iDreamPost
android-app
ios-app

ప్రభాస్ తో గోపీచంద్ మూవీ? లైవ్ లో అదిరిపోయే అప్డేట్!

  • Published Mar 01, 2024 | 5:49 PM Updated Updated Mar 01, 2024 | 5:53 PM

GopiChand Prabhas Multi Starrer: మ్యాచో మ్యాన్ గోపిచంద్ ప్రస్తుతం భీమా బిజీలో ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో ప్రభాస్ తో మల్టీ స్టారర్ పై క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు.

GopiChand Prabhas Multi Starrer: మ్యాచో మ్యాన్ గోపిచంద్ ప్రస్తుతం భీమా బిజీలో ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో ప్రభాస్ తో మల్టీ స్టారర్ పై క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు.

  • Published Mar 01, 2024 | 5:49 PMUpdated Mar 01, 2024 | 5:53 PM
ప్రభాస్ తో గోపీచంద్ మూవీ? లైవ్ లో అదిరిపోయే అప్డేట్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మ్యాచో మ్యాన్ గోపీచంద్ ప్రయాణం చాలా ప్రత్యేకమైంది. గోపి తండ్రి టి.కృష్ణ ఎంత గొప్ప దర్శకుడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి లెజండ్ వారసుడైనా.. గోపిచంద్ మాత్రం ఇండస్ట్రీలో చాలా కష్టపడుతూనే ఎదిగాడు. విలన్ గా స్టార్డం వచ్చాకే.. హీరోగా నిలదొక్కుకోగలిగాడు. ఇంతటి క్లిష్టమైన కెరీర్ లో గోపిచంద్ కి దొరికిన ఓ అరుదైన స్నేహం, సాయం, స్వాంతన, సొంత మనిషి ఎవరంటే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే. వర్షం సినిమా కోసం వీరిద్దరూ కలిసి పని చేశారు. అక్కడి నుండి వీరి స్వచ్ఛమైన స్నేహం మొదలైంది. మామూలుగానే సిగ్గరి అయిన గోపిచంద్ కి.. తనకన్నా ఎక్కువ బిడియం ఉన్న ప్రభాస్ తో స్నేహం బాగా కుదిరింది. అటు ప్రభాస్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఇక ఇక్కడి నుండి ప్రాణ స్నేహతులైన వీరిద్దరూ అభిమానులకి రెండు కళ్ళు అయ్యారు.

ప్రభాస్, గోపిచంద్ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే చూడాలన్నది అభిమానుల కల. దీని కోసం ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నం కూడా జరగలేదు. ఇక ఇదే సమయంలో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోవడంతో ఇక ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం అసాధ్యమని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ తో మూవీపై గోపిచంద్ ఓ క్లారిటీ ఇవ్వడం అందరికీ ఆనందంతో పాటు.., ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోంది. గోపిచంద్ ప్రస్తుతం “భీమా” అనే మూవీలో నటిస్తున్నాడు. మార్చి 8న భీమా  ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన గోపీచంద్.. ప్రభాస్ తో తన మల్టీస్టారర్ తప్పక ఉంటదని క్లారిటీ ఇచ్చాడు.

“ప్రభాస్ తో నా సినిమా తప్పక ఉంటుంది. కథ, కథనాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్పలేను. కాకపోతే  ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకి ఇద్దరం కలిసి వస్తాము అని గోపీచంద్ నొక్కి మరీ చెప్పాడు. ఇక గోపి తన ఆశలన్నీ ప్రస్తుతం భీమా మూవీపైనే పెట్టుకుని ఉన్నాడు. గోపిచంద్ కి ఈ మధ్యకాలంలో పెద్ద విజయాలు  దక్కలేదు. ఈ ఎఫెక్ట్ గోపి మార్కెట్ పై కూడా పడింది. ఇప్పడు భీమాతో కూడా హిట్ కొట్టకపోతే గోపిచంద్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

దీంతో.. ప్రభాస్ వీలైనంత త్వరగా మల్టీస్టారర్ మూవీకి ఓకే చెప్తే బాగుంటుందన్నది అభిమానుల ఆలోచన. కాకుంటే.. డార్లింగ్ ఇప్పుడు ఫుల్ బిజీ. నాలుగు సినిమాల వరకు పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ అయ్యాకైనా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందేమో చూడాలి. ఇక ఫాంటసీ యాక్షన్  డ్రామాగా తెరకెక్కిన “భీమా” టీజర్, ట్రైలర్ ప్రమోషనల్ వీడియోస్ అద్భుతంగా ఉండటంతో ప్రాజెక్ట్ పై మంచి బజ్ వచ్చింది. మరి.. ప్రభాస్- గోపిచంద్ కాంబోలో ఎలాంటి మూవీ వస్తే బాగుంటుంది?  మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio