iDreamPost
android-app
ios-app

Gabbar Singh Re-release: గబ్బర్ సింగ్ రీ రిలీజ్ క్రేజ్.. ప్రసాద్ ఐ మ్యాక్స్ దగ్గర పవన్ భారీ కటౌట్!

  • Published Aug 28, 2024 | 5:02 PM Updated Updated Aug 29, 2024 | 1:05 PM

Pawan Kalyan Cutout, Gabbar Singh 4K Re-Release: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీ 'గబ్బర్ సింగ్' రీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ దగ్గర పవన్ కళ్యాణ్ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు.

Pawan Kalyan Cutout, Gabbar Singh 4K Re-Release: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీ 'గబ్బర్ సింగ్' రీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ దగ్గర పవన్ కళ్యాణ్ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు.

  • Published Aug 28, 2024 | 5:02 PMUpdated Aug 29, 2024 | 1:05 PM
Gabbar Singh Re-release: గబ్బర్ సింగ్ రీ రిలీజ్ క్రేజ్.. ప్రసాద్ ఐ మ్యాక్స్ దగ్గర పవన్ భారీ కటౌట్!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తూ.. వారి హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.రిలీజ్ టైమ్ లో ఎలాంటి బాక్సాఫీస్ రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టాయో.. రీ రిలీజ్ ల్లోనూ అంతే రేంజ్ లో వసూళ్లను రాబడుతూ సత్తాచాటుతున్నారు మన హీరోలు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ కాబోతోంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ మూవీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భారీ కటౌట్ ను ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు.

‘గబ్బర్ సింగ్’.. పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో 2012లో వచ్చింది. దంబాగ్ మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. కాగా.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2న ఈ సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రీ రిలీజ్ ట్రైలర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు. రాష్ట్రంలో గబ్బర్ సింగ్ రీ రిలీజ్ క్రేజ్ మామూలుగా లేదు. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ దగ్గర పవన్ కళ్యాణ్ 40 అడుగుల భారీ కటౌట్ ను ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. 12 సంవత్సరాల తర్వాత థియేటర్లలో రచ్చ చేయడానికి వస్తున్నాడు గబ్బర్ సింగ్. అప్పట్లోనే రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టిన పవన్.. రీ రిలీజ్ లో ఏ రేంజ్ లో వసూళ్లను సాధిస్తాడో వేచి చూడాలి. కాగా..ఇటీవలే సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ల బర్త్ డే సందర్భంగా మురారి, డార్లింగ్,ఈశ్వర్ సినిమాలను రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss