iDreamPost
android-app
ios-app

వీడియో: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో గ్లోబల్ స్టార్ విగ్రహం

  • Published Sep 29, 2024 | 5:54 PM Updated Updated Sep 29, 2024 | 5:54 PM

Global Star Ram Charan: తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ఒకరు రామ్ చరణ్. నటనలో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటూ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు రామ్ చరణ్. తాజాగా రామ్ చరణ్ కి అరుదైన గౌరవం లభించింది.

Global Star Ram Charan: తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ఒకరు రామ్ చరణ్. నటనలో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటూ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు రామ్ చరణ్. తాజాగా రామ్ చరణ్ కి అరుదైన గౌరవం లభించింది.

వీడియో: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో గ్లోబల్ స్టార్ విగ్రహం

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు  ఎంతోమంది నట వారుసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో అతి కొద్దిమంది మాత్రమే మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల మనసు గెల్చుకున్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్  ఒకరు. మగధీర తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. చేసిన సినిమాలు తక్కువే అయిన దాదాపు అన్నీ బ్లక్ బస్టర్ గా నిలిచాయి. తాజాగా రామ్ చరణ్ మరో అరుదైన గౌరవాన్ని సంపాదించుకున్నారు.. ఈ విషయం ఐఫా 2024 అవార్డు సందర్భంగా ప్రకటించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. రామ్ చరణ్ కే కాదు.. ఆయన ఎందో ముద్దుగా పెంచుకుంటున్న పెట్ రైమ్ కి కూడా ఈ గౌరవం లభించడంతో కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా ఆస్కార్ నామినేషన్ కి వెళ్లింది. ఈ మూవీలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. అసలు విషయానికి వస్తే.. మేడమ్ టుస్సాడ్స్ లో రామ్ చరణ్ కు సంబంధించిన మైనపు విగ్రహం ఏర్పాటు చేసి అరుదైన గౌరవాన్ని అందించారు.

లండన్ లోని ప్రతిష్టాత్మకమైన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించినందుకు ఆయనకు గౌరవ సూచికంగా మేడమ్ టుస్సాడ్ లో ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం ఐఫా 2024 కార్యక్రమంలో అనౌన్స్ మెట్ చేయడంతో అటు సినీ సెలబ్రెటీలు ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ వెళ్లాడు రామ్ చరణ్. అక్కడ విగ్రహం తయారీకి కావాల్సిన కొలతలు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ దంపతులు ఎప్పుడూ తమ వెంట తీసుకువెళ్లే ఫ్రెండచ్ బార్బెట్ జాతికి చెందిన కుక్క పిల్ల రైమ్ ను ఎత్తుకొని ఉన్నటువంటి విగ్రహాన్ని తయారు చేసి అక్కడ ఉంచబోతున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా రామ్ చరణ్ కే కాదు ఆయన ముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్లకు ఈ రేంజ్ లో గౌరవం అభించడం ఎంతో సంతోషం అంటున్నారు అభిమాను.