iDreamPost
android-app
ios-app

పుష్ప నుంచి మూడో పార్ట్.. ఆసక్తిరేపుతున్న న్యూ అప్‌డేట్

  • Published Feb 07, 2024 | 8:54 AM Updated Updated Feb 07, 2024 | 10:31 AM

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్ డేట్. పుష్ప మూవీకి మరో పార్టు రానుందట. డైరెక్టర్ సుకుమార్ పుష్ప మూడో పార్ట్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్ డేట్. పుష్ప మూవీకి మరో పార్టు రానుందట. డైరెక్టర్ సుకుమార్ పుష్ప మూడో పార్ట్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

  • Published Feb 07, 2024 | 8:54 AMUpdated Feb 07, 2024 | 10:31 AM
పుష్ప నుంచి మూడో పార్ట్.. ఆసక్తిరేపుతున్న న్యూ అప్‌డేట్

అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప మూవీ ఎంత ప్రత్యేకమో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రీజనల్ స్టార్ గా ఉన్న బన్నీని పాన్ ఇండియా ఐకాన్ స్టార్ గా మార్చేసింది పుష్ప మూవీనే. ప్రస్తుతం పుష్ప-2 తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్ పై రోజుకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తూనే ఉంది. ఆ అప్డేట్స్ తెలుసుకుని ఫ్యాన్స్ సైతం పూనకాలతో ఉగిపోతున్నారు. కానీ.., ఇప్పుడు వీటి అన్నిటిని తలదన్నే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పుష్ప సీరీస్ లో పుష్ప-2 మాత్రమే కాదు.., మరో పార్ట్ కూడా రానుందట. అంటే.. మొత్తం మూడు పార్టులుగా పుష్ప సినిమా తెరకెక్కనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఒకవైపు పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప సెకండ్ పార్టును ఆగస్టు 15కు రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పుష్ప ది రూల్ షూటింగ్ జెట్ స్పీడ్ తో చేస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. ఇలాంటి సమయంలో పార్ట్-3 గురించి న్యూస్ బయటకి రావడంతో ఈసారి సుకుమార్ ఇంకాస్త గట్టిగా ప్లాన్ చేశాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్, పుష్ప రోర్.. ఇలా మూడు పార్టులుగా తీసేందుకు డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.మొదటి పార్టులో కూలోడుగా ఉన్న పుష్ప స్మగ్లర్ గా ఎలా ఎదిగాడు అని చూపించిన సుకుమార్.. రెండో పార్టులో స్మగ్లింగ్ డీలర్ గా ఎలా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు అనేది చూపించబోతున్నారు.

part 3 form pushpa movie

ఇక మూడో పార్టులో తన సామ్రాజ్యం కోసం పుష్ప చేసే యుద్ధంతో మూవీని ముగించబోతున్నారని టాక్. అయితే.. పార్ట్ 3పై అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ పుష్ప పార్ట్3 రాబోతుందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక పుష్ప ది రూల్ లో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తున్నారు. మెయిన్ విలన్ గా ఫహద్ ఫాసిల్, నెగెటివ్ పాత్రల్లో సునీల్, అనసూయ అలరించనున్నారు. ఇక డైరెక్టర్ సుకుమార్- ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కాంబో లో రూపుదిద్దుకున్న పుష్ప ది రైజ్ 2021లో విడుదలైన విషయం తెలిసిందే. పుష్ప సినిమాకు ఆడియెన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ రాగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని నటనకు అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా వరించింది. మరి.. పుష్ప-3 కూడా నిజంగా వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş