iDreamPost
android-app
ios-app

Vishwambhara: చిరు విశ్వంభర నుంచి ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్

  • Published Aug 22, 2024 | 11:05 AM Updated Updated Aug 22, 2024 | 11:29 AM

Vishwambhara Movie first Look poster: స్టార్ సెలెబ్రిటీల బర్త్ డేస్ సంధర్బంగా.. వారి కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను రివీల్ చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్.

Vishwambhara Movie first Look poster: స్టార్ సెలెబ్రిటీల బర్త్ డేస్ సంధర్బంగా.. వారి కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను రివీల్ చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్.

  • Published Aug 22, 2024 | 11:05 AMUpdated Aug 22, 2024 | 11:29 AM
Vishwambhara: చిరు విశ్వంభర నుంచి ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్

సాధారణంగా స్టార్ సెలెబ్రిటీల బర్త్ డేస్ వస్తున్నాయంటే.. అభిమానులంతా ఎంతో ఉత్సాహంగా సెలెబ్రేట్ చేస్తూ ఉంటారు. అలాగే వారి కొత్త సినిమాలకు సంబంధిన అప్ డేట్స్ ఏమైనా వస్తాయేమో అని ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి అప్ డేట్స్ రావడం కూడా కామన్ అయిపోయింది. ఈ క్రమంలో ఈరోజు మెగాస్టార్ చిరు బర్త్ డే సందర్బంగా.. ఎప్పుడెప్పుడు చిరు నటిస్తున్న విశ్వంభర నుంచి అప్ డేట్ వస్తుందా అది ఏమై ఉంటుందా అని అభిమానులు.. ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ను ఇచ్చారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి.. అప్పటికి ఇప్పటికి.. ఎప్పటికీ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హీరో. ఇప్పటికీ చిరు తనదైన స్టైల్ లో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. సహజంగానే చిరు సినిమాలంటే అందరికి ఓ రకమైన క్యూరియాసిటీ ఉంటుంది. దీనితో ఈ సినిమాపై కూడా ఇప్పటికే భారీ బజ్ నెలకొంది. ఇక ఆగస్ట్ 22 న చిరు బర్త్ డే సంధర్బంగా.. విశ్వంభర నుంచి ఫ్యాన్స్ ను అదిరిపోయే అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. చిరంజీవిపై ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేశారు. త్రిశూలం పట్టుకొని మోస్ట్ పవర్ ఫుల్ లుక్ లో చిరు కనిపిస్తున్నారు. దీనితో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఈ పోస్టర్ ను బట్టి గమనిస్తే .. ఈసారి చిరుతో దర్శకుడు ఎదో గ్రాండ్ గానే ప్లాన్ చేశారనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై హైప్ ఉంది కాబట్టి..అభిమానులు కచ్చితంగా హిట్ చేసేస్తారు. ఇక ఈ సినిమాను జనవరి10,2025 న రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈసారి చిరు ఫ్యాన్స్ ను ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి.

ఇదిలా ఉండగా మరో వైపు.. చిరు బర్త్ డే సెలెబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఎలాగూ రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతుంది కాబట్టి.. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న చిరంజీవి ఇంద్ర సినిమాను రీరిలీజ్ చేశారు. రీరిలీజ్ కు ముందే బుకింగ్స్ విషయంలో ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు కలెక్షన్స్ విషయంలో ఎలాంటి ట్రెండ్ ను సెట్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇంద్ర సినిమా రీరిలీజ్ కు సంబంధించిన.. వీడియోస్ ఏ కనిపిస్తున్నాయి. ఇక మొదటి రోజు కంప్లీట్ అయ్యేలోపు రీరిలీజ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. మరి విశ్వంభర నుంచి వచ్చిన అప్ డేట్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetjojobetCasibom girişjojobetJojobet GirişcasibomjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibom