iDreamPost
android-app
ios-app

భీమా సినిమాకి అఖండ సినిమాకీ ఎలాంటి పోలిక లేదన్న గోపీచంద్

  • Published Mar 05, 2024 | 9:55 PM Updated Updated Mar 05, 2024 | 9:55 PM

అభిమానుల చేత మ్యాచో స్టార్ అని పిలిపించుకునే గోపీచంద్ తాజాగా 'భీమా' అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ 10 ప్లస్ మిలియన్ వ్యూస్ సాధించి సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు పెంచింది.

అభిమానుల చేత మ్యాచో స్టార్ అని పిలిపించుకునే గోపీచంద్ తాజాగా 'భీమా' అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ 10 ప్లస్ మిలియన్ వ్యూస్ సాధించి సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు పెంచింది.

  • Published Mar 05, 2024 | 9:55 PMUpdated Mar 05, 2024 | 9:55 PM
భీమా సినిమాకి అఖండ సినిమాకీ ఎలాంటి పోలిక లేదన్న గోపీచంద్

అభిమానుల చేత మ్యాచో స్టార్ అని పిలిపించుకునే గోపీచంద్ తాజాగా ‘భీమా’ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ 10 ప్లస్ మిలియన్ వ్యూస్ సాధించి సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు పెంచింది. అయితే భీమా ట్రైలర్ రిలీజ్ తర్వాత నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ’ సినిమాతో పోల్చారు కొందరు నెటిజన్లు. ఇక సినిమా విడుదల సందర్భంగా ప్రింట్ అండ్ వెబ్ మీడియాకు గోపీచంద్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆయనను అఖండ సినిమాతో లింక్ గురించి అడగగా అలాంటిదేమీ లేదని వివరించారు.

మా సినిమాను ‘అఖండ’తో కంపేర్ చేస్తున్నారా? అలా పోలిస్తే మంచిదే కదా! కానీ, మా సినిమాకు, ‘అఖండ’కు కథ పరంగా ఎటువంటి సంబంధం లేదు. రెండూ వేర్వేరు సినిమాలు” అని గోపీచంద్ చెప్పారు. భీమా సినిమా ట్రైలర్లో పరశు రాముని క్షేత్రంలో రాక్షసులను అంతం చేయడానికి బ్రహ్మ రాక్షసుడు వచ్చాడని ఒక వాయిస్ ఓవర్ వస్తుంది. ఈ సినిమాలో గోపీచంద్ పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ తో పాటు మరో విభిన్నమైన గెటప్‌లోనూ కనిపించారు. ఆ గెటప్ చూసే బహుశా కొంతమందికి అఖండ సినిమా గుర్తుకు వచ్చి ఉంటుంది. అయితే తమ సినిమా కథకు బాలయ్య అఖండ సినిమా కథకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన గోపీచంద్… భీమాలో ఒక సెమీ ఫాంటసీ ఎలిమెంట్ ఉంటుందని, ఇంతవరకూ అది సినిమా ప్రమోషన్స్ లో బయట పెట్టలేదని చెప్పారు.

‘భీమా’ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ నిర్మించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంతకు ముందు గోపీచంద్ హీరోగా ‘పంతం’ అనే సినిమాని ఆయన నిర్మించారు. కాగా ‘భీమా’ సినిమాకి కన్నడ దర్శకుడు, కొరియోగ్రాఫర్ ఎ హర్ష దర్శకత్వం వహించారు. తెలుగులో ఆయనకు ఇదో తొలి చిత్రం కావడం విశేషం. మాస్ సినిమాలను తీయడంలో దిట్టగా పేరుపొందిన హర్ష చివరిగా కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ‘వేద’ సినిమాకు దర్శకత్వం వహించారు.