Nagendra Kumar
ఇటీవలే టాలీవుడ్ లో వరుస ఫెయిల్యూర్ లను చవిచూసిన మేచో స్టార్ గోపిచంద్ తాజాాగా మరో కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించి కథను ఎంపిక చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ ఈసారి తెలుగు డైరెక్టర్లను నమ్ముకోకుండా ఏకంగా కన్నడ దర్శకుడు చెప్పిన కథను ఎంపిక చేసుకున్నాడు.
ఇటీవలే టాలీవుడ్ లో వరుస ఫెయిల్యూర్ లను చవిచూసిన మేచో స్టార్ గోపిచంద్ తాజాాగా మరో కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించి కథను ఎంపిక చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ ఈసారి తెలుగు డైరెక్టర్లను నమ్ముకోకుండా ఏకంగా కన్నడ దర్శకుడు చెప్పిన కథను ఎంపిక చేసుకున్నాడు.
Nagendra Kumar
నమ్మి చెడినవాడు లేడంటారు. కానీ హీరో గోపిచంద్ మాత్రం నమ్మి దెబ్బ తింటున్నాడు. ఏదనుకుంటే అది మిస్ ఫైర్ అయింది. ఈ మధ్యరోజుల్లో హిట్ అన్నమాటే గోపీచంద్ మర్చిపోయిన పరిస్థితి. మళ్ళీ మంచి డైరెక్టర్లకి, పెద్ద బ్యానర్లకే చేశాడు. కానీ ఫలితం మాత్రం శూన్యం. అసలిప్పుడు బిజినెస్ పరంగా గోపీచంద్ ప్లేస్ ఏమిటి, ఎక్కడున్నాడో కూడా ఎవ్వరూ అంచనా కట్టలేకపోతున్నారు. మారుతితో పక్కా కమర్షియల్, శ్రీవాసుతో రామబాణం రెండు రివర్స్ కొట్టాయి. మళ్ళీ రెండు పెద్ద బ్యానర్లే. అందుకే ఈసారి తెలుగు డైరెక్టర్లను నమ్మకూడదనుకున్నాడో ఏమో మరి కన్నడ దర్శకుడు హర్ష చెప్పిన కథని ఎంపిక చేసుకున్నాడు.
ఉండడానికి గోపీచంద్ కి పవర్ఫుల్ మాస్ ఇమేజ్ ఉంది. మేచో స్టార్ అనే గుర్తింపు కూడా సంపాదించుకున్నా తన మాస్ ఇమేజ్ ని నిలబెట్టే హిట్ ఇచ్చే దర్శకుడే గోపిచంద్ కి కరువైపోయాడు. రామబాణం సినిమా కథ ఒకటనుకుంటే, గోపీచంద్ చెప్పిన సూచనలు కథను పూర్తిగా మార్చేశాయని దర్శకుడు శ్రీవాసు బాధపడినట్టుగా సన్నిహితులు చెబుతుండేవారు. మరి మాస్ పల్స్ బాగా పట్టుకున్న మారుతి కూడా గోపీచంద్ మార్కెట్ పెంచలేకపోయాడు. సరికదా పాతాళంలో పడ్డట్టయింది గోపిచంద్ వ్యవహారం.
కాకపోతే, గోపీచంద్ ఫ్లాప్ వచ్చింది కదా అని కుమిలిపోతూ కూర్చోకుండా, మరోకథని ఎంపిక చేసుకుని వెంటనే బరిలోకి దిగుతాడు. ఇప్పుడు కూడా అదే పనిచేశాడు. మార్చి 8వ తేదీన విడుదల కాబోతూన్న భీమ్ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్న గోపీచంద్ ఈ మథ్య మీడియా ఇంటరాక్షన్లో తన ఫిలాసఫీ చెప్పుకొచ్చాడు.కష్టపడి సినిమా చేసినంత మాత్రాన ఆడియన్స్ మెచ్చుకుంటారని ఎక్కడా లేదని, విడుదలైన ప్రతీ సినిమా అంచనాలను అందుకుంటుందని రూల్ ఎవరూ రాయలేరని అన్నాడు. చేదు అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని, తప్పులను సరిదిద్దుకుని ముందుకెళ్ళడం తప్ప వేరే మార్గం లేదని వ్యక్తం చేశాడు.
కాకపోతే, ఇప్పుడీ భీమ్ సినిమా గోపీచంద్ నమ్మకాలను ఎంతవరకూ నిజం చేస్తాయని గోపీ అభిమానులు, పరిశ్రమ వర్గాలు కూడా ఎదురుచూస్తున్నారు. ఇదేదో చాలా ఫవర్ఫుల్ సబ్జెక్టు అంటున్నారు. నిర్మాత రాథామోహన్ కూడా గట్టి కాన్ఫిడెన్స్ కనబరుస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం. ఆడియన్స్ రోటీన్ సినిమాలని, రెగ్యులర్ కథలని చూడ్డం మానేశారు. తెరమీద ఏదో ఒక వింత విచిత్రం కనబడితే గానీ ధియేటర్ వైపే తిరిగి చూడడం లేదు. దానికి తోడు సోషల్ మీడియా దాడి. పక్కనే విష్వక్సేన్ గామి ఒకటి వచ్చి పడుతోంది. విష్వక్సేన్ గోపీచంద్ స్థాయి కాదు. కానీ గోపీచంద్ సినిమా బావుంటేనే గోపీచంద్ కి ప్లస్ అవుతుంది. లేదంటే మళ్ళీ వైకుంఠపాళీ అటే రిపీట్ అవుతుంది. బెస్టాఫ్ లక్ గోపీచంద్ అండ్ టీమ్.