iDreamPost
android-app
ios-app

Game Changer Vs Pushpa 2.. సోషల్ మీడియాని తగలబెట్టేస్తున్న ఫ్యాన్స్!

  • Published Nov 11, 2024 | 5:30 PM Updated Updated Nov 11, 2024 | 5:30 PM

Game Changer Vs Pushpa 2: ప్రస్తుతం సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్, పుష్ప 2 సినిమాల హవా మామూలుగా లేదనే చెప్పాలి. రెండు సినిమాల అప్ డేట్ లు రచ్చ చేస్తున్నాయి.

Game Changer Vs Pushpa 2: ప్రస్తుతం సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్, పుష్ప 2 సినిమాల హవా మామూలుగా లేదనే చెప్పాలి. రెండు సినిమాల అప్ డేట్ లు రచ్చ చేస్తున్నాయి.

Game Changer Vs Pushpa 2.. సోషల్ మీడియాని తగలబెట్టేస్తున్న ఫ్యాన్స్!

మొత్తానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ టీజర్ రానే వచ్చేసింది. రావడంతోనే సోషల్ మీడియాను తగలబెట్టేస్తుంది. చాలా రోజులకు ఓ కలర్ ఫుల్, గ్రాండియర్ సినిమాను చూడబోతోన్నట్టుగా అనిపిస్తోందని అటు చరణ్ ఫ్యాన్స్, ఇటు శంకర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇది ప్యూర్ శంకర్ మార్క్ సినిమా అని కామెంట్స్ విపిస్తున్నాయి. ఒక్క టీజర్ తోనే మాకు ఫుల్ మీల్స్ పెట్టేశావ్ గురూ, ఇక నీకు గుడి కట్టేస్తామ్ అని రామ్ చరణ్ ఫ్యాన్స్ శంకర్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గేమ్ చేంజర్ టీజర్ రికార్డులు మోత మొగిస్తున్నాయంటూ మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు..

కొంత మంది ఫ్యాన్స్ అయితే దేవర టీజర్, పుష్ప టీజర్‌ల రికార్డులను తెరపైకి తీసుకు వస్తున్నారు. వాటితో గేమ్ చేంజర్ టీజర్ ని కంపేర్ చేస్తున్నారు. ముఖ్యంగా పుష్ప 2 తో కంపేర్ చేస్తూ ఫ్యాన్ వార్ స్టార్ట్ చేస్తున్నారు కొందరూ ఫ్యాన్స్. ఇద్దరి ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గట్లేదు. పుష్ప 2 ఫీవర్ కూడా మామూలుగా లేదనే చెప్పాలి. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా సోషల్ మీడియాని తెగ ఊపేస్తుంది. నేషనల్ వైడ్ గా తెగ ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలను తెగ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. మా సినిమా గొప్ప అంటే మా సినిమా గొప్ప అని గొడవలు పడుతున్నారు. ఈ సినిమాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా తెగ వైరల్ చేసేస్తున్నారు. హ్యాష్ ట్యాగ్ లను ఓ రేంజిలో ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా పుష్ప 2 ట్రైలర్ నవంబర్ 17 వ తేదీన విడుదల కానుందని టీం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే ఈ ట్రైలర్ ని టాప్ లో పెట్టేశారు బన్నీ అభిమానులు. నవంబర్ 17 న రికార్డుల స్పెల్లింగ్ ఏంటో నేర్పిస్తామని కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ ఆరంభం మాత్రమే అని అసలు రచ్చ ట్రైలర్ రిలీజ్ అయ్యాక చూపిస్తామని అంటున్నారు.

ఇలా అటు రామ్ చరణ్ అభిమానులు గేమ్ ఛేంజర్  అప్ డేట్ లని ట్రెండ్ చేస్తూ రచ్చ చేస్తుంటే, ఇటు బన్నీ ఫ్యాన్స్ కూడా అసలు తగ్గేదెలే అన్నట్లు పుష్ప 2 అప్ డేట్ లను తెగ హైలెట్ చేస్తున్నారు. ఏది ఏమయినా కానీ ఈ రెండు సినిమాల పోటీకి సోషల్ మీడియా మాత్రం దద్దరిల్లిపోతుందనే చెప్పాలి. ఎక్కడ చూసినా కూడా ఈ రెండు సినిమాల హ్యాష్ ట్యాగ్స్ తాండవం చేస్తున్నాయి. ఇక ఇప్పుడే ఇలా ఉంటే ఈ సినిమాలు విడుదల అయ్యాక రచ్చ ఇంకెలా ఉంటుందో చూడాలి. ఇక ఈ రెండు సినిమాల పోటీ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş