iDreamPost
android-app
ios-app

రాధేశ్యామ్ డైరెక్టర్ మరో భారీ బడ్జెట్ మూవీ! ఇంత నమ్మకం దేనికి?

  • Published Feb 06, 2024 | 8:34 PM Updated Updated Feb 06, 2024 | 8:34 PM

Director Radha Krishna Pan India Movie: రాధేశ్యామ్ సినిమా రిజల్ట్ డైరెక్టర్ రాధాకృష్ణ కెరీర్ పై గట్టి ప్రభావం చూపుతుంది అనుకున్నారు. కానీ, ఈ డైరెక్టర్ ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాకి రెడీ అయిపోతున్నాడు.

Director Radha Krishna Pan India Movie: రాధేశ్యామ్ సినిమా రిజల్ట్ డైరెక్టర్ రాధాకృష్ణ కెరీర్ పై గట్టి ప్రభావం చూపుతుంది అనుకున్నారు. కానీ, ఈ డైరెక్టర్ ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాకి రెడీ అయిపోతున్నాడు.

  • Published Feb 06, 2024 | 8:34 PMUpdated Feb 06, 2024 | 8:34 PM
రాధేశ్యామ్ డైరెక్టర్ మరో భారీ బడ్జెట్ మూవీ! ఇంత నమ్మకం దేనికి?

టాలీవుడ్ లో ఇప్పుడు అన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే వస్తున్నాయి. దాదాపు అందరూ కూడా పాన్ ఇండియా చిత్రాలనే తెరెకెక్కిస్తున్నారు. అయితే డైరెక్టర్ కు ఒకసారి పాన్ ఇండియా లెవల్లో ఎదురుదెబ్బ తగిలితే మళ్లీ అలాంటి ఒక అవకాశం వస్తుందని ఎవరూ అనుకోరు. కానీ, రాధేశ్యామ్ డైరెక్టర్ కు మాత్రం మరో భారీ బడ్జెట్ చిత్రం ఒకటి దక్కిందని తెలుస్తోంది. ఈసారి గోపీచంద్ తో రాధాకృష్ణ మూవీ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. పైగా ఈ మూవీ షూటింగా దాదాపుగా విదేశాల్లోనే ఉంటుందని చెబుతున్నారు. అయితే చాలామంది మరోసారి భారీ బడ్జెట్ రాధాకృష్ణకు ఎలా దొరికింది అనే ప్రశ్నలు వేస్తున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు.

ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా రాధేశ్యామ్ నచ్చలేదంటూ చాలానే కామెంట్స్ విన్నాం. ప్రభాస్ కెరీర్లో అలాంటి సినిమా మేము ఎక్స్ పెక్ట్ చేయలేదు అన్నారు. కానీ, రాధేశ్యామ్ లో ప్రభాస్ ని చూపించిన తీరు మాత్రం అందరికీ ఎంతో బాగా నచ్చుతుంది. ఈ మూవీలో ప్రభాస్ ని ఎంతో స్టైలిష్ గా చూపించారు. కానీ, ఓవరాల్ రిజల్ట్ మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. ఇప్పుడు రాధాకృష్ణకు సంబంధించిన ఒక వార్త అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే ఆయన చేతికి ఒక భారీ బడ్జెట్ చిత్రం దక్కిందని చెబుతున్నారు. అదికూడా ఈ మూవీలో హీరోగా గోపీచంద్ నటించబోతున్నారు అంటూ టాలీవుడ్ వర్గాల్లో కూడా టాక్ మొదలైంది.

గతంలో ఇప్పటికే గోపీచంద్- రాధాకృష్ణ కలిసి జిల్ సినిమా చేసిన విషయం తెలిసిందే. రూ.70 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లోఈ సినిమా ఉండబోతోందని చెబుతున్నారు. అలాగే ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మించబోతోందట. జానర్ విషయానికి వస్తే.. వార్ బేస్డ్ యాక్షన్ డ్రామాగా రాబోతోంది అంటున్నారు. అబ్రాడ్ నేపథ్యంలో.. ఎక్కువ శాతం షూటింగ్ కూడా విదేశాల్లోనే జరుగుతుందని చెబుతున్నారు. ఈ వార్త విన్న తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ అంత బడ్జెట్ సినిమా ఎలా దక్కించుకున్నారు అని. అయితే అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. ఎందుకంటే.. డైరెక్టర్ రాధాకృష్ణ ఒక సెన్సిబుల్ డైరెక్టర్. సినిమాని ఎంతో స్టైలిష్ తెరకెక్కించగలడు. పైగా టెక్నాలజీ మీద డైరెక్టర్ రాధాకృష్ణకు ఎంతో మంచి పట్టు ఉంది. ప్రస్తుతం సినిమాలు అన్నీ ఎక్కువ శాతం సాంకేతికత ఆధారంగానే తెరకెక్కుతున్నాయి. అందుకే రాధాకృష్ణ సినిమాని బాగా హ్యాండిల్ చేయగలడని నిర్మాతలకు గట్టి నమ్మకం అని చెబుతూ ఉంటారు.

ఒకటి, రెండు సినిమాల రిజల్ట్ ని బట్టి డైరెక్టర్ టాలెంట్ ని జడ్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒక మంచి గ్రిప్పింగ్ కథ దొరికితే సరైన హిట్టు కొట్టడం రాధాకృష్ణకు పెద్ద విషయం కాదు అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈసారి గోపీచంద్ తో గట్టిగానే కొట్టబోతున్నాడు అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇంక గోపీచంద్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న భీమా చిత్రం మార్చి 8న విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ తర్వాత గోపీచంద్ శ్రీనువైట్లతో సినిమా చేయబోతున్న విషయాన్ని ఇప్పటికే ప్రకటించాడు. ఈ చిత్రం తర్వాత రాధాకృష్ణతో కలిసి గోపీచంద్ మూవీ ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇది కూడా ఒక కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గానే తెరకెక్కే అవకాశం ఉంది. మరి.. గోపీచంద్- రాధాకృష్ణ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది అని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigbossgrandpashabet