iDreamPost
android-app
ios-app

Mahesh-Rajamouli మహేష్ రాజమౌళి – ఇద్దరి ప్లాన్లు వేరే

  • Published Apr 26, 2022 | 1:00 PM Updated Updated Apr 26, 2022 | 1:00 PM
  • Published Apr 26, 2022 | 1:00 PMUpdated Apr 26, 2022 | 1:00 PM
Mahesh-Rajamouli మహేష్ రాజమౌళి – ఇద్దరి ప్లాన్లు వేరే

ఆర్ఆర్ఆర్ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించాక రాజమౌళి రెస్ట్ తీసుకోవడానికి ఫ్యామిలీతో సహా దుబాయ్ వెళ్లిపోయారు. నిజానికి ముందే ప్లాన్ చేసుకున్నప్పటికీ ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగా ఫ్యామిలీ రిక్వెస్ట్ చేయడంతో ఆగారని ఇన్ సైడ్ టాక్. మరోవైపు మహేష్ బాబు కూడా అక్కడికే వెళ్లారని, ఇద్దరూ కలిసి నెక్స్ట్ చేయబోయే ప్యాన్ ఇండియా ప్రాజెక్టు కోసం డిస్కషన్స్ చేయబోతున్నారని ఏవేవో కథనాలు కొన్ని మీడియా వర్గాల్లో వచ్చాయి. కానీ అవేవి నిజం కాదు. వాస్తవానికి ప్రిన్స్ వెళ్ళింది పారిస్ కి. ఆ మేరకు నమ్రతా శిరోద్కర్ ఫోటోలతో సహా క్లారిటీ ఇచ్చేశారు. అయినా ఇప్పటికిప్పుడు ఇంత అర్జెంట్ గా దుబాయ్ కి వెళ్లాల్సిన పని ప్రస్తుతానికి లేదు.

ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇద్దరికీ వేర్వేరు కమిట్ మెంట్స్ ఉన్నాయి. మహేష్ సంగతి చూస్తే ఇండియా తిరిగి రాగానే సర్కారు వారి పాట ప్రమోషన్లు చూసుకోవాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ తాలూకు వర్క్స్ ఉన్నాయి. తాను కూడా నిర్మాణ భాగస్వామి కాబట్టి దగ్గరుండి చూసుకుంటాడు. ఇది రిలీజయ్యాక త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఎప్పటి నుంచి మొదలుపెట్టాలనేది డిసైడ్ చేయాలి. లొకేషన్లు, షెడ్యూల్స్, క్యాస్టింగ్ తదితర వ్యవహారాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మహేష్ చేస్తాడని కాదు కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. సో రాజమౌళి సినిమా కథేంటి అని ఆలోచించే టైం కూడా ఇప్పటికైతే లేదు.

ఇక రాజమౌళి సంగతి చూస్తే కథకు సంబంధించిన టెన్షన్ విజయేంద్ర ప్రసాద్ ది. ఆయన ఫస్ట్ వెర్షన్ ఇస్తే అప్పుడు జక్కన్న టీమ్ తో కలిసి కూర్చుని బెటర్ మెంట్ కోసం వర్క్ చేస్తాడు. ఇదంతా టైం పట్టే తతంగం. రాజమౌళి మహేష్ బాబు నిజంగా కలుసుకున్నా చేయగలిగింది ఏమి లేదు. ఎయిర్ పోర్ట్ లో విడివిడిగా వాళ్ళను చూసి కలిసే వెళ్తున్నారని కథనాలు వడ్డించిన తీరు నిజంగా కామెడీనే. ట్రిపులార్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రాజమౌళి మహేష్ తో చేయబోతున్న సినిమా కావడంతో అసలు షూటింగ్ మొదలుకాకుండానే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాపా లేక స్పై నేపధ్యమా అనేది తెలియాల్సి ఉంది.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgit girişgrandpashabetEscortes Belgique