iDreamPost
android-app
ios-app

సలార్‌ 2 గురించి ప్రశాంత్‌ నీల్‌.. గరుడ రామ్‌కు ఏం చెప్పారు?

  • Published Dec 22, 2023 | 6:06 PM Updated Updated Dec 22, 2023 | 6:06 PM

సలార్‌ సినిమాను గరుడ రామ్‌ తన ఫ్యామిలీతో కలిసి చూశారు. అనంతరం మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సలార్‌ 2 మూవీ గురించి కూడా చెప్పారు.

సలార్‌ సినిమాను గరుడ రామ్‌ తన ఫ్యామిలీతో కలిసి చూశారు. అనంతరం మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సలార్‌ 2 మూవీ గురించి కూడా చెప్పారు.

  • Published Dec 22, 2023 | 6:06 PMUpdated Dec 22, 2023 | 6:06 PM
సలార్‌ 2 గురించి ప్రశాంత్‌ నీల్‌.. గరుడ రామ్‌కు ఏం చెప్పారు?

కేజీఎఫ్‌ 1 సినిమాలో విలన్‌గా నటించి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గరుడ రామ్‌. కేజీఎఫ్‌లో పవర్‌ ఫుల్‌ గరుడ పాత్రలో నటించి, అందర్నీ భయపెట్టారు. ఈ మూవీలో పాత్రనే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. అందరూ ఇప్పుడు ఆయన్ని గురుడ రామ్‌గానే పిలుస్తున్నారు. కేజీఎఫ్‌ తర్వాత గరుడ రామ్‌కు సౌత్‌ వరుస అవకాశాలు వచ్చాయి. స్టార్‌ హీరోల సినిమాల్లో విలన్‌గా నటించారు. ఇక, గరుడ్‌ రామ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ప్రశాంత్‌ నీల్‌.. ఆయన తన సినిమాల్లో వరుసగా అవకాశాలు ఇస్తున్నారు.

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో ప్రశాంత్‌ నీల్‌ తీసిన సలార్‌లోనూ గరుడ రామ్‌ ఉన్నారు. ఓ మంచి పాత్రలోనే నటించారు. ఇక, శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా సలార్‌ సినిమా విడుదల అయిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో చిత్రం విడుదల అయింది. గరుడ్‌ రామ్‌ బెంగళూరులో తన ఫ్యామిలీతో కలిసి ఈ ఉదయం సలార్‌ సినిమా చూశారు. మూవీ అయిపోయి బయటకు వచ్చిన ఆయన్ని కొంత మంది మీడియా మిత్రులు పలకరించారు.

Garuda ram About Salaar Movie

గరుడ రామ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ సెకండ్‌ హాఫ్‌ నుంచి ఉన్నాను. ఫస్ట్‌ హాఫ్‌నుంచి లేను. ఉన్నంత సేపు నా క్యారెక్టర్‌ అద్భుతంగా ఉంటుంది. అలా రాశారు నా క్యారెక్టర్‌ను ప్రశాంత్‌ నీల్‌ సార్‌. ఆయనకు నా ధన్యవాదాలు. ఓవర్‌ ఆల్‌గా సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరీగా ఉంది. నేను నా సినిమాలు చూడను. కేజీఎఫ్‌, సలార్‌ మాత్రమే చూశాను. సంతోషంగా అనిపించింది. అది కూడా కుటుంబంతో కలిసి చూశాను. నా ఫ్రెండ్స్‌తో పాటు అందరూ వచ్చారు. వాళ్లు చాలా ఎంజాయ్‌ చేశారు. అదే నాకు సంతోషం. నా కొడుకు సంతోషం వ్యక్తం చేశాడు. నా భార్య రివ్యూ ఇవ్వలేదు. ఇంటికి వెళ్లాక ఇస్తాను అంది. నేను సలార్‌ 1.. సలార్‌ 2లో కూడా ఉంటాను.

సలార్‌ 2 గురించి ప్రశాంత్‌ ఏమీ చెప్పలేదు. ఎప్పుడు షూటింగ్‌ ఉంటుందో కూడా చెప్పలేదు. ఆయన రమ్మన్నపుడు వెళ్లాలి’’ అని అన్నారు. కాగా, సలార్‌ ప్రీ బుకింగ్స్‌ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు క్రియేట్‌ చేసింది. కొన్ని కోట్ల రూపాయల బిజినెస్‌ను సాధించింది. ఓవర్‌సీస్‌లో పాత రికార్డులను తుడిచి పెట్టింది. ఇక, మొదటి రోజు కలెక్షన్ల విషయంలోనూ సలార్‌ రికార్డు సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు. సినిమా మొదటి రోజు 150 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని టాక్‌. మరి, గరుడ రామ్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş