ఇక ఈ ఏడాది ఆగస్ట్‌లో పుష్ప 2 సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ షూటింగ్‌ పూర్తి కాకపోవడంతో.. విడుదల వాయిదా పడింది. డిసెంబర్‌ 6న రిలీజ్‌ చేస్తామని మేకర్స్‌ వెల్లడించారు. అయితే తాజా అప్డేట్‌ ఏంటంటే.. పుష్ప 2 ఈ ఏడాది రిలీజ్‌ కావడం దాదాపుగా అసాధ్యం అనే అంటున్నారు. అందుకు అనేక కారణాలు చెబుతున్నారు.

ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్‌ ఆగిపోయిందని తెలుస్తోంది. దీనికి కారణం దర్శకుడు సుకుమార్‌, హీరో అల్లు అర్జున్‌ ఇద్దరు విదేశాలకు వెకేషన్‌ వెళ్లారని తెలుస్తోంది. సుకుమార్‌ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడని.. ఇక బన్నీ.. యూరోప్‌ ట్రిప్‌కు వెళ్లాడని ఫిల్మ్‌ నగర్‌లో టాక్‌. ఆదివారం నాడు బన్నీ రిటర్న్‌ అయ్యాడు. ఈ క్రమంలో బన్నీ లుక్‌కి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇందులో బన్నీ లుక్‌ చూసిన వారు షాక్‌ అవుతున్నారు. గత కొన్నాళ్లుగా బన్నీ పుష్ప 2 కోసం గడ్డం, పెద్ద జుట్టు లుక్‌తోనే కనిపించాడు. కానీ ఎయిర్ పోర్టులో బన్నీ లుక్ చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం బన్నీ గడ్డం తీసేశి.. ట్రిమ్ చేసుకున్నాడు.

Pushpa

ఆ గడ్డం పుష్ప రాజ్ లుక్‌లోకి రావాలంటే చాలా సమయం పడుతుందని.. అసలు బన్నీ ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఈ సినిమాకి 30 రోజుల రెగ్యులర్ షూటింగ్ పెండింగ్ ఉంది. అయితే షూట్ డిలే అవుతున్న నేపథ్యంలో బన్నీ అప్సెట్‌ అయ్యాడని.. త్వరగా షూటింగ్‌ కంప్లీట్‌ చేయాలని ఒత్తడి చేస్తున్నాడని తెలుస్తోంది. ఏకంగా మూడు యూనిట్లు ఒకేసారి రంగంలోకి దింపి షూటింగ్ పూర్తి చేయాలని అల్లు అర్జున్‌.. దర్శకుడు సుకుమార్‌కు సూచించాడని.. కానీ ఆయన మాత్రం తొందరపడవద్దని అన్నట్లుగా సమాచారం.

అంతేకాక ఆగస్టు నెలాఖరు లోపు సినిమా షూటింగ్ పూర్తి చేసినా.. పుష్ప పెద్ద సినిమా కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్‌కి మరో రెండు నెలలు పట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అదిగాక సుకుమార్ లాంటి పర్ఫెక్షనిస్ట్ దర్శకుడు కావడంతో.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌కు మరింత సమయం పట్టే అవకాశం ఉందని.. ఇది మరింత ఆలస్యం అయ్యి.. సినిమా ఈ ఏడాది కూడా విడుదల కాదనే గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి అంటున్నారు. ఇక పుష్ప చిత్రంలో బన్నీతో పాటుగా రష్మిక మందన్న, ఫాహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet