iDreamPost
android-app
ios-app

Godfather 15 ఏళ్ళ తర్వాత కుదిరిన కాంబో

  • Published May 03, 2022 | 12:16 PM Updated Updated May 03, 2022 | 12:16 PM
  • Published May 03, 2022 | 12:16 PMUpdated May 03, 2022 | 12:16 PM
Godfather 15 ఏళ్ళ తర్వాత కుదిరిన కాంబో

ఇప్పుడంటే జానీ, శేఖర్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్లంటూ కొత్త జెనరేషన్ కి వీళ్ళే గుర్తున్నారు కానీ ఒకప్పుడు వన్ అండ్ ఓన్లీ ప్రభుదేవా అనే పేరు సౌత్ మొత్తం మారుమ్రోగిపోయింది. ముఖ్యంగా చిరంజీవి లాంటి హీరోలతో డాన్స్ లో కొత్త ఒరవడిని తీసుకొచ్చింది ఈయనే. ప్రేమికుడు బ్లాక్ బస్టర్ తో హీరోగా కూడా తన సత్తాను ఋజువు చేసుకున్న ప్రభుదేవా తర్వాతి కాలంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి లాంటి సినిమాలతో దర్శకుడిగానూ ఒక ముద్రవేయగలిగారు. అప్పటి నుంచి కొరియోగ్రఫీకి దూరంగా ఉన్న ఈ నృత్య దర్శకుడు ఇన్నేళ్ల తర్వాత మన మెగాస్టార్ చిరు, సల్మాన్ ఖాన్ లు నటించబోయే పాటకు కంపోజ్ చేయబోతున్నారు.

ఇది గాడ్ ఫాదర్ తో సాధ్యమవుతోంది. మలయాళం లూసిఫర్ ఆధారంగా రూపొందుతున్న ఈ రీమేక్ లో ప్రీ క్లైమాక్స్ కు ముందు వచ్చే పాటలో చిరు సల్మాన్ లు కలిసి డాన్స్ చేయబోతున్నారు. దీని కోసమే ప్రభుదేవాను తీసుకొచ్చారు. ఈయనకు చిరంజీవిని డైరెక్ట్ చేసిన అనుభవం కూడా ఉంది. శంకర్ దాదా జిందాబాద్ కు ఫలితం దక్కలేదు కానీ ఒకే ఫ్రేమ్ లో మెగా స్టార్ ని పవర్ స్టార్ ని చూపించిన క్రెడిట్ అందుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత తన అభిమాన కథానాయకులకు ఒకేసారి డాన్స్ కంపోజ్ చేసే అవకాశం దక్కడం విశేషమే. అయితే దీని వెనుక ఇంకొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి.

సల్మాన్ ఖాన్ వాంటెడ్, దబాంగ్ 3కి దర్శకుడు ప్రభుదేవానే. అప్పటి నుంచి ఇద్దరికీ మంచి బాండింగ్. దానికి తోడు నాకు నచ్చిన బెస్ట్ డాన్సర్ చిరునే అని చెప్పుకునే ప్రభుదేవాకు ఇలాంటి ఆఫర్ రావడం అదృష్టమే. ప్రస్తుతం ఆగస్ట్ లో విడుదల ప్లాన్ చేసుకున్నారు కానీ ఆచార్యకు దక్కిన చేదు ఫలితం దృష్ట్యా అంతకన్నా ముందే తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. గాడ్ ఫాదర్ కూడా ఫైనల్ లెగ్ షూట్ లో ఉంది కాబట్టి ఈ ఏడాదిలో మూడు సినిమాలు ఆశించవచ్చు. గాడ్ ఫాదర్ లో ఈ అంశాల సంగీతేమో కానీ తమన్ సంగీతం మీద భారీ అంచనాలున్నాయి. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో నయనతార ఓ కీలక పాత్ర చేశారు. 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss