iDreamPost
android-app
ios-app

ఘర్షణ విలన్ పండా ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలిస్తే నమ్మలేరు!

Gharshana Movie Villain.. లవ్ స్టోరీలే కాదు యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రాలను కూడా తెరకెక్కించ గల దర్శకుడు గౌతమ్ వాసు దేవ మీనన్. ఆ యాక్షన్ మూవీల్లో ఒకటి ఘర్షణ. 2004 వచ్చిన ఈ మూవీ హిట్ అందుకుంది. ఇందులో విలన్ పాత్రలో మెప్పించిన నటుడు గుర్తున్నాడా..?

Gharshana Movie Villain.. లవ్ స్టోరీలే కాదు యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రాలను కూడా తెరకెక్కించ గల దర్శకుడు గౌతమ్ వాసు దేవ మీనన్. ఆ యాక్షన్ మూవీల్లో ఒకటి ఘర్షణ. 2004 వచ్చిన ఈ మూవీ హిట్ అందుకుంది. ఇందులో విలన్ పాత్రలో మెప్పించిన నటుడు గుర్తున్నాడా..?

ఘర్షణ విలన్ పండా ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలిస్తే నమ్మలేరు!

మణిరత్నం తర్వాత తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్న కోలీవుడ్ దర్శకుడు గౌతమ్ వాసు దేవ మీనన్. ఫస్ట్ మూవీ మిన్నాలే (తెలుగులో చెలి)తోనే టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన గౌతమ్.. తెలుగులో తెరకెక్కించిన ఫస్ట్ మూవీ ఘర్షణ. సూర్య, జ్యోతిక హీరో హీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కాఖా కాఖాకి రీమేక్. ఇందులో వెంకటేశ్, ఆసిన్ హీరోహీరోయిన్లు. 2004లో విడుదలైన ఈ చిత్రం ఓకే అనిపించుకుంది. డీసీపీ రామచంద్రగా పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించాడు వెంకటేశ్. ఇక అతడి టీంలో రవి ప్రకాష్, డానియెల్ బాలాజీ, వంశీ కృష్ణ ఉంటారు. ఇక ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్. బీజీఎంతో ర్యాంప్ ఆడించేశాడు మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జైరాజ్.

ఇక పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెలియా.. చెలియా.. చెలియా దగ్గర నుండి.. ఆడతనమా.. చూడతరమా స్పెషల్ సాంగ్ వరకు కేక పుట్టించాయి. ఇక సినిమా విషయానికి వస్తే ఇంత పవర్ ఫుల్ పోలీసు ఉంటే.. అతడ్ని ఢీకొట్టేందుకు అంతే పవర్ ఫుల్ ఆంటోగనిస్ట్ ఉండాలి కదా. విలన్ అనే పదానికి ఫర్ ఫెక్ట్ సింక్ అయ్యాడు పండా. హీరోకే ఎదురెళ్లే పాత్ర. రామచంద్రకు మాస్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు.. పోలీసులను హడలెత్తే పాత్రలో మెప్పించాడు కాదు కాదు భయపెట్టాడు పండా. ఓ సినిమాను నెగిటివ్ రోల్ కూడా లేపుతుంది అనేందుకు ఘర్షణ పెద్ద ఉదాహరణ. ఈ మూవీ పేరు చెప్పగానే హీరో ఎంత హైలెట్ అవుతాడే.. విలన్ పాత్ర కూడా అంతలా గుర్తించిపోయేలా పండా క్యారెక్టర్‌లో నటించాడు సలీమ్ బేగ్.

ఈ మూవీ అతడికి మంచి గుర్తింపును తెచ్చింది. తర్వాత పలు తెలుగులో పలు సినిమాల్లో బిజీ విలన్ అయ్యాడు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించాడు. గత కొన్ని రోజులుగా వెండితెరపై కనిపించడం లేదు. ఓ మూవీ విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తుంది. అదే గౌతమ్ వాసు దేవ్ మీనన్ తెరకెక్కించిన ధ్రువ నక్షత్రం. సినిమా స్టార్టింగ్ నుండి వివాదాల్లో చిక్కుకుంటుంది. గత నవంబర్‌లో విడుదల కావాల్సి ఉండగా.. ఆర్థిక సమస్యలు, ఇతర లీగల్ ఇష్యూస్ వల్ల విడుదలకు నోచుకోవడం లేదు. విక్రమ్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక మన విలన్ సలీమ్ బేగ్ విషయానికి వస్తే..మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అతడు.. తర్వాత ఇంటస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

జై మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్… గౌతమ్ మీనన్‌కు పరిచయం చేయడం..ఘర్షణలో పండా క్యారెక్టర్‌లో ఫిక్స్ చేయడం జరిగిపోయింది. అక్కడ నుండి వెనుతిరిగి చూడలేదు. అందరి వాడు, జగపతి, ఆంధ్రుడు, డాన్, ఒక్కమగాడు, కాస్కో, సీతా రాముల కళ్యాణం లంకలో, గోలిమార్, లెజెండ్, వినయ విధేయ రామ, ఆరడుగుల బుల్లెట్ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం కొత్త సినిమాలేమీ ఒప్పుకున్నట్లు లేదు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోస్ షేర్ చేస్తున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి